యోగి ఆదిత్యనాథ్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
యోగి ఆదిత్యనాథ్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. భారతీయ జనతాపార్టీ నుండి ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు.
యోగి ఆదిత్యనాథ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 March 2017 | |||
గవర్నరు | Ram Naik | ||
---|---|---|---|
డిప్యూటీ | Keshav Prasad Maurya Dinesh Sharma | ||
ముందు | Akhilesh Yadav | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1998 | |||
ముందు | Mahant Avaidyanath | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Panchur, Pauri Garhwal, Uttar Pradesh (now in Uttarakhand) | 5 జూన్ 1972||
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party | ||
పూర్వ విద్యార్థి | H.N.B. Garhwal University | ||
వృత్తి | Politician Priest | ||
మతం | Hinduism |
జీవిత విశేషాలుసవరించు
యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5 న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌరిగడ్వాల్ జిల్లాలోని పాంచుర్‌లో రాజ్‌పుట్ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గల హెచ్‌ఎన్‌బీ గర్‌వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశారు. 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఈతలో, బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. 1998లో తొలిసారిగా గోరఖ్‌పూర్ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు (26) ఆయనే. అదే నియోజకవర్గం నుంచి అయిదుసార్లు (1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికయ్యారు.[1] ప్రస్తుతం గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతిగా సైతం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతి ఆదిత్యానాథ్ అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు.
రాజకీయ జీవితంసవరించు
చిన్ననాటి నుంచే హిందూత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.12 వ లోక్‌సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. 44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు.
హిందూత్వ వాదిగాసవరించు
పార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ అతివాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్తారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5 వేల మందిని హిందూ మతంలోకి మార్పిడి చేయించారు. ఈ సందర్భంగా భారతదేశాన్నిహిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2007లో గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్లలో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. దీంతో నిషేధాజ్ఞలను కాదని ఆందోళన నిర్వహించారు. సూర్య నమస్కారాలను చేయడం యోగాభ్యాసంలో భాగమని గట్టిగా వాదించారు. దీనిని విమర్శించేవారు సముద్రంలో పడి చావవచ్చునని, లేదా చీకటి గదుల్లో మగ్గిపోవాలని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.[2]
ముఖ్యమంత్రిగాసవరించు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ ను బిజెపి ఎంపిక చేసింది. 18-3-2017 శనివారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతరులు నిర్వహించిన చర్చల్లో యోగి ఆదిత్యనాధ్ వైపు మొగ్గుచూపడంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 19-3-2017 ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ సహా పలువురు ఈశ్వరుడి పేరున ప్రమాణం చేశారు. ప్రస్తుతం 50 మందితో ఈయన కేబినెట్ కొలువు తీరుతోంది.ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 21 వ ముఖ్యమంత్రి .
మూలాలుసవరించు
- ↑ యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది![permanent dead link]
- ↑ "హిందూత్వ అతివాదికి యూపీ పగ్గాలు! March 18, 2017 Tnews". Archived from the original on 2017-03-19. Retrieved 2017-03-19.