రఘునాథ రెడ్డి

సినీ నటుడు
(రఘునాధరెడ్డి నుండి దారిమార్పు చెందింది)

కలకోట రఘునాథ రెడ్డి ఒక ప్రముఖ సినీ నటుడు. ఆయన సుమారు 370 కి పైగా సినిమాలలో నటించాడు. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించాడు. తెలుగులోనే కాక హిందీ, తమిళం, భోజ్ పురి సినిమాలలో నటించాడు. టీవీ సీరియళ్ళలో కూడా నటించాడు.

రఘునాథ రెడ్డి
తెలుగు సహాయనటుడు రఘునాథ రెడ్డి
జననం
రఘునాథ రెడ్డి
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1991 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅన్నపూర్ణ
పిల్లలుసుధా లక్ష్మి
అరుణ
సుధాకర్ రెడ్డి
తల్లిదండ్రులు
  • కృష్ణారెడ్డి (తండ్రి)
  • సామ్రాజ్యమ్మ (తల్లి)

జీవిత విశేషాలు మార్చు

ఆయన స్వస్థలం విజయవాడ. ఆయన తండ్రి కృష్ణారెడ్డి, తల్లి సామ్రాజ్యమ్మ. ఆయన భార్య అన్నపూర్ణ. వీరికి ముగ్గురు పిల్లలు సుధా లక్ష్మి, అరుణ, సుధాకర్ రెడ్డి.[1] 1966 నుంచి 1996 దాకా నాటకాలు వేశాడు.

సినిమా రంగం మార్చు

1991 లో పరుచూరి సోదరులు దర్శకత్వం వహించిన శోభన్ బాబు సినిమా సర్పయాగం సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు.

సంవత్సరం సినిమా
2018 సుబ్రహ్మణ్యపురం
2011 శ్రీరామ రాజ్యం
2011 వస్తాడు నా రాజు
2010 గాయం 2
2009 మిస్టర్ గిరీశం
2009 నేరము - శిక్ష
2009 శంఖం
2009 జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా
2007 మా సిరిమల్లి
2006 బాస్
2006 సర్దార్ పాపన్న
2006 సైనికుడు
2005 బాలు
2005 గౌతం ఎస్.ఎస్.సీ
2005 భగీరథ
2005 సంక్రాంతి
2004 నేనుసైతం
2004 శివ్ శంకర్
2004 శంఖారావం
2004 మల్లీశ్వరి
2003 ఒట్టేసి చెబుతున్నా
2003 విలన్
2001 భలేవాడివి బాసూ
2001 దాదాగిరి
2001 9 నెలలు
2001 ప్రేమసందడి
2000 ఆజాద్
2000 ఛలో అసెంబ్లీ
2000 దేవీ పుత్రుడు
2000 పాపే నా ప్రాణం
1997 ప్రేమించుకుందాం రా
1995 ఒరేయ్ రిక్షా
1997 కలెక్టర్ గారు
1999 స్వయంవరం
1998 యువరత్న రాణా
1998 పెళ్ళి పందిరి
1998 ఆహా
1998 శ్రీమతీ వెళ్ళొస్తా
1999 శీను
1999 సుల్తాన్

మూలాలు మార్చు

  1. "రఘునాథ రెడ్డి ప్రొఫైలు". nettv4u.com. Retrieved 19 August 2016.

బయటి లింకులు మార్చు