లేదా

ఈ వ్యాసమును వికిపుస్తకములకు తరలించాలని ప్రతిపాదించబడినది. వివరాలకు చర్చా పేజీ చూడండి.



కావలసిన పదార్థాలుసవరించు

  • సెనగపిండి: రెండున్నర కప్పులు
  • పాలు: అరలీటరు
  • యాలకులపొడి: అరటీస్పూను
  • నెయ్యి: మూడు కప్పులు

పాకం కోసంసవరించు

  • పంచదార: రెండున్నర కప్పులు,
  • మంచినీళ్లు: మూడున్నర కప్పులు
  • పాలు: 2 టేబుల్‌స్పూన్లు.

తయారుచేసే విధానంసవరించు

  1. ముందుగా మందపాటి గిన్నెలో పంచదార, నీళ్లు, పాలు పోసి మరిగించాలి.
  2. ఓ పొంగు వచ్చిన తరువాత వడబోసి మళ్లీ స్టవ్‌మీద పెట్టి మరో ఐదారునిమిషాలు మరిగించాలి.
  3. ఇప్పుడు రంగు కూడా కలిపి కాస్త చిక్కబడేవరకూ మరిగించాలి. కానీ తీగపాకం మాత్రం రాకుండా దించి పక్కన ఉంచాలి.

బూందీ తయారీసవరించు

  1. పిండిలో పాలు, యాలకులపొడి వేసి జారుగా కలపాలి.
  2. బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి మరిగిన తరువాత చిల్లుల గరిటెమీద పిండిని వేసి బూందీ తీయాలి.
  3. బూందీ వేగిన తరువాత తీసి పాకంలో వేసి కలపాలి. ఇలాగే వెుత్తం వేసి బూందీపాకాన్ని నెయ్యిరాసిన వెడల్పాటి పళ్ళెంలో పోయాలి.
  4. తరువాత కాస్త గోరువెచ్చని నీళ్లు చల్లి మూతపెట్టి ఐదునిమిషాలు ఉంచాలి. ఇప్పుడు చేతులకు తడి అద్దుకుంటూ ఉండలు చుట్టాలి.