యెరెవాన్ నగర కౌన్సిలు

యెరెవన్ సిటీ కౌన్సిల్ యరెవాన్ నగరం యొక్క చట్ట పరిరక్షణ సంస్థ. ఈ వ్యవస్థలో ఎన్నుకోబడిన 65 మంది సభ్యులు ఉంటారు. ఇది యెరెవాన్ మేయర్ నేతృత్వంలోని పార్టీ-జాబితా అనుపాత ప్రాతినిధ్యం వహించే సంస్థ. కౌన్సిల్ సభ్యులు మేయర్ ప్రభుత్వాన్ని గమనిస్తూంటారు.

యెరెవాన్ నగర కౌన్సిల్
Coat of Arms of Yerevan.png
రకం
రకం
యునికమెరల్
నాయకత్వం
మేయరు
తరాన్ మార్గర్యాన్
నిర్మాణం
సీట్లు65
రాజకీయ వర్గాలు
రెపబ్లిక్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా (46)
వే అవుట్ అల్లయెన్స్ (14)
యెర్కిన్ త్సిరాని (3)
ఇండిపెండెంట్ (2)
Committees4
ఎన్నికలు
ఓటింగ్ విధానం
పార్టీ-లిస్ట్ ప్రపోర్షనల్ రిప్రసెంటేషన్
చివరి ఎన్నికలు
14 మే 2017
Next election
2022
సమావేశ స్థలం
యెరెవాన్ నగర కౌన్సిల్ యెరెవాన్ నగర హాలుపై ఉంటుంది
యెరెవాన్ నగర హాలు
1 అర్గిస్టి వీధి
యెరెవాన్, 0015
ఆర్మేనియా
వెబ్‌సైటు
http://www.yerevan.am/

కౌన్సిల్ నగర సంస్థల పనితీరును పర్యవేక్షిస్తుంది. ఇది భూ వినియోగ నిర్ణయాలు అలాగే ఇతర అంశాలను చట్టబద్ధం చేస్తుంది. సిటీ కౌన్సిల్ నగర బడ్జెట్ ను ఆమోదించే బాధ్యత వహిస్తుంది. ప్రతి సభ్యుడు వరుసగా మూడు సార్లు పదవీకాలానికి మాత్రమే పరిమితం చేయబడ్డరు, వారు నాలుగు సంవత్సరాల ఉపశమనం తర్వాత మళ్లీ పదవికి పోటీ చేయవచ్చు.

ఎన్నికలుసవరించు

యురేవన్ సిటీ కౌన్సిల్ ఎన్నికలు ప్రతీ ఐదు సంవత్సరాలలో పార్టీల అనుపాత జాబితాలతో నిర్వహిస్తున్నారు. ఈ  లో65 మంది సభ్యులు ఉన్నారు. 40% కంటే ఎక్కువ సీట్లను గెలుచుకున్న పార్టీ జాబితాలో మొదటి వ్యక్తిగా ఎన్నికైన వారిని మేయర్ గా భావిస్తారు. అన్ని పార్టీలు కావాలసినంత ఓట్లు సేకరించడానికి విఫలమైతే, మేయర్ సిటీ కౌన్సిల్ చేత ఎన్నికోబడతారు."[1]

  • యెరెవాన్ సిటీ కౌన్సిల్ ఎన్నికలు, 2009
  • యెరెవాన్ సిటీ కౌన్సిల్ ఎన్నికలు, 2013
  • యెరెవాన్ సిటీ కౌన్సిల్ ఎన్నికలు, 2017

యెరెవాన్ సిటీ హాల్సవరించు

యెరెవాన్ సిటీ కౌన్సిల్ యొక్క భవనం, కెంట్రోన్ జిల్లాలో ఆర్గిష్టి వీధిలో ఉన్న యెరెవన్ సిటీ హాల్ లో ఉన్నది. ఇది స్క్వేర్ ఆఫ్ రష్యా, మాస్కో హౌస్, యెరెవాన్ అరరాట్ వైన్ ఫ్యాక్టరీలకు ఎదురుగా ఉంటుంది. ఈ భవనం నిర్మాణం నవంబరు 2004 లో మేయర్ యుర్వాండ్ జఖరయన్ పదవిలో ఉన్న కాలంలో, ఎ.ఎం.డి 3.1 బిలియన్ల వ్యేయంతో జరిగింది. వాస్తవానికి దీని ఆర్కిటెక్టు జిమ్ టోరోసియన్. ఈ నిర్మాణం 1980వ సంవత్సరంలో ప్రారంభం అయ్యింది, కానీ 1991 లో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయాయి. ఆగస్టు 2003లో పనులను పునఃప్రారంభించారు ఆ తరువాత పనులు 15 నెలల్లో పూర్తయ్యాయి.[2]

ఈ సిటీ హాల్ 13,500 చ.కి, వైశాల్యంలో ఐదు అంతస్తుల్లో ఉంటుంది. ఆ ప్రధాన ప్రవేశద్వారంలో ఉన్న నిరంతర వృత్తాలు సాంప్రదాయ అర్మేనియాకు చిహ్నంగా నిలుస్తున్నారు. ఇది 47 మీటర్ల ఎత్తు గల దీర్ఘచతురస్రాకార గడియారపు టవర్ను కలిగి ఉంది, దానిపై "ԵՐԵՎԱՆ" (యెర్వన్) అని అర్మేనియన్ లిపి చెక్కబడి ఉంటుంది, ఇది సంప్రదాయ ఆభరణాలతో అలంకరించి ఉంటుంది. ఈ టవర్ యొక్క పైభాగంలో గ్లాసీ గోడలతో చుట్టబడి ఉంది.[3] యెరెవాన్ హిస్టరీ మ్యూజియం ఈ సిటీ హాల్ కు పశ్చిమాన ఉన్న ఒక అనుబంధ భవనంలో ఉంది.

మూలాలుసవరించు

  1. "Yerevan City Council Election campaign kicks off". Tert.am. 7 April 2013. Retrieved 7 April 2013.[permanent dead link]
  2. Yerevan City Hall was opened
  3. "Yerevan towers" (PDF). Archived from the original (PDF) on 2012-12-24. Retrieved 2018-07-06.