యెన్నం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మహబూబ్‌నగర్ శాసనసభ సభ్యులు

యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే.[2]

యెన్నం శ్రీనివాస్ రెడ్డి
యెన్నం శ్రీనివాస్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2012 - 2014
నియోజకవర్గం మహబూబ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 3 జనవరి 1970
వెల్డండా గ్రామం & మండలం, మహబూబ్ నగర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఇంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి లక్ష్మీ ప్రసన్న[1]
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ
మతం హిందూ

జననం, విద్యాభాస్యం మార్చు

యెన్నం శ్రీనివాస్ రెడ్డి 1970 జనవరి 3లో తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, వెల్డండా గ్రామం & మండలంలో జన్మించాడు. ఆయన అనంతపురంలో డిగ్రీ పూర్తి, MBA అసంపూర్తిగా.

రాజకీయ జీవితం మార్చు

యెన్నం శ్రీనివాస్ రెడ్డి కొంతకాలం బాంబే, డిల్లీ కష్టమ్స శాఖలో ఉద్యోగం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యోగానికి రాజీనామా చేసి 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2007లో మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. శ్రీనివాస్ రెడ్డి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

యెన్నం శ్రీనివాస్ రెడ్డి 2009లో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2012లో బీజేపీలో చేరి 2012లో మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీం పై 1859 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఆయన 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ చేతిలో 2535 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2015 నవంబరు 23లో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశాడు.[3][4]

యెన్నం శ్రీనివాస్ రెడ్డి 2016లో చెరుకు సుధాకర్తో కలిసి తెలంగాణ ఉద్యమ వేదికను స్థాపించి, అనంతరం 2017 జూన్ 2లో ఏర్పాటైన తెలంగాణ ఇంటి పార్టీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 2019 మార్చి 20లో తిరిగి బీజేపీలో చేరాడు.[5] ఆయన 2020లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడై[6], 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని డివిజన్ల ఇంచార్జ్ గా పనిచేశాడు.[7]

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీ నుంచి ఆయనను 2023 సెప్టెంబరు 03న బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది.[8] ఆయన 2023 సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరాడు.[9] యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ప్రకటించింది.[10][11][12]

మూలాలు మార్చు

  1. Eenadu (29 October 2023). "ఎన్నికల బరిలో మొల్గర అల్లుళ్లు". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  2. Eenadu (10 November 2023). "రాజకీయాల్లో కొలువుదీరారు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  3. Mana Telangana (23 November 2015). "బిజెపికి యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  4. Sakshi (24 November 2015). "బీజేపీకి మాజీ ఎమ్మెల్యే యెన్నం రాజీనామా". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  5. Andrajyothy (2019). "తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  6. The Times of India, Koride Mahesh / TNN / (2 August 2020). "Telangana BJP announces new state committee | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  7. Deccan Chronicle (19 November 2020). "BJP appoints 24 in-charges for Telangana GHMC polls" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  8. Andhra Jyothy (3 September 2023). "ఆ నేతపై బీజేపీ వేటు.. కారణమేంటంటే..?". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
  9. A. B. P. Desam (17 September 2023). "టీ కాంగ్రెస్‌లో నయా జోష్, పార్టీలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  10. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  11. Eenadu (28 October 2023). "కొత్తవారికి అభయహస్తం". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  12. Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.