ప్రధాన మెనూను తెరువు


మొజిల్లా అనేది, Mozilla.org గ్రూప్ మొజిల్లా ఫౌండేషన్‌తోపాటుగా, ఇప్పుడు ఉనికిలో లేని నెట్‌స్కేప్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ మరియు దానికి సంబంధించిన అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌తో సంబంధంలో పలు విధాలుగా ఉపయోగించబడుతున్న పదం.

మొజిల్లా పదం మొదట్లో మూడు విశిష్ట అంశాలకోసం ఉపయోగించబడింది:

 • నెట్‌స్కేప్ నావిగేటర్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు‌ కోసం కోడ్‌నేమ్
 • మొజిల్లా అప్లికేషన్ సూట్ యొక్క అధికారిక, పబ్లిక్, ఒరిజనల్ పేరు ప్రస్తుతం సీ మంకీ పేరిట ప్రాచుర్యంలో ఉంది.
 • నెట్‌స్కేప్ చిహ్నం

మొజిల్లా పదానికి సంబందించిన వివిధ ఉపయోగాలు అవి మొదటినుంచి ఉపయోగించబడిన వరుస క్రమంలో దిగువ చర్చించబడతాయి.

విషయ సూచిక

నెట్‌స్కేప్ నావిగేటర్ కోడ్‌నేమ్సవరించు

చారిత్రకంగా, మొజిల్లా అంతర్గతంగా దాని ప్రారంభం నుండి నెట్‌స్కేప్ నావిగేటర్ వెబ్ బ్రౌజర్ యొక్క కోడ్‌నేమ్‌గా ఉపయోగించబడుతూ వచ్చింది. జమీ జవిన్‌స్కీ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక సమావేశంలో ఈ పేరును ప్రతిపాదించాడు.[1] ఈ పేరు "మొజాయిక్ కిల్లర్"[2] అనే పదాల సంక్షిప్తీకరణగా రూపొందించబడింది, నెట్‌స్కేప్ తన (అప్పటి ఏకైక) పోటీ బ్రౌజర్, మొజాయిక్‌కి ముగింపు పలుకుతుందని ఈ పదం సూచిస్తుంది. దీని లోగో కాల్పనిక రాక్షసి గాడ్జిల్లా పేరును ప్రస్తావిస్తుంది.

నెట్‌స్కేప్ చిహ్నంసవరించు

మూస:FixBunching

దస్త్రం:Mozilla Mascot.svg
అధికారిక మొజిల్లా మస్కట్

మూస:FixBunching

దస్త్రం:Mozilla boxing.gif
పూర్వపు మొజిల్లా మస్కట్

మూస:FixBunching

 
మొజిల్లా మస్కట్ మాక్ OS 9 కోసం మొజిల్లా అప్ప్లికేషన్ సూట్ యొక్క స్టార్టప్ స్క్రీన్

మూస:FixBunching మొజిల్లా, పూర్వం మొజాయిక్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ అని పిలువబడిన, ఇప్పుడు తొలగించబడిన నెట్‌స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ యొక్క చిహ్నం. మొదట్లో, ఈ చిహ్నం హెల్మెట్ ధరించిన రోదసీయాత్రికుడు లేదా "అంతరిక్షమానవుడు" తోపాటు పలు రూపాలు తీసుకుంది. చివరకు గాడ్జిల్లా వంటి చక్కటి పేరుతో సమవసించే గాడ్జిల్లా వంటి బల్లి చివరి ఎంపికగా అయింది. దీన్ని 1994లో డేవ్ టిటుస్ రూపొందించారు.

కంపెనీ ప్రారంభ సంవత్సరాలలో మొజిల్లా ప్రధానంగా నెట్‌స్కేప్ వెబ్‌సైట్‌లో కనిపించేది. అయితే, మరింత "ప్రొఫెషనల్" గుర్తింపును ప్రదర్శించేందుకోసం (ప్రత్యేకించి కార్పొరేట్ క్లయింట్‌ల కోసం) దాన్ని తొలగించారు. మొజిల్లాను నెట్‌స్కేప్ లోపల ఉపయోగించడం కొనసాగించారు. అయితే దీన్ని ఉద్యోగులకు ఇచ్చే T-షర్ట్‌లపై పొందుపర్చేవారు లేదా మౌంటెన్ వ్యూలోని నెట్‌స్కేప్ క్యాంపస్ గోడలమీద ఆర్ట్‌వర్క్‌గా చిత్రించేవారు. నెట్‌స్కేప్ బ్రౌజర్ సోర్స్ కోడ్ విడుదల అయిన తర్వాత మొజిల్లా బల్లి రంగు దాని అసలు రంగు అయిన ఆకుపచ్చ నుంచి ఎరుపు రాక్షసి రూపానికి మారింది.[3]

