ప్రధాన మెనూను తెరువు

రష్యన్ ఎయిర్‌ఫోర్స్ (Russian Air Force) (Russian: Военно-воздушные силы России, లిప్యంతరీకరణ: వోయెన్నో-వోజ్డుష్నై సిలీ రోస్సీ ) అనేది రష్యా దేశ వైమానిక దళం. 2,749 విమానాలతో ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద వైమానిక దళంగా గుర్తించబడుతుంది. ప్రస్తుతం దీనికి కల్నల్ జనరల్ అలెగ్జాండర్ జెలిన్ నేతృత్వం వహిస్తున్నారు. రష్యా నావికా దళానికి సొంత వైమానిక విభాగం ఉంది, దాని పేరు రష్యన్ నావల్ ఏవియేషన్, ఇది మాజీ సోవియట్ ఏవియాత్సియా వోయెన్నో మార్స్‌కోగో ఫ్లోటా ("నావల్ ఏవియేషన్") లేదా AV-MFగా కూడా గుర్తిస్తారు) గా ఉండేది.

Военно-воздушные силы России
Voyenno-vozdushnye sily Rossii
Russian Air Force
Emblem of the Russian Air Force
Flag of the Russian Air Forces
దేశంRussian Federation
(previously the Soviet Union and Russian Empire)
పాత్రDefeating enemy units, reconnaissance, defence of major military units and facilities
పరిమాణం210,000 personnel
2,749 aircraft
వార్షికోత్సవాలుAugust 12
కమాండర్స్
ప్రస్తుత
కమాండర్
Colonel General Alexander Zelin
Insignia
Identification
symbol
Roundel of Russia.svg
(1991-2010)Roundel of Russia (1991–2010).svg

1991-92లో సోవియట్ యూనియన్ రద్దు చేయబడిన తరువాత మాజీ సోవియట్ వైమానిక దళం యొక్క భాగాల నుంచి ఈ వైమానిక దళాన్ని ఏర్పాటు చేశారు. బోరిస్ యెల్ట్‌సిన్ రష్యా సమాఖ్యలో రక్షణ మంత్రిత్వ శాఖను 1992 మే 7న ఏర్పాటు చేశారు, ఇదే తేదీని కొత్త వైమానిక దళం ఏర్పడిన రోజుగా పరిగణించడం జరుగుతుంది. ఈ సమయం నుంచి, వైమానిక దళానికి వనరుల కొరత కారణంగా తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి, తద్వారా దీని పరిమాణం నిరంతరం క్షీణిస్తూ వచ్చింది. వ్లాదిమీర్ పుతిన్ రష్యా సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, మొత్తం సైనిక దళాలకు నిధుల కేటాయింపులను బాగా పెంచారు. సుశిక్షితులైన పైలెట్‌ల పరంగా యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి, సమృద్ధ శిక్షణ వనరులతో మెరుగైన నిర్వహణలో ఉన్న విమానాలను ఉపయోగించడానికి ఈ ఆర్థిక వనరుల పెంపు దోహదపడిందా లేదా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియాల్సి ఉంది.[ఉల్లేఖన అవసరం]

చరిత్రసవరించు

డిసెంబరు 1991లో సోవియట్ యూనియన్ పదిహేను గణతంత్ర దేశాలుగా విభజించబడిన తరువాత, కొత్తగా ఏర్పడిన స్వతంత్ర రాజ్యాల మధ్య సోవియట్ వైమానిక దళాల - VVS యొక్క విమానాలు మరియు సిబ్బందిని విభజించారు. సోవియట్ వైమానిక దళాల మాజీ డిప్యూటీ కమాండర్-ఇన్-ఛీఫ్ జనరల్ ప్యోతర్ డెయ్నెకిన్ 1991 ఆగస్టు 24న కొత్త సంస్థకు మొట్టమొదటి కమాండర్‌గా మారారు. ఆధునిక యుద్ధ విమానాల్లో ఎక్కువ భాగాన్ని మరియు 65% సిబ్బందిని రష్యా పొందింది. మాజీ సోవియట్ VVSలోని ప్రధాన కమాండ్‌లు - లాంగ్ రేజ్ ఏవియేషన్, మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఏవియేషన్ మరియు ఫ్రాంటల్ ఏవియేషన్‌లకు కొద్దిస్థాయి మార్పులతో రష్యన్ VVS కమాండ్‌లుగా పేర్లు మార్చారు. అయితే, తమ భూభాగాల్లో ఉన్న అనేక రెజిమెంట్‌లు, విమానాలు మరియు సిబ్బందిని కొత్తగా ఏర్పడిన దేశాలు తమ దళాలుగా ప్రకటించుకున్నాయి, తద్వారా ఇవి కొత్త దేశాల వైమానిక దళాలుగా మారాయి. బెలారస్ మరియు ఉక్రేయిన్ దేశాల్లోని కొన్ని విమానాలను (Tu-160 యుద్ధ విమానాల వంటివి) రష్యాకు తిరిగి పంపారు, కొన్నిసార్లు దీనికి బదులుగా రుణాల్లో తగ్గింపులను అందించడం జరిగింది. వీటితోపాటు కజకిస్థాన్‌లోని డోలోన్‌లో ఉన్న ఒక లాంగ్ రేంజ్ ఏవియేషన్ డివిజన్‌ను కూడా రష్యాకు అప్పగించారు.

1990వ దశకంలో, సైనిక దళాలకు ఎదురైన తీవ్రమైన ఆర్థిక వనరుల కొరత వైమానిక దళాన్ని కూడా ప్రభావితం చేసింది.[1] పైలెట్‌లు మరియు ఇతర సిబ్బంది కొన్నిసార్లు నెలసరి వేతనాలు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడింది, అప్పడప్పుడు వీరు తీవ్ర నిరాశకు లోనయ్యారు: దూర ప్రాచ్యంలోని యెలిజోవోలో ఉన్న మిగ్-31 (MiG-31) పైలెట్‌లు కొన్ని నెలలుగా తమకు చెల్లించాల్సిన వేతన బకాయిలను చెల్లించాలని కోరుతూ 1996లో నిరాహార దీక్ష చేశారు, చివరకు ఇతర పనుల కోసం ఉద్దేశించిన నిధులను మళ్లించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించారు.[2] కొరత ఫలితంగా, మౌలిక సదుపాయాలు కూడా క్షీణించాయి, 1998లో, 40% మిలిటరీ వైమానిక స్థావరాలకు మరమత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఈ పరిస్థితిలో మెరుగుదల కనిపించింది, పుతిన్ ప్రభుత్వం సైనిక దళాలకు నిధుల కేటాయింపులను పెంచి వాటిని ఆదుకుంది.

