రవీంద్ర వసంతరావు చవాన్

రవీంద్ర వసంతరావు చవాన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నవంబర్ 2024లో నాందేడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రవీంద్ర వసంతరావు చవాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు వసంతరావు చవాన్
నియోజకవర్గం నాందేడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1980-12-09)1980 డిసెంబరు 9
నాందేడ్, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు వసంతరావు చవాన్, సుందర్‌బాయి
జీవిత భాగస్వామి సోనియా చవాన్
సంతానం 2
నివాసం చవాన్ గల్లి, జునేగావ్ నైగావ్, నాందేడ్, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

రవీంద్ర వసంతరావు తన తండ్రి వసంతరావు చవాన్ మరణాంతరం నవంబర్ 2024లో నాందేడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు అక్టోబర్ 17న కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.[2] ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంతుక్ హంబర్డేపై 1,457 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] రవీంద్ర చవాన్‌కు 5,86,788 ఓట్లు రాగా, సంతుక్ హంబర్డేకు 5,85,331 ఓట్లు వచ్చాయి.[4] రవీంద్ర వసంతరావు చవాన్‌ నవంబర్ 28న లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశాడు.[5]

మూలాలు

మార్చు
  1. The Times of India (23 November 2024). "Nanded by-poll election result 2024: Congress's Ravindra Chavan wins against BJP's Santukrao Hambarde". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
  2. The Hindu (17 October 2024). "Congress fields Ravindra Chavan for Nanded; accuses Mahayuti of disrespecting Shivaji Maharaj's legacy" (in Indian English). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
  3. Eenadu (23 November 2024). "నాందేడ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠ.. రసవత్తర పోరులో గట్టెక్కిన కాంగ్రెస్‌". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  4. Election Commision of India (23 November 2024). "Nanded Lok Sabha bypoll result 2024". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  5. The Economic Times (28 November 2024). "Priyanka Gandhi, Ravindra Vasantrao Chavan to take oath as MPs in Lok Sabha today". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.