మైత్రేయి ప్రాచీన భారతదేశంలో వేదకాలానికి చెందిన ఒక మహిళా తత్వవేత్త. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆమెను యజ్ఞవల్క్య మహర్షి ఇద్దరు భార్యలలో ఒకరిగా పేర్కొన్నారు.[1] ఆయన క్రీ.పూ 8 వ శతాబ్దంలో నివసించినట్లు అంచనా. మహాభారతంలో, కల్ప వేదాంగంలోని గృహ్య సూత్రాలలో మాత్రం ఆమెను ఒక అద్వైత వేదాంతిగానూ, బ్రహ్మచారిణిగానూ పేర్కొన్నారు. ప్రాచీన సంస్కృత కావ్యాలలో ఆమెను బ్రహ్మవాదిని (వేదాలకు భాష్యకర్త) అని కూడా పేర్కొన్నారు.

మైత్రేయి
మానవుడు
లింగంస్త్రీ మార్చు
పుట్టిన తేదీ1. millennium BCE మార్చు
మరణించిన తేదీ1. millennium BCE మార్చు
వృత్తితత్వవేత్త, రచయిత మార్చు
మతంహిందూధర్మం మార్చు
Copyright status as a creatorరచనలపై కాపీరైట్‌ల గడువు ముగిసింది మార్చు

ఋగ్వేదంలో దాదాపు 10 సూక్తాలు మైత్రేయి గురించి ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు లోని ఒక సంభాషణలో ఆమె భారతీయ తత్వశాస్త్రంలో ప్రధానమైన ఆత్మను గురించి విచారిస్తుంది. ఈ సంభాషణ ప్రకారం ఎవరికైనా ప్రేమ వారి ఆత్మను అనుసరించి కలుగుతుంది. అంతే కాకుండా అద్వైత సిద్ధాంతానికి మూలమైన ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని గురించి చర్చిస్తుంది. సురేశ్వరుడు రాసిన వర్తిక అనే భాష్యంలో ఈ సంభాషణలను మరింత వివరిస్తుంది.

వేదకాలంలో కూడా భారతీయ మహిళలకు చదువుకునేందుకు అవకాశాలుండేవని, వారు కూడా తత్వ విచారం చేసే వారని మైత్రేయిని ముఖ్య ఉదాహరణగా పేర్కొంటారు. భారతీయ మహిళలోని విజ్ఞానానికి ఆమెను ప్రతీకగా పేర్కొంటారు. ఢిల్లీలో ఆమె పేరు మీదుగా ఒక సంస్థను కూడా నెలకొల్పారు.

మూలాలు మార్చు

  1. Olivelle 2008, p. 140.
"https://te.wikipedia.org/w/index.php?title=మైత్రేయి&oldid=4011609" నుండి వెలికితీశారు