మొదటి చెచెన్యా యుద్ధం (1994–1996) మరియు రెండో చెచెన్యా యుద్ధం (1999–2002) లో VVS పాల్గొంది. భూస్వరూపానికి సంబంధించిన సమస్యలు, ఎక్కువగా నిర్దిష్ట లక్ష్యాలు లేకపోవడం, తీవ్రవాదుల వద్ద ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు స్టింజెర్ మరియు స్ట్రెలా-2M ఉండటం వలన ఈ యుద్ధాలు VVSను అనేక ఇబ్బందులకు గురిచేశాయి.

1990వ దశకంలో, సుఖోయ్ రూపకల్పన విభాగం ఒక ప్రత్యామ్నాయ యుద్ధ విమానం T-60Sను రూపొందించింది. ఈ యుద్ధ విమానం ఉత్పాదక దశకు చేరుకోలేదు. మధ్యలో ఆగిపోయిన మరో యుద్ధ విమాన రూపకల్పన ప్రాజెక్టు మిగ్ 1.42.

మాజీ సోవియట్ వాయు రక్షణ దళాలు రష్యా నియంత్రణలో పలు సంవత్సరాలపాటు స్వతంత్రంగా ఉన్నాయి, 1998లో ఇవి వైమానిక దళాలలో విలీనమయ్యాయి. అధ్యక్షుడు బోరిస్ యెల్ట్‌సిన్ జారీ చేసిన ఆదేశంతో 1997 జూలై 16న రెండు దళాల విలీనం జరిగింది. 1998లో మొత్తంమీద 580 యూనిట్‌లు మరియు సంస్థలు రద్దు చేయబడ్డాయి, 134 విభాగాలను పునర్వ్యవస్థీకరించారు, 600లకుపైగా విభాగాలకు కొత్త అధికారిక పరిధి ఇచ్చారు.[3] దళాల పునఃపంపిణీతో 95% విమానాలు, 98% హెలికాఫ్టర్‌లు, 93% విమాన నిరోధక క్షిపణి వ్యవస్థలు, 95% రేడియో సాంకేతిక దళాల పరికరాలు, 100% యుద్ధవిమాన-నిరోధక క్షిపణులు, 60%పైగా వైమానిక యుద్ధసామాగ్రి ప్రభావితమయ్యాయి. 600,000 టన్నులకుపైగా యుద్ధసామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించారు, 3500 విమానాలకు స్థావరాలను మార్చారు. మిలిటరీ రవాణా కోసం ఉద్దేశించిన వైమానిక దళానికి చెందిన విమానాలు 40,000కుపైగా కుటుంబాలను కొత్త నివాస ప్రాంతాలకు తరలించాయి.

వైమానిక దళంలో సిబ్బంది సంఖ్య 185 000కు పడిపోయింది, మాజీ సోవియట్ యూనియన్ వైమానిక దళంలో సిబ్బంది సంఖ్య 318,000 వద్ద ఉండటం గమనార్హం. వీటిలో 1000 కల్నల్ ఉద్యోగాలతోపాటు, 123,500 మంది ఉద్యోగాలను రద్దు చేశారు. 14 మంది కల్నల్ జనరళ్లతోపాటు, మొత్తం 46 మంది జనరల్ హోదా వ్యక్తులు రాజీనామా చేశారు, అంతేకాకుండా మొత్తంమీద 3000 మంది ఇతర సిబ్బంది రాజీనామాలు సమర్పించారు. 1998 డిసెంబరు 29న వాయు రక్షణ దళాల మాజీ అధికారి మరియు డెయ్నెకిన్ తరువాత విలీనమైన దళానికి కొత్త కమాండర్ ఇన్-ఛీఫ్‌గా పనిచేసిన కల్నల్ జనరల్ అనటోలీ కోర్నుకోవ్ రష్యా రక్షణ శాఖ మంత్రికి దళాలకు సంబంధించిన పనిని అత్యవసరంగా పూర్తి చేయాలని నివేదించారు.[4] జనరల్ కోర్నుకోవ్ వైమానిక దళం కోసం మాస్కో ప్రధాన కేంద్రానికి 20 కి.మీ. ఉత్తరంగా ఉన్న బాలాషిఖా సమీపంలోని జార్యాలో కొత్త ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు, ఈ ప్రదేశం మాజీ PVO సెంట్రల్ కమాండ్ స్థావరంగా ఉండేది, ఇక్కడి నుంచే CIS ఉమ్మడి వాయు రక్షణ వ్యవస్థ ఆదేశాలు జారీ చేస్తుంది.

2000 నుంచి పరిణామాలుసవరించు

 
2001లో తీసిన వైమానిక దళ సు-25 యుద్ధ విమాన ఛాయాచిత్రం

జనరల్ కోర్నుకోవ్ తరువాత 2002లో జనరల్ వ్లాదిమీర్ మిఖాయిలోవ్ వైమానిక దళ సారథ్య బాధ్యతలు చేపట్టారు.

డిసెంబరు 2003లో ఆర్మీ యొక్క వైమానిక ఆస్తులు-ఎక్కువగా హెలికాఫ్టర్‌లు-VVSకు బదిలీ చేయబడ్డాయి, చెచెన్యాలో 2002 ఆగస్టు 19న మి-26 (Mi-26) హెలికాఫ్టర్ కూల్చివేయడంతో 19 మంది మృతి చెందారు, దీంతో ఈ హెలికాఫ్టర్‌లను వైమానిక దళానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. మాజీ ఆర్మీ విభాగాన్ని దాని పూర్వ రూపంలోనే ఉంచారు, పదాతి దళాలకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వడం కోసం ఇది ఉద్దేశించబడింది, వారికి వ్యూహాత్మక వాయు మద్దతు అందించడం, వ్యూహాత్మక వైమానిక నిఘా నిర్వహించడం, ఎయిర్‌బర్న్ దళాలను రవాణా చేయడం, వారి చర్యలకు దాడి మద్దతు అందించడం, ఎలక్ట్రానిక్ యుద్ధం, ప్రధాన యుద్ధరంగ అడ్డంకులను ఏర్పాటు చేయడం మరియు ఇతర పనుల ద్వారా ఇది పదాతి దళాలకు మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం ఆర్మీ ఏవియేషన్ విభాగం యొక్క అధిపతి ద్వారా నిర్వహించబడుతున్న మాజీ ఆర్మీ ఏవియేషన్‌కు 2007 మధ్య కాలంలో లెప్టినెంట్ జనరల్ అనటోలీ సుర్ట్‌సుకోవ్ నేతృత్వం వహిస్తున్నారు.[5]

