మైలార్‌దేవపల్లి

మైలార్‌దేవపల్లి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1][2] 2011 జనాభా లెక్కల ప్రకారం మైలార్‌దేవపల్లి గ్రామ లొకేషన్ కోడ్ (విలేజ్ కోడ్) 500409. ఇది రాజేంద్రనగర్ నుండి 6 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 12 కి.మీ.ల దూరంలో ఉంది.[3]

మైలార్‌దేవపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
మైలార్‌దేవపల్లి is located in తెలంగాణ
మైలార్‌దేవపల్లి
మైలార్‌దేవపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°19′06″N 78°27′07″E / 17.3183674°N 78.4519979°E / 17.3183674; 78.4519979
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - Type జి.ఏచ్.ఎం.సి
 - కార్పొరేటర్ -
పిన్ కోడ్ 500030
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలె మొఘల్ కాలనీ, దుర్గా నగర్, శాస్త్రి పురం, మొఘల్ కాలనీ, నవాబ్ సాహెబ్ కుంట, రాజేంద్రనగర్ మండలం, కిస్మత్‌పురా, శివరాంపల్లి మొదలైన ప్రాంతాలు మైలార్‌దేవపల్లికి సమీపంలో ఉన్నాయి.[5]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • పుంరాసర్ హనుమాన్ మందిరం
  • పోచమ్మ దేవాలయం
  • అయోధ్యనాథ్ ఆలయం
  • శ్రీ పంచాయతన శక్తి పీఠం
  • మస్జిద్ అష్రాహ్ ముభాషరా
  • అలీ భాయ్ కీ మసీద్
  • మస్జిద్-ఎ-మహమూదా
  • మస్జిద్ ఇ షర్ఫున్నీసా అబిద్
  • మస్జిద్_ఇ_ముహమ్మదియా

విద్యాసంస్థలు

మార్చు
  • ఇక్రా మిషన్ హైస్కూల్ & బాలికల జూనియర్ కళాశాల
  • అల్-జామియా-అస్-సున్నియా-దారుల్-ఉలూమ్-తైబా
  • ఏఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్
  • ప్రెసిడెన్సీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ సైన్సెస్
  • ప్రోగ్రెస్ జూనియర్ కళాశాల
  • శ్రీ విద్యానికేతన్ హైస్కూల్
  • ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
  • అల్ఫాజ్ స్టార్స్
  • ఫీనిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్
  • బ్రైట్ ఫ్యూచర్ హై స్కూల్

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మైలార్‌దేవపల్లి నుండి కోఠి, శివరాంపల్లి, ఉప్పల్, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎల్‌బి నగర్, మెహదీపట్నం, లక్డీకపూల్, సికింద్రాబాద్ జంక్షన్, టోలిచౌకి, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[6] బద్వేల్, ఫలక్ నుమా, ఉందానగర్ ప్రాంతాలలో సమీప రైల్వేస్టేషన్లు ఉన్నాయి.[7]

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Milardevpally, Vyasapuri, Mailardevpally Locality". www.onefivenine.com. Retrieved 2021-11-01.
  3. "Mailar Devpalle - City in Rajendranagar Mandal". www.indiagrowing.com. Archived from the original on 2021-10-30. Retrieved 2021-11-01.
  4. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
  5. "Mailardevpally, Nawab Saheb Kunta Locality". www.onefivenine.com. Retrieved 2021-11-01.
  6. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-11-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Nearest Railway Stations to Near Police Quarters Budvel Rajendranagar mandal Hyderabad Telangana India - Search Nearest Railway Stations of Any Place". trainspy.com. Retrieved 2021-10-30.

వెలుపలి లంకెలు

మార్చు