మేడమ్ చీఫ్ మినిస్టర్
మేడమ్ చీఫ్ మినిస్టర్ 2021లో హిందీలో విడుదలైన పొలిటికల్ డ్రామా సినిమా. టి. సిరీస్ ఫిలిమ్స్, ఏ కంగ్రా టాకీస్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, నరేన్ కుమార్, డింపుల్ ఖర్బందా నిర్మించిన ఈ సినిమాకు సుభాష్ కపూర్ దర్శకత్వం వహించాడు. రిచా చద్దా, సౌరభ్ శుక్లా, మానవ్ కౌల్, అక్షయ్ ఒబెరాయ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 జనవరి 22న విడుదలైంది.[2]
మేడమ్ చీఫ్ మినిస్టర్ | |
---|---|
దర్శకత్వం | సుభాష్ కపూర్ |
రచన | సుభాష్ కపూర్ |
నిర్మాత | భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, నరేన్ కుమార్, డింపుల్ ఖర్బందా |
తారాగణం | రిచా చద్దా మానవ్ కౌల్ |
ఛాయాగ్రహణం | జయేష్ నాయర్ |
కూర్పు | చంద్రశేఖర్ ప్రజాపతి |
సంగీతం | మంగేష్ దక్కడే |
నిర్మాణ సంస్థలు | టీ -సిరీస్ ఏ కంగ్రా టాకీస్ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 22 జనవరి 2021 |
సినిమా నిడివి | 122 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ /ఇంగ్లీష్ |
కథ
మార్చుతారా రూపమ్ (రిచా చద్దా) 1982లో ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో జన్మించిన రోజే, ఆమె తండ్రి రూపమ్ (ముక్తేశ్వర్ ఓహ్జా) ఒక అగ్ర కులానికి చెందినవారు ఆయనను హత్య చేస్తారు. ఆమె పుట్టుకతో కలత చెందిన తారా అమ్మమ్మ, రూపమ్ మరణం గురించి తెలుసుకున్నప్పుడు ఆగ్రహానికి గురవుతుంది. తారా పెద్దయ్యాక యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా పనిచేస్తుంది. ఆమె విశ్వవిద్యాలయంలో రాజకీయంగా చురుకైన విద్యార్థి ఇంద్రమణి త్రిపాఠి (అక్షయ్ ఒబెరాయ్) తో శారీకంగా కలుస్తారు. ఒక రోజు తాను గర్భవతినని ఇంద్రమణిని పెళ్లి చేసుకోవాలని కోరగా, కుల విభేదాల వల్ల సాధ్యం కాదని ఇంద్రమణి ఆమెకు చెప్పిఅబార్షన్ చేయించుకోమని సలహా ఇస్తాడు.
అందుకు ఆమె నిరాకరించి ఈ విషయాన్నీ బయటపెడతానని బెదిరించగా ఆమెపై గూండాలతో దాడి చేస్తారు. ఈ క్రమంలో అట్టడుగు కులాలు, అణగారిన ప్రజల కోసం పోరాడే పరివర్తన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన మాస్టర్ సూరజ్‌భాన్ (సౌరభ్ శుక్లా) ఆమెను కాపాడుతాడు. ఆమె అతనితో కలిసి పార్టీ కోసం కూడా పనిచేస్తుంది. ఆమె రాజకీయాల్లోకి వచ్చాక ఎలాంటి సవాళ్ళను ఎదురుకుంది ? వాటి నుండి ఎలా బయటపడింది అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- రిచా చద్దా[3]
- మానవ్ కౌల్
- అక్షయ్ ఒబెరాయ్
- సౌరభ్ శుక్లా
- సుభ్రజ్యోతి భరత్
- నిఖిల్ విజయ్
- బోలోరామ్ దాస్
- సంగం బహుగుణ
- శ్రేయ అవస్థి
- రవిజా చౌహన్
- సుశీల్ శుక్ల
- రాజ్ వర్ధన్ పాండే
మూలాలు
మార్చు- ↑ "Madam Chief Minister (2021)". British Board of Film Classification. Retrieved 20 July 2021.
- ↑ Andhra Jyothy (18 January 2021). "`మేడమ్ చీఫ్ మినిస్టర్` మేకింగ్ వీడియో!". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Sakshi (13 February 2020). "చీఫ్ మినిస్టర్ చద్దా". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.