అక్టోబరు 2004లో టుపోలెవ్ టు-22M3 (Tupolev Tu-22M3) యుద్ధ విమానాలను ఉపయోగించే 200 మరియు 444వ బాంబర్ ఏవియేషన్ రెజిమెంట్‌లు మరియు 28th, 159, 790, మరియు 941వ ఫైటర్ ఏవియేషన్ రెజిమెంట్‌లు, సుఖోయ్ సు-24 (Sukhoi Su-24) లను ఉపయోగించే 302వ మరియు 959వ రెజిమెంట్‌లు మరియు సుఖోయ్ సు-25 విమానాలను ఉపయోగించే 187 మరియు 461వ రెజిమెంట్‌లను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.[6] అయితే ఈ రద్దు చర్యలు సఫలం కాలేదు.

వైమానిక దళం పైలెట్ శిక్షణ కోసం వనరుల కొరతతో ఇబ్బంది పడటం కొనసాగింది. 1990వ దశకంలో రష్యా పైలెట్‌లు అమెరికా సంయుక్త రాష్ట్రాల వైమానిక దళంలో పైలెట్‌లతో పోలిస్తే సుమారుగా 10% శిక్షణ గంటలు మాత్రమే పొందారు. IISS మిలిటరీ బ్యాలెన్స్ యొక్క 2007 సంచిక వ్యూహాత్మక వైమానిక దళాలకు చెందిన పైలెట్‌లకు ఏడాదికి 20–25 గంటలు, 61వ ఎయిర్ ఆర్మీ పైలెట్‌లు (మాజీ మిలిటరీ రవాణా వైమానిక దళం) ఏడాదికి 60 గంటలు, VVS నియంత్రణలోని ఆర్మీ ఏవియేషన్ ఏడాదికి 55 గంటల శిక్షణ సమయాన్ని పొందినట్లు తెలియజేసింది.[7]

జనరల్ మిఖాయిలోవ్ తరువాత వైమానిక దళ సారథ్య బాధ్యతలను 2007లో జనరల్ కల్నల్ అలెగ్జాండర్ జెలిన్ చేపట్టారు. ఆగస్టు 2007లో జెలిన్ మాట్లాడుతూ, 2011నాటికి వైమానిక దళానికి అధునాతన మానవరహిత వైమానిక వాహనాలు (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్) (UAV) లు సమకూరతాయని చెప్పారు, ఈ మానవరహిత యుద్ధ విమానాలకు 400 కిలోమీటర్లు (250 మైళ్లు) మరియు 12 గంటల వరకు ఆకాశంలో ప్రయాణించగల సామర్థ్యం ఉంటాయని వెల్లడించారు.[8] స్థిరమైన మరియు తిరిగే-రెక్కల రకాలతో తయారయ్యే ఈ రెండు UAVలు వివిధ రకాల పనులు నిర్వహిస్తాయి, నిఘా, దాడి, రేడియో తరంగాలను తిరిగి బదిలీ చేయడం మరియు లక్ష్యాన్ని గుర్తించడం వంటి పలు పనులను ఇవి నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు.[8]మూస:Russian military ఆగస్టు 2007లో, 16వ ఎయిర్ ఆర్మీ కమాండర్ జనరల్ మేజర్ అలెగ్జాండర్ బెలెవిట్చ్ 16వ ఎయిర్ ఆర్మీకి సమీప భవిష్యత్‌లో రెండు అధునాతన సు-34 ఫుల్‌బ్యాక్ ఫైటర్-బాంబర్‌లు (ఒక రకం యుద్ధ విమానాలు) సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.[9] అయితే, 2010నాటికి కేవలం 16 సు-34 యుద్ధ విమానాలు మాత్రమే సేవలు అందిస్తున్నాయి, ఒక ఫ్రంట్‌లైన్ యూనిట్ మాత్రమే ఇటువంటి విమానాలను పొందింది.[10] బెలెవిట్చ్ తమ దళానికి మిగ్-29SM ఫుల్‌క్రమ్ యుద్ధ విమానాలు వస్తాయని, వీటిని కాలంచెల్లిన మిగ్-29ల స్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు, వీటితోపాటు దగ్గరి నుంచి మద్దతు ఇచ్చే అత్యాధునిక సు-24 ఫ్రాగ్‌ఫూట్ యుద్ధ విమానాలు కూడా వస్తాయని చెప్పారు, ఇవి ఆఫ్ఘనిస్తాన్, చెచెన్యా మరియు ఇతర ప్రదేశాల్లో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించాయని తెలిపారు.[9]

శాశ్వత ప్రాతిపదికన సుదీర్ఘ-ప్రయాణాలు చేయగల యుద్ధ విమానాలను పంపడాన్ని జూలై మరియు ఆగస్టు 2007లో పునరుద్ధరించింది, దీనికి ముందు సోవియట్ యుగంలో మాత్రమే రష్యా ఇటువంటి కార్యకలాపాలు సాగించింది, సోవియట్ యూనియన్ పతనమైన తరువాత ఇంధన వ్యయాలు మరియు ఇతర ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆపై తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఫలితంగా, 15 ఏళ్లపాటు తమ విమానాలను పంపే విధానానికి రష్యా స్వస్తిపలికింది.[11][12] ఉత్తర ధ్రువం, అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రంపై గస్తీ చర్యలను తిరిగి ప్రారంభించింది, తరచుగా విమానాలను NATO (నాటో) భూభాగానికి దగ్గరగా తీసుకొచ్చింది, ఇటీవల UK మరియు ఐర్లాండ్ మధ్య ఐరిష్ సముద్రంపై రష్యా వైమానిక దళ విమానాలు ప్రయాణించాయి.[13]

2008లో వైమానిక దళం 4 నుంచి 7 వరకు విమానాలను కోల్పోయింది, 2008 దక్షిణ ఒసెటియన్ యుద్ధం సందర్భంగా జార్జియా విమాన-విధ్వంసక చర్యల్లో ఇవి నేలకూలాయి.