వెబ్‌సైట్ డిక్షనరీ న్యూహూను నెట్‌స్కేప్ 1998లో పొందిన తర్వాత వారు బ్రాండ్ పేరును ఓపెన్ యూనివర్శిటీ ప్రాజెక్ట్‌‌గా మార్చారు, మొజిల్లా ప్రాజెక్టుతో దాని సారూప్యత కారణంగా దీనికి "dmoz" (మొజిల్లా డైరెక్టరీ) అనే మారుపేరు కూడా పెట్టారు. మొజిల్లా చిహ్నం సైట్‌లోని ప్రతి పేజీలో ఉంచబడింది, ఈ రోజుకీ ఇది ఇలాగే ఉంది. నెట్‌స్కేప్ కమ్యూనికేషన్స్ Mozilla.org ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌లోని దాని ప్రతిమా నిర్మాణం [1]లో రెడ్ మొజిల్లా సంకేతాన్ని ఉపయోగించడం కొనసాగించింది.

అనేక బ్రౌజర్ల యొక్క "యూజర్ ఏజెంట్ స్ట్రింగ్‌"‌లో భాగంసవరించు

యూజర్లు (వెబ్‌ బ్రౌజర్ వంటి యూజర్ ఏజెంట్ ద్వారా) ఒక వెబ్‌సైట్‌ను సందర్శించేటప్పుడు ఒక టెక్స్ట్ స్ట్రింగ్ సాధారణంగా వెబ్‌ బ్రౌజర్ యొక్క యూజర్ ఏజెంట్‌ను గుర్తించడానికి పంపబడుతుంది. ఇది "యూజర్ ఏజెంట్‌ స్ట్రింగ్"గా ప్రాచుర్యంలో ఉంది. నెట్‌స్కేప్ వెబ్ బ్రౌజర్ తాను నిర్వహిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కొంత సమాచారాన్ని అనుసరించి తనకు తానుగా "మొజిల్లా/<version>"గా గుర్తించబడింది.

ఎందుకంటే నెట్‌స్కేప్ బ్రౌజర్ ప్రారంభంలో ఇతర బ్రౌజర్లలో అందుబాటులో లేని అనేక అంశాలను ఉనికిలోకి తీసుకువచ్చింది మరియు మార్కెట్‌లో ఆధిపత్యం కోసం సత్వరం దూసుకువచ్చింది, అనేక వెబ్‌సైట్లు పనిచేయడానికి లేదా యూజర్ ఏజెంట్ స్ట్రింగ్‌లో మొజిల్లా యొక్క తగు వెర్షన్‌ని కనుగొన్నప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేయడానికి రూపొందించబడ్డాయి. అందుచేత, పోటీ పడుతున్న బ్రౌజర్లు ఆ సైట్లతో పని చేయించడానికి గాను ("క్లాక్‌ని అనుకరించడానికి" లేదా ఈ స్ట్రింగ్‌ని "కనిపెట్ట"డానికి) మొదలు పెట్టాయి. దీనికి సంబంధించిన మొట్టమొదటి ఉదాహరణ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, "మొజిల్లా/<version> (అనుకూలమైన; MSIE <version>..." అని మొదలయ్యే యూజర్ ఏజెంట్ స్ట్రింగ్‌ని ఉపయోగించడం, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని అభివృద్ధి చేస్తున్న కాలంలో ముఖ్య ప్రత్యర్థిగా ఉన్న నెట్‌స్కేప్ కోసం ఉద్దేశించిన కంటెంట్‌ని అందుకోవడం కోసం ఇలా చేశారు. ఈ యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ ఫార్మాట్‌ని ఇతర యూజర్ ఏజెంట్ల ద్వారా నకలు చేయబడుతూ వచ్చింది మరియు ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ మార్కెట్‍‌లో ఆధిపత్యం సాధించిన తర్వాత కూడా ఇది నిలకడగా కొనసాగుతూనే ఉంది.

