యెమెన్‌లో హిందూమతం

 

వలస వచ్చిన భారతీయ, నేపాల్ కార్మికుల ద్వారా యెమెన్‌కు హిందూమతం చేరుకుంది. యెమెన్‌లో హిందూ మతం చాలావరకు పైకి కనిపించదు. దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న చిన్నచిన్న సమ్మేళనాల్లో మాత్రమే ఆచరిస్తారు. 2010 అంచనా ప్రకారం యెమెన్‌లో సుమారు 1,50,000 మంది హిందువులు నివసిస్తున్నారు. [1]

దేవాలయాలు మార్చు

యెమెన్‌లోని ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో 1862లో నిర్మించిన శ్రీ తారిచ్‌మెర్గా దేవాలయం ఒకటి. 2013లో IANS ప్రచురించిన నివేదిక ప్రకారం 1875లో శ్రీ రామ్ జీ ఆలయాన్ని, 1882లో హనుమంతుడి దేవాలయాన్నీ నిర్మించారు. [2] ఏడెన్‌లోని ఇండియన్ అసోసియేషన్ మాతాజీ ఆలయాన్ని నిర్వహిస్తోంది. నెలకు ఒకసారి సాధారణ సేవలు జరుగుతాయి. హిందువుల కోసం ఏడెన్‌లో ప్రత్యేక శ్మశానవాటిక కూడా ఉంది. [3]

జనాభా వివరాలు మార్చు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
20011,25,429—    
20101,50,000+19.6%
సంవత్సరం శాతం పెంచు
2001 0.7% -
2010 0.65% -0.05

మూలాలు మార్చు

  1. "Religious Beliefs In Yemen". WorldAtlas (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-02.
  2. "Hindus and Muslims live like a family in Yemen". Gulf News. July 3, 2017. Retrieved July 7, 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Embassy of India in Republic of Yemen - Indian Embassy in Sanaa". NRI. Archived from the original on 12 March 2011. Retrieved 2021-08-02.