Warfare.ru అనే వెబ్‌సైట్ 2009 ప్రారంభంలో వైమానిక దళంలో ఒక ప్రధాన పునర్వ్యవస్థీకరణ జరిగినట్లు వెల్లడించింది, దీనిలో ఎయిర్ ఆర్మీలను కమాండ్‌లుగా మార్చడం, ఎక్కువ భాగం వైమానిక రెజిమెంట్‌లను వైమానిక స్థావరాలుగా మార్చినట్లు తెలిపింది.[14] అయితే, యుద్ధ విమానాలు ఆగస్టు-సెప్టెంబరు 2009 వివాదంపై స్టెఫాన్ బట్నెర్ వెల్లడించిన అభిప్రాయాలు ప్రకారం, యుద్ధానికి సంబంధించిన క్రమంలో మాత్రం పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు, ఇది కింద సూచించిన విధంగానే ఉన్నట్లు వెల్లడించారు.[15] చివరగా ఏవియేషన్ వీక్ & స్పేస్ టెక్నాలజీ పునర్వ్యవస్థీకరణ డిసెంబరు 2009నాటికి పూర్తవుతుందని ధ్రువీకరించింది, వైమానిక సిబ్బంది సంఖ్యల్లో 40 శాతం తగ్గింపు ఉండవచ్చని తెలియజేసింది.[16]

ఫిబ్రవరి 2009లో, రష్యా వార్తాపత్రిక కోమ్మెర్‌శాట్ రష్యా వైమానిక దళంలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న మొత్తం 291 మిగ్-29 యుద్ధ విమానాల్లో 200 యుద్ధ విమానాలు సురక్షితంగా లేవని, వాటిని శాశ్వతంగా విడిచిపెట్టాల్సి ఉందని వెల్లడించింది.[17] ఈ చర్య వలన రష్యా యొక్క మొత్తం వైమానిక దళంలో సుమారుగా 650 యుద్ధ విమానాల్లో మూడో వంతు యుద్ధ విమానాలను సేవల నుంచి తొలగించాల్సి వస్తుందని పేర్కొంది.

2009 జూన్ 5న జనరల్ స్టాఫ్ ఛీఫ్ నికోలాయ్ మేకరోవ్ రష్యా వైమానిక దళం గురించి మాట్లాడుతూ, బాంబు దాడి చర్యలను వారు వెలుతురులో పగటిపూట నిర్వహించినప్పటికీ, వారు లక్ష్యాలను ఛేదించలేరని పేర్కొన్నారు.[18] మేజర్ జనరల్ పావెల్ ఆడ్రోసోవ్ మాట్లాడుతూ సుదూర-ప్రయాణాలు చేసే రష్యా యుద్ధ విమానాలను 2009లో ఆధునికీకరిస్తున్నట్లు, లక్ష్యాలకు 20 మీటర్ల పరిధిలో దాడి చేయగల సామర్థ్యాన్ని వాటికి అందించనున్నట్లు సూచించారు.[19]

2009 ఆగస్టు 18న రష్యా ప్రభుత్వం MAKS-2009 వైమానిక ప్రదర్శనలో 48 సు-35BM, 4 సు-30M2 మరియు 12 సు-27SM' యుద్ధ విమానాల కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసింది.[20]

సెప్టెంబరు 2009లో జాయింట్ CIS ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఒక తూర్పు ఐరోపా నెట్‌వర్క్‌ను రష్యా మరియు బెలారస్ కలిసి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన వెలువడింది.[21] రష్యా-బెలారస్ దేశాల గగనతలాన్ని సంయుక్తంగా రక్షించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రణాళిక ప్రకారం దీనిలో ఐదు వైమానిక దళ యూనిట్‌లు, 10 విమాన విధ్వంసక యూనిట్‌లు, ఐదు సాంకేతిక సేవా మరియు మద్దతు యూనిట్‌లు మరియు ఒక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ యూనిట్‌లు భాగంగా ఉండనున్నాయి. రష్యా లేదా బెలారస్ వైమానిక దళం లేదా ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్ నేతృత్వంలో ఇది పనిచేస్తుంది.

పలు రష్యా ఏవియేషన్ కంపెనీలు అధునాతన యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రస్తుతం వినియోగంలో ఉన్న వయస్సు మీదపడుతున్న మిగ్-29 మరియు సు-27 యుద్ధ విమానాల స్థానంలో అధునాతన యుద్ధ విమానాలను చేర్చేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. నిధుల ఇబ్బందుల కారణంగా అన్ని ప్రయత్నాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సుఖోయ్ ముందు వరుసలో నిలిచింది. వ్యూహాత్మక వైమానిక దళాల కోసం ఉద్దేశించిన భవిష్యత్ వైమానిక యుద్ధ విమానం - సుఖోయ్ పాక్ ఎఫ్ఏ 2002 నుంచి అభివృద్ధిలో ఉంది. మొదటి నమూనా 2010 జనవరి 29లో ప్రాథమిక ప్రయాణాన్ని నిర్వహించింది. 2015 నాటికి దీనిని వైమానిక దళంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.[22]

ఇటీవల వైమానిక దళ విమానాలపై సోవియట్ ఎర్రని నక్షత్ర చిహ్నాన్ని మార్చడంపై చర్చ జరుగుతుంది. మార్చి 2010లో, స్టేట్ డుమాకు కొత్త చిహ్నాన్ని ప్రతిపాదించారు, జాతీయ పతాకంలో మూడు రంగులను ప్రతిబింబించేలా ఒక నీలి రంగు వెలుపలి చారను చేర్చాలని ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు.[ఉల్లేఖన అవసరం] ఈ ప్రతిపాదనను సమాఖ్య మండలి తిరస్కరించింది,[ఉల్లేఖన అవసరం] అయితే మూడు రంగుల చిహ్నాన్ని ఉపయోగించిన కొన్ని విమానాల చిత్రాలు మాత్రం కనిపించాయి.[ఉల్లేఖన అవసరం]

జులై 2010లో, రష్యా యుద్ధ విమానాలు ఐరోపాలో రష్యా భూభాగం నుంచి దూరప్రాచ్యంలోని రష్యా భూభాగానికి ప్రయాణించాయి.[23]