మొజిల్లా ప్రాజెక్టుసవరించు

మొజిల్లా ఫౌండేషన్సవరించు

"మొజిల్లా" కొన్నిసార్లు ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌గా ప్రస్తావించబడింది, నెట్‌స్కోప్ కోసం తదుపరి తరం ఇంటర్నెట్ సూట్‌ని రూపొందించడానికి ఇది కనుగొనబడిందని భావించబడింది. మొజిల్లా ఆర్గనైజేషన్ ఒర కొత్త సూట్‌ని రూపొందించడానికి 1998లో స్థాపించబడింది. 2003 జూలై 15న సంస్థ లాంఛనప్రాయంగా లాభేతర సంస్థగా నమోదు చేయబడింది మరియు ఇది మొజిల్లా ఫౌండేషన్‌గా మారింది. సంస్థ ఇప్పుడు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ మరియు మొజిల్లా థండర్ బర్డ్ ఈమెయిల్ అప్లికేషన్‌తోపాటు ఇతర సాఫ్ట్‌వేర్లను రూపొందించి నిర్విహిస్తోంది. మొజిల్లా ట్రేడ్‌మార్క్‌ని 2006లో మొజిల్లా ఫౌండేషన్ కైవశం చేసుకుంది.

మొజిల్లా కార్పొరేషన్సవరించు

2005 ఆగస్టు 3న మొజిల్లా ఫౌండేషన్ మొజిల్లా కార్పొరేషన్‌ని రూపకల్పవను ప్రకటించింది, ఇది మొజిల్లా ఫౌండేషన్ యొక్క సంపూర్ణ యాజమాన్యంలోని లాభేతర పన్నుపరిధిలోని అనుబంధ సంస్థ, ఫైర్‌ఫాక్స్‌ని ఎండ్ యూజర్లకు సరఫరా చేయడమే దీని ప్రధాన లక్ష్యం. దీనికి ఈ ఉత్పత్తులకుపై విదేశీ మార్కెటింగ్ మరియు స్పాన్షర్‌షిప్ కూడా ఉంది.

మొజిల్లా మెసేజింగ్సవరించు

2008 ఫిబ్రవరి 19న మొజిల్లా మెసేజింగ్ ప్రకటించబడింది, ఇది కూడా మొజిల్లా కార్పొరేషన్ లాగే, మొజిల్లా ఫౌండేషన్ యొక్క లాభేతర అనుబంధ సంస్థ. దీని ప్రధాన లక్ష్యం థండర్‌బర్డ్‌‍పై ఉంది మరియు ఇతర ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మీడియాకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని చేయడం కూడా దీని లక్ష్యాల్లో ఒకటి.

మొజిల్లా అప్లికేషన్ సూట్సవరించు

 
వికీ న్యూస్ పేజ్ ను చూపిస్తున్న మొజిల్లా 1.7

1998 జనవరి 22న తన సోర్స్ కోడ్‌ని భవిష్య అభివృద్ధికోసం రీలైసెన్స్‌ చేయనున్నట్లు నెట్‌స్కేప్ ప్రకటించింది. 1998 మార్చిలో, నెట్‌స్కేప్ తన పాపులర్ నెట్‌స్కేప్ కమ్యూనికేటర్ ఇంటర్నెట్ సూట్ కోసం కోడ్‌లో చాలాభాగాన్ని ఒక ఉచిత సాఫ్ట్‌వేర్/ఓపెన్ సోర్స్ అయిన నెట్‌స్కేప్ పబ్లిక్ లైసెన్స్ కింద విడుదల చేసింది. దీనినుంచి అభివృద్ధి చేయబడిన అప్లికేషన్‌కి మొజిల్లా అని పేరు పెట్టారు, ఎందుకంటే ఇది ఒరిజనల్ నెట్‌స్కేప్ నావిగేటర్ యొక్క కోడ్‌నేమ్. సుదీర్ఘమైన ప్రీ-1.0 సైకిల్స్ పరంపంర తర్వాత, 2002 జూన్ 5న మొజిల్లా 1.0 విడుదల చేయబడింది.

