మౌంట్ ఓపేరా ఒక ధీమ్ పార్క్ . హైదరాబాద్ శివారుల్లో రామోజి ఫిల్మ్ సిటికి ఏదురుగా నిర్మించారు.[1]

విశేషాలుసవరించు

హైదరాబాద్కు 38 కిలోమీటర్లు, రామోజి ఫిల్మ్ సిటీకి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది.మొత్తం 37 గదులు, రెస్టారెంట్లు 5 ఉన్నాయి.దీని వైశాల్యం 55 ఎకరాలు.ఇది శ్రీమిత్ర ఎస్టేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి చెందిన సంస్థ.దీని మైనేజింగ్ డైరెక్టర్ గా ఏ.ప్రసాద రావు పని చేస్తున్నారు.

కొండ పైభాగంలో ఉన్న మౌంట్ ఒపెరా హైదరాబాద్ సందర్శకులను వివిధ రకాల వాటర్‌పోర్ట్‌లతో పాటు డ్రై రైడ్‌లతో అందిస్తుంది. స్కేటింగ్ రింక్, టాయ్ ట్రైన్, మెర్రీ-గో-రౌండ్, మెర్రీ కప్స్, స్లామ్ బాబ్, కొలంబస్, స్లైడింగ్ రింగ్, స్కేటింగ్ రింక్, స్ట్రైకింగ్ కార్స్, టెలి-కంబాట్, ఫెర్రిస్ వీల్, గో-కార్టింగ్ మొదలైనవి ఇక్కడ కొన్ని డ్రై రైడ్‌లు. ఒయాసిస్ జోన్ నీటి ప్రపంచం అనేక రకాల నీటి ఆటలు, స్లైడ్‌లను అందిస్తుంది. బోటింగ్, రెయిన్ డాన్స్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. మౌంట్ ఒపెరాలో ఇండోర్ ఆటలు కొన్ని ఎంపికలు బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, క్యారమ్, కార్డ్స్ రూమ్, చెస్ మొదలైనవి.

హొటళ్ళు వాటి వివరాలుసవరించు

  • డాల్ఫిన్: ఫ్యామిలి రెస్టారెంట్, భోజనం, పానీయాలు.
  • మౌంట్ వ్యూ: ఇండియన్ రెస్టారెంట్.
  • లోటస్: కాఫీ షాపు, టిఫిన్ లు.
  • ఓమర్ కయ్యం: రెస్టారెంట్, బార్.

ప్రదేశంసవరించు

నైషనల్ హైవే 9, బాటా సింగారం - అబ్దుల్లాపూర్‌మెట్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ .

చేరుకొవడానికి: ఏ.పి.యస్.ఆర్.టి.సి సదుపాయం ఉంది.

మూలాలుసవరించు

  1. "Mount Opera Hyderabad (Entry Fee, Timings, Entry Ticket Cost, Price) - Hyderabad Tourism 2021". www.hyderabadtourism.travel. Retrieved 2021-04-18.

బయటి లింకులుసవరించు

అంతర్జాల చిరునామా: http://www.mountopera.com/