ఆగస్టు 2010నాటికి, రష్యా వైమానిక దళం యొక్క కమాండర్-ఇన్-ఛీఫ్ అలెగడాంర్ జెలిన్ (ఎఖో మోక్‌వీ రేడియో స్టేషన్‌కు 2010 ఆగస్టు 14న ఇచ్చిన ఇంటర్వ్యూలో) మాట్లాడుతూ రష్యా పైలెట్‌లకు ఏడాదికి అందుబాటులో ఉన్న సగటు విమాన ప్రయాణ గంటలు 80కి చేరుకున్నాయని వెల్లడించారు, ఆర్మీ ఏవియేషన్ మరియు మిలిటరీ రవాణా వైమానిక దళానికి చెందిన పైలెట్‌లకు విమాన ప్రయాణ గంటలు ఏడాదికి 100కుపైగా ఉన్నాయని చెప్పారు.[24]

2010 ఆగస్టు 15నాటికి, రష్యా వైమానిక దళం తాత్కాలికంగా తమ సు-25 విమానాల వాడకాన్ని నిలిపివేసింది, ఒక శిక్షణ కార్యక్రమంలో విమాన కూలిపోయిన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ 2010 ఆగస్టు 6న సైబీరియాలో స్టెప్ విమానాశ్రయానికి వాయువ్యంగా 60 కిమీ దూరంలో ఈ విమానం కూలిపోయినట్లు వెల్లడించిందని ఆర్ఐఏ నోవోస్టి పేర్కొంది. రష్యా వైమానిక దళం ద్వారా ఈ విమానాన్ని ఆధునీకరిస్తున్నారు. విమానంలోని సిబ్బంది విమానం కూలిపోవడానికి ముందుగానే సురక్షితంగా దాని నుంచి బయటపడ్డారు, విమాన ప్రమాదంలో పౌరులెవరికీ గాయాలు కాలేదు.

ర్యాంకులు మరియు చిహ్నంసవరించు

నిర్మాణంసవరించు

 
రష్యా వైమానిక దళం యొక్క చిహ్నం

యుద్ధానికి సంబంధించిన క్రమాన్ని ఎయిర్ ఫోర్సెస్ మాస పత్రిక యొక్క జూలై మరియు ఆగస్టు 2007 సంచికల నుంచి పునర్నిర్మించారు.

2009లో రష్యా వైమానిక దళాల నిర్మాణం పూర్తిగా ఒక కమాండ్-ఎయిర్ బేస్ నిర్మాణానికి మార్చబడింది, గతంలో ఇది ఎయిర్ ఆర్మీ- ఎయిర్ డివిజన్ లేదా కార్ప్స్-ఎయిర్ రెజిమెంట్లో ఉండేది. జాబితా ప్రస్తుత నిర్మాణం ప్రకారం లేదు. Warfare.ru వెబ్‌సైట్ ప్రస్తుత రోజు జాబితాగా కనిపించే దానిని నిర్వహిస్తుంది, కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మేగజైన్ జూన్ 2010లో తమ సంస్థ యొక్క నూతన యుద్ధ క్రమ అంచనాను వెల్లడించింది.

రష్యా వైమానిక దళం యొక్క సెంట్రల్ సబార్డినేషన్ దళాలు

 • ప్రత్యేక అవసరాల కోసం 8వ ఎయిర్ డివిజన్ (చకాలోవ్‌స్కీ చకాలోవ్‌స్కీ విమానాశ్రయం?)
 • 929వ స్టేట్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ (అక్తుబిన్సక్)
 • 4వ సెంటర్ ఫర్ కాంబాట్ ట్రైనింగ్ అండ్ ఫ్లైట్ పర్సనల్ ట్రైనింగ్ - లిపెట్క్ ఎయిర్ బేస్
 • 344వ సెంటర్ ఫర్ కాంబాట్ ట్రైనింగ్ అండ్ ఫ్లైట్ పర్సనల్ ట్రైనింగ్ - టోర్జోక్ (పదాతి దళాల హెలికాఫ్టర్‌లు)
  • 696వ రీసెర్చ్ అండ్ ఇన్‌స్ట్రక్షన్ హెలికాఫ్టర్ రెజిమెంట్ (టోర్జోక్) (కా-50, మి-8, మి-24, మి-26, మి-28)
  • 92వ రీసెర్చ్ అండ్ ఇన్‌స్ట్రక్షన్ హెలికాఫ్టర్ స్క్వాడ్రన్ (సోకోల్-వ్లాదిమీర్) (మి-8, మి-24)
 • 2881వ రిజర్వ్ హెలికాఫ్టర్ బేస్ - మి-24 - టోట్స్కోయి (వైమానిక స్థావరం)
 • 924వ సెంటర్ ఫర్ కాంబాట్ ట్రైనింగ్ అండ్ ఫ్లైట్ పర్సనల్ ట్రైనింగ్ - యెగోర్‌యెవ్‌స్క్ (UAVలు)
 • రష్యన్ స్టేట్ సైంటిఫిక్-రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ ఫర్ కాస్మోనాట్ ట్రైనింగ్ - స్టార్ సిటీ, రష్యా జ్వెజ్డ్‌నీయ్ గోరోడోక్
 • 2457వ ఎయిర్ బేస్ ఆఫ్ లాంగ్ రేంజ్ రేడియోలొకేషన్ డిటెక్షన్ ఎయిర్‌క్రాఫ్ట్ - A-50 యుద్ధ విమానాలు - ఐవనోవో సెవెర్నీ
 • 1వ ఫైటర్-బాంబర్ ఏవియేషన్ రెజిమెంట్ - సు-24 - లెబ్యాజైయ్
 • 764వ ఫైటర్ ఏవియేషన్ రెజిమెంట్ - మిగ్-31, మిగ్-25PU - బోల్షోయి సావినో విమానాశ్రయం (సోకోల్)
 • 5వ ఇండిపెండెంట్ లాంగ్ రేంజ్ రీకానిసెన్స్ ఏవియేషన్ డిటాచ్‌మెంట్ - వోరోనెజ్ (CFE, INF వెరిఫికేషన్)
 • 185వ సెంటర్ ఫర్ కాంబాట్ ట్రైనింగ్ అండ్ ఫ్లైట్ పర్సనల్ ట్రైనింగ్ - ఆస్ట్రాఖాన్
 • 118వ ఇండిపెండెంట్ హెలికాఫ్టర్ రెజిమెంట్ - ద్మిత్రియెవ్కా [Чебеньки], ఓరెన్‌బర్గ్ ఓబ్లాస్ట్.
 • 4020వ బేస్ ఫర్ రిజర్వ్ ఎయిర్‌క్రాఫ్ట్, లిపెట్‌స్క్
 • 4215వ బేస్ ఫర్ రిజర్వ్ ఎయిర్‌క్రాఫ్ట్, ద్మిత్రియెవ్కా