నెట్‌స్కేప్ ప్రోగ్రామర్లు ఓపెన్ సోర్స్ మొజిల్లా ప్రాజెక్టుకు తోడ్పాటును కొనసాగించారు మరియు అదనంగా యాజమాన్య హక్కు సాఫ్ట్‌వేర్‌తో పాటుగా మరీ ముఖ్యంగా కమర్షియల్ స్పెల్‌చెకర్ మరియు AIM యొక్క తేలికపాటి వెర్షన్ మరియు బ్రౌజర్‌తో కలిసిపోయిన ICQ ఇన్‌స్టంట్ మెసెంజర్ నెట్‌స్కేప్-బ్రాండ్ విడుదలలను రూపొందించడానికి ఆ సోర్స్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు. బ్రౌజర్లు యూజప్ URL బార్‌లో "About:mozilla"ని నమోదు చేసినప్పుడు ఈ అన్ని బ్రౌజర్లు కాపీరైట్ నోటీసు మరియు తిరుగు స్వీకరణ పుటలను చూపుతాయి.

ఈ సూట్ సుప్రసిద్ధమైనది ఎందుకంటే, నెట్‌స్కేప్ సూట్ (6 మరియు 7 వెర్షన్లు) యొక్క ఉచిత/ఓపెన్ సోర్స్ బేస్ మరియు దాని లోపలి కోడ్ (చాలావరకు సుప్రసిద్దమైన గెక్కో లేఅవుట్ ఇంజన్), మొజిల్లా ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉత్పత్తులైన ఫైర్‌ఫాక్స్ మరియు థండర్‌బర్డ్‌తోసహా అనేక స్వతంత్ర అప్లికేషన్లకు పునాదిగా మారింది. సూట్‌ని స్వతంత్ర ఉత్పత్తులనుంచి వేరుపర్చడానికి, సూచ్ తరచుగా "మొజిల్లా అప్లికేషన్ సూట్" లేదా మరింత సంక్షిప్త రూపంలో "మొజిల్లా సూట్‌"గా మార్కెట్ చేయబడింది.

మొజిల్లా ఫౌండేషన్ ఇకపై సూట్‌ని నిర్వహించలేదు, కాబట్టి దాని డెవలపర్లు ఫైర్‌ఫాక్స్ మరియు థండర్‌బర్డ్‌పై కేంద్రీకరించగలరు. ఈ సూట్‌ని సీమంకీని అభివృద్ధిపర్చడం కొనసాగించిన సీమంకీ కౌన్సిల్‌కి స్వాధీనపర్చారు, సీమంకీ అనేది మొజిల్లా కమ్యూనిటీ అభివృద్ధి పర్చిన ఇంటర్నెట్ సూట్, ఇది మొజిల్లా సూట్ యొక్క సోర్స్ కోడ్‌పై ఆధారపడుతుంది మరియు దాన్ని అధిగమిస్తుంది.

మొజిల్లా ఆధారిత బ్రౌజర్ల సామూహిక పేరుసవరించు

క్లుప్తంగా చెప్పాలంటే, అన్ని మొజిల్లా ఆధారిత బ్రౌజర్లను ప్రస్తావించడానికి మొజిల్లా ను తరచుగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు, మొజిల్లా బ్రౌజర్లు ఒక వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారని చెబుతున్నప్పుడు, దాన్ని మొజిల్లా సూట్‌ ఫైర్‌ఫాక్స్, కేమినో, నెట్‌స్కేప్ 6, వంటివాటి ద్వారా ఉపయోగిస్తున్నారని అర్థం. కొన్ని ఇతర ఇంటర్నెట్ గణాంకాల ప్రోగ్రాంల ప్రకారం "నెట్‌స్కేప్ 5.x" పదం ఈ బ్రౌజర్లను ప్రస్తావించడానికి తప్పుగా ఉపయోగించబడింది ఎందుకంటే యూజర్ ఏజెంట్ స్ట్రింగ్ మొజిల్లా/5.0తో మొదలవుతుంది.

అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్సవరించు

మొజిల్లా పదం మొజిల్లా అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్‌కు కూడా ప్రతిపాదించబడుతుంది, ఇది అనేక ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేసే అప్లికేషన్లను రాయడం కోసం రూపొదించిన క్రాస్-ప్లాట్‌ఫారం అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్. ఇది అత్యంత ప్రసిద్ధమైన జెక్కో లేఅవుట్ ఇంజిన్‌ని కలిగి ఉంది, దాంతోపాటు XUL యూజర్-ఇంటర్‌ఫేస్ టూల్‌కిట్, నెక్కో నెట్‌వర్కింగ్ లైబ్రరీ మరియు ఇతర విడిభాగాలను కూడా కలిగి ఉంది. ఇది అన్ని మొజిల్లా ఆధారిత బ్రౌజర్లు మరియు అప్లికేషన్లు నిర్మించబడిన కోర్.

కోడ్‌బేస్సవరించు

ఫైర్‌ఫాక్స్, థండర్‌బర్డ్, మరియు XULరన్నర్ వంటి మొజిల్లా సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టుల సోర్స్ కోడ్ ఒకే మెర్క్యురియల్ సురక్షిత స్థానంలో సామూహికంగా నిర్వహించబడతాయి. ఈ అతి పెద్ద కోడ్‌బేస్ మొజిల్లా కోడ్‌బేస్‌, మొజిల్లా సోర్స్ కోడ్‌గా లేదా వట్టి మొజిల్లాగా ప్రస్తావించబడుతోంది. జెక్కో 1.9 బ్రాండ్ చేయబడకముందు, CVS ఉపయోగించబడింది.[4]

మొజిల్లా కోడ్‌బేస్ మొదట్లో నెట్‌స్కేప్ పబ్లిక్ లైసెన్స్ కింద విడుదల చేయబడింది. లైసెన్స్ వెర్షన్ 1.1కి నవీకరించబడింది మరియు మొజిల్లా పబ్లిక్ లైసెన్స్ (MPL)గా పేరు మార్చబడింది. GPL- లైసెన్సెడ్ మాడ్యూల్ మరియు MPL- లైసెన్స్ మాడ్యూల్ చట్టపరంగా అనుసంధించబడలేవని ఉచిత సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ మరియు ఇతరులు పేర్కొన్నారు, మరియు ఈ కారణంగా డెవలపర్లు MPLని ఉపయోగింరాదని వీరు సిఫార్సు చేశారు.[5] ఈ ఆందోళనను పరిష్కరించడానికి, మొజిల్లా ఫౌండేషన్ 2003లో కోడ్‌బేస్‌లోని చాలా భాగాలను GNU జనరల్ పబ్లిక్ లైసెన్స్ మరియు GNU లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్స్‌తోపాటు మొజిల్లా పబ్లిక్ లైసెన్స్‌ను రీలైసెన్స్ చేయించింది.[6]

సాఫ్ట్‌వేర్సవరించు

 • బుగ్జిల్ల - ఒక బగ్ ట్రాకింగ్ టూల్
 • కామినో - మాక్ కోసం ఒక వెబ్ బ్రౌసర్
 • ఫ్లోక్ (వెబ్ బ్రౌసర్)
 • మినిమో
 • మొజిల్లా స్కైరైటర్ - బెస్పిన్ గా ప్రసిద్ధి
 • మొజిల్లా ఫైర్ఫాక్స్ - ఒక వెబ్ బ్రౌసర్
 • మొబైల్ కోసం మొజిల్లా ఫైర్ఫాక్స్
 • మొజిల్లా గ్యోడ్
 • మొజిల్లా సన్బర్డ్
 • మొజిల్లా థందర్బర్డ్ - ఒక మెయిల్ క్లయింట్
 • ఫైర్ఫాక్స్ సింక్(sync) - మొజిల్లా వేవ్ గా పిలవబడును
 • సి మన్కి (sea monkey )
 • సాంగ్బర్డ్
 • టిన్డర్ బాక్స్

వీటిని కూడా చూడండి.సవరించు

 • ది బుక్ అఫ్ మొజిల్లా
 • వెబ్ బ్రౌసర్స్ యొక్క టైం లైన్
 • -జిల్లా (ప్రత్యయం)

సూచనలుసవరించు

బాహ్య లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మొజిల్లా&oldid=1760500" నుండి వెలికితీశారు