మోతే వేదకుమారి (Mothey Vedakumari) భారత పార్లమెంటు సభ్యురాలు, [1] గాయని. 25 సంవత్సరాల 6 నెలల వయసులో 2వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్నవయసులో పార్లమెంటు సభ్యురాలైన మహిళగా పేరుగాంచినది.[2]

మోతే వేదకుమారి
మోతే వేదకుమారి


పదవీ కాలం
1957 - 1962
తరువాత వీరమాచనేని విమల దేవి
నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1931-09-24) 24 సెప్టెంబరు 1931 (age 93)
ఏలూరు, ఆంధ్రప్రదేశ్, India
మరణం 1977 (వయసు 45–46)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
మతం హిందూమతం

జీవితం, వ్యాసంగం

మార్చు

వేదకుమారి 1931 సెప్టెంబరు 24 తేదీన ఏలూరులో జన్మించింది. ఈమె తండ్రి ఏలూరు జమీందారు మోతే నారాయణరావు, ప్రసిద్ధ కళా పోషకుడు, సాంప్రదాయ నాటకరంగాన్ని ఉద్దరించడానికి ఏలూరులో మోతే నాటక కంపెనీగా ప్రసిద్ధి చెందిన సీతారామాంజనేయ నాటక సమాజాన్ని స్థాపించాడు.[3] వైశ్య వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించిన వేదకుమారి ఆరుగురు సంతానంలో ఒకర్తి. ఈమె తండ్రి స్వాతంత్ర్యోద్యమానికి ధనసహాయం చేశాడని ప్రతీతి.

వేదకుమారి అర్ధశాస్త్రంలో ఎం.ఏ డిగ్రీతో పట్టభద్రురాలైంది.[4] విద్యార్ధి దశలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, ఏలూరు విద్యార్ధి కాంగ్రేసుకు కార్యదర్శిగా పనిచేసింది. ఈమె అఖిల భారత మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు కార్యదర్శిగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది. వేదకుమారి, ఈదర నాగరాజు వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొంది, గాయనిగా ప్రసిద్ధి చెందినది. ఆకాశవాణి మొదటి తరగతి కళాకారిణిగా గుర్తింపబడినది.[4] ఈమె 1957 సంవత్సరంలో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా పోటీచేసి, వీరమాచనేని విమల దేవిని ఓడించి లోక్‌సభకు ఎన్నికయ్యింది.[1] 1962లో తిరిగి అదే నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి, తన ప్రత్యర్ధి వీరమాచనేని విమల దేవి చేతిలో ఓడిపోయింది.

వైశ్య సామాజికవర్గానికి చెందిన వేదకుమారి, బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. సంతానం లేని వేదకుమారి ఇద్దరు అబ్బాయిలను దత్తతకు తీసుకొని పెంచి పెద్దచేసింది.[4]

వేదకుమారి 1977లో కాన్సర్ కారణంగా మరణించింది.[4]

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Biodata of Vedakumari Mothey at Parliament of India". Archived from the original on 2016-03-04. Retrieved 2013-02-28.
  2. Malhotra, G.C. (2002). Fifty years of Indian Parliament. New Delhi: Lok Sabha Secretariat. p. 107. Retrieved 2 October 2024.
  3. వై.వి., కృష్ణారావు (1989). ఆంధ్రప్రదేశ్ దర్శిని-2. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. pp. 559–561. Retrieved 2 October 2024.
  4. 4.0 4.1 4.2 4.3 "Kumari Mothey Vedakumari: One Of The First Women MPs Of Andhra Pradesh". Feminism in India. 22 March 2019. Retrieved 24 December 2023.