శిక్షణ విభాగాలు

 • క్రాస్నోడార్ మిలిటరీ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ (L-39Cలు)
 • సైజ్రాన్ మిలిటరీ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ (మి-2, మి-8, మి-24)
 • 783వ ట్రైనింగ్ సెంటర్ (ఆర్మావీర్) (మిగ్-29, L-39C)
 • 786వ ట్రైనింగ్ సెంటర్ (బోరిసోగ్లెబ్‌స్క్)

స్పెషల్ పర్పస్ కమాండ్ (ప్రత్యేక అవసరాల దళాలు) , ప్రధాన కార్యాలయం, మాస్కో, మాస్కో మిలిటరీ జిల్లా

 • 16వ ఎయిర్ ఆర్మీ - కుబిన్కా
  • 105వ కాంపోజిట్ ఏవియేషన్ డివిజన్, వోరోనెజ్
   • 455వ బాంబర్ ఏవియేషన్ రెజిమెంట్ - ఆపరేటింగ్ సుఖోయ్ సు-24, చెర్టోవిట్‌స్కోయి విమానాశ్రయం, వోరోనెజ్ వద్ద ఉంది
   • 899వ ష్తుర్మోవిక్ (అసాల్ట్) ఏవియేషన్ రెజిమెంట్ సు-25, బుటుర్‌లినోవ్కా వద్ద ఉంది.
  • 14వ ఫైటర్ ఏవియేషన్ రెజిమెంట్ - మిగ్-29 - కుర్సక్
  • 28వ ఫైటర్ ఏవియేషన్ రెజిమెంట్ - మిగ్-29 - ఆండ్రియాపోల్ (వైమానిక స్థావరం)
  • 47వ రీకానిసెన్స్ ఏవియేషన్ రెజిమెంట్ - మిగ్-25 మరియు సు-24 సేవల్లో ఉన్నాయి - షాటాలోవో వద్ద HQ
  • 237వ ఎయిర్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ సెంటర్ ఆఫ్ గార్డ్స్ - కుబిన్కా - మిగ్-29, సు-27, సు-27M, L-39C;
 • 226వ ఇండిపెండెంట్ కాంపోజిట్ ఎయిర్ రెజిమెంట్ (మి-8, మి-9, ఆన్-12, ఆన్-24, ఆన్-26, ఆన్-30) (కుబిన్కా (వైమానిక స్థావరం) ;
 • 1వ కార్ప్స్ ఆఫ్ PVO (ఉపరితలం నుంచి ఆకాశంలో లక్ష్యాలను ఛేదించే క్షిపణులు మాత్రమే) ;
 • 32వ కార్ప్స ఆఫ్ PVO (రజెవ్)
  • 611వ ఫైటర్ ఏవియేషన్ రెజిమెంట్ సు-27 డోరోఖోవో
  • 790వ ఇంటర్‌సెప్టర్ ఏవియేషన్ రెజిమెంట్ - మిగ్-31, మిగ్-25U - ఖోటిలోవో
 • ఆర్మీ వైమానిక దళ భాగాలు
  • 45వ ఇడిపెండెంట్ హెలికాఫ్టర్ రెజిమెంట్ (ఓరెష్‌కోవో (వోరోటిన్‌సక్) కాలుగా సమీపంలో) మి-24
  • 440వ ఇండిపెండెంట్ హెలికాఫ్టర్ రెజిమెంట్ ఫర్ బ్యాటిల్ కంట్రోల్- వ్యాజ్మా - మి-24, మి-8
  • 490వ ఇండిపెండెంట్ హెలికాఫ్టర్ రెజిమెంట్ ఫర్ బ్యాటిల్ కంట్రోల్- క్లోకోవో (టులాకు 4 కిమీ ఉత్తరంగా) - మి-24, మి-8;
  • 865వ రిజర్వ్ హెలికాఫ్టర్ బేస్ (ప్రోటాసోవో/అలెగ్జాండ్రోవో (వైమానిక స్థావరం), ర్యాజాన్ సమీపంలో) ;

1వ ఎయిుర్ అండజ్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండ్, లెనిన్‌గ్రాడ్ మిలిటరీ జిల్లా (మాజీ VVS మరియు PVO యొక్క 6వ ఆర్మీ)

VVS మరియు PVO యొక్క 2వ కమాండ్ దూరప్రాచ్య మిలిటరీ జిల్లా (మాజీ VVS మరియు PVO యొక్క 11వ ఆర్మీ)

VVS మరియు PVO యొక్క3వ కమాండ్, సైబీరియా మిలిటరీ జిల్లా (మాజీ VVS మరియు PVO యొక్క 14వ ఆర్మీ)

4వ ఎయిర్ అండ్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండ్, ఉత్తర కాకసస్ మిలిటరీ జిల్లా (మాజీ VVS మరియు PVO యొక్క 4వ మరియు 5వ ఆర్మీలు)

మూస:Air Forces of Russia and the Soviet Union కమాండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఏవియేషన్ - మాస్కో వద్ద HQ

  • 43వ సెంటర్ ఫర్ కాంబాట్ అండ్ ఫ్లైట్ పర్సనల్ ట్రైనింగ్ - ర్యాజన్ - టు-22M3, టు-95MS, టు-134UBL మరియు ఆన్-26లను నిర్వహిస్తుంది;
  • 22వ హెవీ బాంబర్ ఎయిర్ డివిజన్ "డాన్‌బాస్" - ఇంజెల్స్-2 వద్ద HQలు (ప్రధాన కార్యాలయాలు) ;
   • 121వ హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్ - ఇంజెల్స్ - టు-160 యుద్ధ విమానాలు సేవల్లో ఉన్నాయి;
   • 184వ హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్- ఇంజెల్స్ - టు-95MS;
   • 52వ హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్ - షాయ్కోవ్కా - టు-22M3;
   • 840వ హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్ - సాల్ట్‌సి - టు-22M3;
  • 32వ హెవీ బాంబర్ ఎయిర్ డివిజన్ - ఉక్రేయిన్కాలో ప్రధాన కార్యాలయం;
   • 182వ హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్ - ఉక్రేయిన్కా - టు-95MS;
   • 79వ హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్ - ఉక్రేయిన్కా - టు-95MS;
   • 200వ హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్ - బెలాయా (వైమానిక స్థావరం) (ఐర్టుట్‌స్క్) - టు-22M3, టు-22MR;
   • 444th హెవీ బాంబర్ ఎయిర్ రెజిమెంట్ - వోజ్డ్విజ్‌షెంకా (ఉసురియాస్క్) - టు-22M3;
  • 203వ ఇండిపెండెంట్ ఎయిర్ రెజిమెంట్ ఆఫ్ ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ - ర్యాజాన్ వద్ద ప్రధాన కార్యాలయం- ఐఎల్-78 మరియు ఐఎల్-78M సేవలు అందిస్తున్నాయి;
  • 181వ ఇండిపెండెంట్ ఎయిర్ స్క్వాడ్రన్ - ఇర్కుట్‌స్క్ - ఆన్-12 మరియు ఆన్-30;
  • 199వ వైమానిక స్థావరం - ఉలాన్-ఉడి;
  • 3119వ వైమానిక స్థావరం - టాంబోవ్;
  • అనామక వైమానిక స్థావరం - టిక్సి;

