మేము 2016లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2015లో విడుదలైన ‘పసంగ-2’ ను సాయి మణికంఠ క్రియేషన్స్ బ్యానర్‌పై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో ‘మేము’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు.[1] సూర్య, అమలాపాల్, బిందుమాధవి, రాందాస్, కార్తీక్ కుమార్, విధ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా జూలై 8న విడుదల చేశారు.[2]

మేము
దర్శకత్వంపాండిరాజ్
రచనపాండిరాజ్
నిర్మాతసూర్య
పాండిరాజ్
తారాగణంసూర్య
అమలాపాల్
బిందుమాధవి
నిశేష్
వైష్ణవి
కార్తీక్ కుమార్
ఛాయాగ్రహణంబాలసుబ్రమణియం
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంఅరోల్ కొరెల్లి
నిర్మాణ
సంస్థలు
2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్
ప్రసంగ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2016 జూలై 8 (2016-07-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

నవీన్(మిశేష్), నయన (వైష్ణవి) వారు చేసే అల్లరితో ప్రతి స్కూల్‌లో టీసీ తెచ్చుకొని అమ్మానాన్నలకు ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. నవీన్, నైనా హైపర్ యాక్టివ్‌గా ఉండడంతో ఏ.డి.హెచ్.డి అనే వ్యాధితో బాధ పడుతున్నారని డాక్టర్స్ చెప్పడంతో వారిని హాస్టల్‌లో చేర్పిస్తారు. హాస్టల్‌లో చేరిన ఇద్దరికీ అక్కడ వాతావరణం నచ్చకపోవడంతో అక్కడ దయ్యాలున్నాయని హాస్టల్ పిల్లల్ని భయపెట్టి అక్కడి నుండి తిరిగి ఇంటికి చేరుతారు. ఈ క్రమంలో వారిద్దరికీ రామనాదం(సూర్య), పద్మ(అమలాపాల్)ల పిల్లలతో స్నేహం ఏర్పడుతుంది. చైల్డ్ సైకియాట్రిస్ట్ అయిన రామనాదం నవీన్, నయనల సమస్య అర్ధం చేసుకున్న రామనాదం ఆ సమస్యలను పరిష్కరించగలిగారా? అందరి పిల్లలానే నవీన్, నయనలు మారారా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: మణికంఠ పిక్చర్స్
  • నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్
  • సంగీతం: అరోల్ కొరెల్లి
  • సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియం
  • పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, సాహితి
  • సహ నిర్మాతలు: ప్రసాద్ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి
  • ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
  • సమర్పణ: సూర్య, కె.ఇ .జ్ఞాన వేల్‌రాజా

మూలాలుసవరించు

  1. Sakshi (17 October 2015). "సూర్య కొత్త సినిమా 'మేము'". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  2. "Memu Movie: Showtimes". 2016. Retrieved 8 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మేము&oldid=3627996" నుండి వెలికితీశారు