మోదడుగు విజయ్ గుప్తా

(మోదడుగు విజయ్‌ గుప్తా నుండి దారిమార్పు చెందింది)

మోదడుగు విజయ్‌గుప్తా, మత్స్య సాగుల పరిశోధకులు, జీవ శాస్త్రవేత్త. ఆయనకు 2005 లో "వరల్డ్ ఫుడ్ ప్రైజ్" లభించింది[1]. ఆయన తక్కువ వ్యయంతో మంచినీటి చేపల వ్యవసాయం గూర్చి చేసిన అభివృద్ధికి గానూ ఈ బహుమతి ఆయనకు లభించింది.[2] ఈయన ఈ అవార్డు అందుకున్న ఆరవ భారతీయుడు.[3] ఈ అవార్డు పొందిన తొలి ఆంధ్రుడిగా చరిత్ర పుటలకెక్కారు.

మోదడుగు విజయ్‌ గుప్తా
మోదడుగు విజయ్‌ గుప్తా
జననం1939 ఆగష్టు 17
గుంటూరు జిల్లా, బాపట్ల
నివాస ప్రాంతంగుంటూరు జిల్లా, బాపట్ల
ప్రసిద్ధివ్యవసాయ శాస్త్రవేత్త
Notes
2015లో కొరియా శాంతి బహుమతిని అందుకున్నారు

జీవిత విశేషాలు

మార్చు

ఆయన గుంటూరు జిల్లా, బాపట్ల పట్టణంలో 1939, ఆగష్టు 17న జన్మించారు. ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత చీరాల కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పాటు పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రంలో ఒక కళాశాలలో "జంతు శాస్త్ర శాఖాధిపతి"గా కూడా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ ఆయన మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి "ఫిషరీస్ రీసెర్చి"లో ప్రవేశించారు.[4]

పరిశోధనలు

మార్చు

ఆయన పరిశోధనలను ముమ్మరంగా సాగించేందుకు, ప్రత్యాక్ష అధ్యయనం చేసేందుకు స్వయంగా రైతుల చేపల చెరువులకు వెళ్ళి, చెరువు గట్ల పైనే పరిశోధనలు ప్రారంభించారు. రైతుల అవసరాలు, సమస్యలు కూడా అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా తన పరిశోధనలు కొనసాగించారు. అధికోత్పత్తి వలననే చేపల రైతులకు గిట్టుబాటు అవుతుందని గ్రహించి, ఆ దిశగా ప్రయోగాలు చేసి, రెండు రకాల కొత్త రకాల చేపలను "రిబ్బన్ ఫిషెస్" పేరుతో ఉత్పత్తి చేసారు. వీటి పెంపకంతో ఒకటిన్నర నుంచి మూడు, అయిదు టన్నుల స్థాయి వరకు అధిక దిగుబడి వచ్చింది.[5]

ఆయన వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) తరపున మత్స్య సాగులకు అందించిన అపురూపమైన సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకు మత్స్య శాస్త్ర నిపుణుడిగా ప్రపంచ దేశాలకు మరింత కృషి జరిపేందుకు, పరిశోధనలు చేసి ఫలాలను రాబట్టడానికిఅవకాశం కల్పించింది.

కన్సల్టేటివ్ గ్రూపు ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (పెనాంగ్, మలేసియా) అధ్వర్యంలోని మత్స్య పరిశోధన సంస్థ వరల్డ్ ఫిష్ కు అసిస్టెంట్ డైరక్టరుగా ఆయన పదవీవిరమణ చేసారు.[6]

అవార్డులు

మార్చు

ఈయనకు కిరిబాటి దీవుల అధ్యక్షుడు అనోట్‌ టాంగ్‌ శుక్రవారం ఆగష్టు 29 2015కొరియా శాంతి బహుమతిని అందుకోనున్నారు. వీరికి రూ.3.30 కోట్ల ప్రైజ్‌ మనీ అందజేస్తారు.[7]

ఈయనకు 2023లో పద్మశ్రీ [8]ప్రకటించగా[9], ఆయన ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[10]

మూలాలు

మార్చు
  1. MV Gupta given World Food Prize for 2005
  2. Indian Gets World Food Prize - The Tribune, Chandigarh, India - Nation
  3. World Food Prize for M.V. Gupta
  4. "Agri Biotech Foundation (ABF)". Archived from the original on 2015-10-19. Retrieved 2015-05-31.
  5. Research plans for integrated aquaculture..
  6. "The Food Museum: world food organisations". Archived from the original on 2010-11-22. Retrieved 2015-05-31.
  7. తెలుగు శాస్త్రవేత్తకు కొరియా శాంతి బహుమతి[permanent dead link]
  8. Bureau, The Hindu (2023-01-25). "Full list of 2023 Padma awards | Mulayam Singh Yadav, S.M. Krishna, Zakir Hussain, Kumar Mangalam Birla among recipients". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-01-26.
  9. V6 Velugu (26 January 2023). "చినజీయర్, కమలేశ్ కు పద్మభూషణ్". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. Andhra Jyothy (23 March 2023). "పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.

ఇతర లింకులు

మార్చు
Honorary titles
అంతకు ముందువారు
Yuan Longping
World Food Prize
2005
తరువాత వారు
Lobato, Paolinelli, and McClung