కమాండ్ ఆఫ్ మిలిటరీ ఏవియేషన్ - మాస్కో

  • 610వ సెంటర్ ఫర్ కాంబాట్ అండ్ ఫ్లైట్ పర్సనల్ ట్రైనింగ్ - ఐవానోవో సెవెర్నీ వద్ద ప్రధాన కార్యాలయం;
   • అనామక ఇన్‌స్ట్రక్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ స్క్వాడ్రన్ - ఐవానోవో - ఐఎల్-76లు సేవలు అందిస్తున్నాయి;
  • 12వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ డివిజన్ - ట్వెర్ (మిగాలోవో) ;
   • 196వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ రెజిమెంట్ - ట్వెర్ - ఐఎల్-76 సేవలు అందిస్తున్నాయి;
   • 566వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ రెజిమెంట్ - సెష్చా - ఐఎల్-76, ఆన్-124;
   • 76వ ఇండిపెండెంట్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ స్క్వాడ్రన్ - ట్వెర్ - ఆన్-22;
  • 103వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ రెజిమెంట్ - స్మోలెన్‌స్క్ - ఐల్ఎల్-76;
  • 110వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ రెజిమెంట్ - క్రెచెవిట్సి - ఐఎల్-76;
  • 117వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ రెజిమెంట్ - ఓరెన్‌బర్గ్ - ఐఎల్-76, ఆన్-12;
  • 334వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ రెజిమెంట్ - పిస్కోవ్ - ఐఎల్-76;
  • 708వ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ రెజిమెంట్ - టాగాన్రోగ్ - ఐఎల్-76;
  • 78వ ఇండిపెండెంట్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ స్క్వాడ్రన్ - క్లిన్-5 - ఆన్-26, ఆన్-12 మరియు టు-134లను నిర్వహిస్తుంది;
  • 224వ ఎయిర్ డిటాచ్‌మెంట్ ఆఫ్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఏవియేషన్ - ట్వెర్ - ఆన్-124, ఐఎల్-76MD;
  • ఒక సమాచార ప్రసార కేంద్రం

సోవియట్ వైమానిక స్థావరాల జాబితాలో రష్యా వైమానిక దళంతో క్రియాశీలకంగా ఉన్న స్థావరాలు ఉంటాయి.

విమానాల జాబితాసవరించు

Warfare.ru వెబ్‌సైట్ ఆధారంగా విమానాల జాబితాను ఇక్కడ పేర్కొనడం జరిగింది.[25] రష్యా వైమానిక దళం అన్ని రకాలకు చెందిన మొత్తం 2,749 విమానాలను నిర్వహిస్తుంది. వీటిలో, 1,977 స్థిరమైన రెక్కలుగల యుద్ధ విమానాలు, 177 వ్యూహాత్మక యుద్ధ విమానాలు మరియు 412 దాడులకు ఉపయోగించే హెలికాఫ్టర్‌లు‌ ఉన్నాయి.

} విమానం ఛాయాచిత్రం మూలం రకం రూపాలు సేవలు అందిస్తున్నవాటి సంఖ్య[25] వ్యాఖ్యానాలు
యుద్ధ విమానం
సుఖోయ్ సు-27   USSR గగనతలంలో ఆధిపత్యం చెలాయించే యుద్ధ విమానం సు-27SM 322 [26]
సుఖోయ్ సు-30   రష్యా దాడులు చేసే యుద్ధ విమానం సు-30M 12 [26]
సుఖోయ్ సు-35BM   రష్యా గగనతలంలో ఆధిపత్యం చెలాయించే యుద్ధ విమానం సు-35BM 12 2015నాటికి 48 యుద్ధ విమానాలు అందించనున్నారు, మొదటి దశ విమానాల సరఫరా 2010 చివరికి జరగనుంది.[27]
మికోయాన్ మిగ్-29   USSR బహుళ వినియోగ యుద్ధ విమానం మిగ్-29SM 194 [26]
మికోయాన్ మిగ్-31   USSR ఇంటర్‌సెప్టర్ (శత్రు విమానాలను అడ్డగించే విమానం) మిగ్-31M 168[26] మిగ్31-BM స్థాయికి ఆధునికీకరించే ఒక ప్రాజెక్టు దాదాపు పూర్తికావొస్తుంది.[28]
సుఖోయ్ సు-34   రష్యా బాంబు దాడి చేసే యుద్ధ విమానం సు-34 16 [29] 2012నాటికి 58 విమానాలను సరఫరా చేయనున్నారు[30]
సుఖోయ్ సు-24   USSR వ్యూహాత్మక యుద్ధ విమానం సు-24M2 321 [25]
మికోయాన్ మిగ్-35   రష్యా బహుళ వినియోగ యుద్ధ విమానం మిగ్-35D 0 మిగ్-35 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది, 2011నాటికి 10 నమూనాలను తయారు చేయనున్నారు Ref
సుఖోయ్ సు-25   USSR సమీప వాయు మద్దతు సు-25/సు-25UB 245 సు-25SM స్థాయికి 80 విమానాలను ఆధునికీకరిస్తున్నారు (దాదాపుగా 20 సు-25SMలను ఇప్పటికీ ఆధునికీకరించారు).[31]
మొత్తం యుద్ధ విమానాలు 1,977
బాంబు దాడి చేసే యుద్ధ విమానాలు
టుపోలెవ్ టు-22M USSR వ్యూహాత్మక యుద్ధ విమానం టు-22M3 89 [25]
టుపోలెవ్ టు-95   USSR వ్యూహాత్మక యుద్ధవిమానం టు-95MS 64 64 (37వ ఎయిర్ ఆర్మీ), టు-95MSM స్థాయికి 35 విమానాల ఆధునికీకరణ
టుపోలెవ్ టు-160   USSR వ్యూహాత్మక యుద్ధవిమానం టు-160M 24 16 (37వ ఎయిర్ ఆర్మీ), టు-160M స్థాయికి ఆధునికీకరణ
మొత్తం యుద్ధ విమానాలు 177
శిక్షణ విమానాలు
యాకోవ్లెవ్ యాక్-130   రష్యా శిక్షణ యాక్-130 4 62 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు, మొదటి విమానం 2009కి అందుబాటులోకి రానుంది[32]
ఏరో L-39 ఆల్బాట్రోస్   చెకోస్లోవేకియా శిక్షణ L-39 1000
మొత్తం శిక్షణ విమానాలు 1004
రవాణా విమానాలు
ఇల్యూషిన్ ఐఎల్-76   USSR రవాణా ఐఎల్-76MD 119 ఐఎల్-76MD-90 స్థాయికి ఆధునికీకరణకు సన్నాహాలు
ఇల్యూషిన్ Il-112   రష్యా తేలికపాటి రవాణా విమానం ఐఎల్-112V 0 2015నాటికి 18 అందుబాటులోకి వస్తాయి
ఆంటోనోవ్ ఆన్-12   USSR రవాణా ఆన్-12 గణాంకాలు అందుబాటులో లేవు
ఆంటోనోవ్ ఆన్-22   USSR రవాణా ఆన్-22 21 [33]
ఆంటోనోవ్ ఆన్-26   USSR రవాణా ఆన్-26 30 9 ఆన్-26, 21 ఆన్-26B
ఆంటోనోవ్ ఆన్-124   USSR రవాణా ఆన్-124 25 IISS ప్రకారం 14
ఆంటోనోవ్ ఆన్-70   ఉక్రేయిన్ రవాణా ఆన్-70 0 40 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు [34]
మొత్తం రవాణా విమానాలు 195
కమాండ్ పోస్ట్
ఇల్యూషిన్ ఐఎల్-80   రష్యా కమాండ్ పోస్ట్ ఐఎల్-80 4
టుపోలెవ్ టు-214 రష్యా కమాండ్ పోస్ట్ / విఐపి టు-214-100 6 (ఆర్డర్ ఇచ్చారు) 2 అందుబాటులోకి వచ్చాయి[35]
మొత్తం కమాండ్ పోస్ట్ విమానాలు 6
గగనతలంలో ఇంధన నింపుకునే విమానాలు
ఇల్యూషిన్ ఐఎల్-78   USSR తిరిగి ఇంధన నింపే ట్యాంకర్ ఐఎల్-78 20
మొత్తం ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు 20
నిఘా విమానాలు
బోరీవ్ A-50   USSR AEW&C-నిఘా బోరీవ్ A-50 29 [36] A-50M స్థాయికి ప్రస్తుతం ఆధునికీకరిస్తున్నారు
మిఖోయాన్-గురెవిచ్ మిగ్-25   USSR నిఘా విమానం మిగ్-25RB 42 [37]
మొత్తం నిఘా విమానాలు 71
దాడులకు ఉపయోగించే హెలికాఫ్టర్‌‌లు
కామోవ్ కా-50   USSR దాడులకు ఉపయోగించే హెలికాఫ్టర్‌ కా-50 15 [38] కా-52 కోసం ఉత్పత్తిని నిలిపివేశారు.[38]
కామోవ్ కా-52   రష్యా దాడులకు ఉపయోగించే హెలికాఫ్టర్‌లు కా-52 10 [39] ప్రత్యేక దళాలు - మరో 12 విమానాలను 2009లో కొనుగోలు చేయనున్నారు [40]
మిల్ మి-24   USSR దాడులకు ఉపయోగించే హెలికాఫ్టర్‌ మి-24 360 [41] 2015నాటికి వీటన్నింటినీ మి-28 యుద్ధ విమానాలతో మార్చనున్నారు[42]
మిల్ మి-28   రష్యా దాడులకు ఉఫయోగించే హెలికాఫ్టర్ మి-28 (?) [41] 2010నాటికి 47, 2015నాటికి 300
మొత్తం దాడులకు ఉపయోగించే హెలికాఫ్టర్‌లు 412
రవాణా హెలికాఫ్టర్‌లు
మిల్ మి-8   USSR రవాణా హెలికాఫ్టర్ మి-8 160
మిల్ మి-26   USSR రవాణా హెలికాఫ్టర్ మిల్ మి-26 30 [43]
కామోవ్ కా-60   రష్యా రవాణా హెలికాఫ్టర్ కా-60 7 [44] 200 హెలికాఫ్టర్‌లకు ఆర్డర్ ఇచ్చారు
మొత్తం రవాణా హెలికాఫ్టర్‌లు
మొత్తం అన్ని రకాల యుద్ధ విమానాల సంఖ్య

వీటిని కూడా చూడండిసవరించు

 • రష్యా సమాఖ్య యొక్క అవార్డులు మరియు అలంకారాలు
 • రష్యా సమాఖ్య యొక్క గౌరవ పట్టాలు
 • రష్యా ఏవియేటర్‌ల జాబితా

సూచనలుసవరించు

 1. ఆస్టిన్ & మురవ్యువ్, ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అఫ్ రష్యా ఇన్ ఏషియా, టారిస్, 2000, పే.235
 2. జెరోయిన్ బ్రిన్క్మన్, 'రష్యన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ టర్మొయిల్,' ఎయిర్ ఫోర్సెస్ మంత్లీ , No.105, డిసెంబర్ 1996, పే.2, సైటేడ్ ఇన్ ఆస్టిన్ & మురవ్యు, 2000
 3. జనరల్ హేక్కి నికునేన్, ది కర్రెంట్ స్టేట్ అఫ్ ది రష్యా ఎయిర్ ఫోర్స్, చివరగా మార్చబడినది 2005
 4. పియోటర్ బుటౌస్కి, 'రష్యాస్ న్యూ ఎయిర్ ఫోర్స్ ఎంటర్స్ ఏ టైట్ మనోయివరే,' జెన్స్ ఇంటిల్లిజెంస్ రివ్యు, మే 1999, పే.14
 5. పియోటర్ బుటౌస్కి, 'రష్యా రైసింగ్,' ఎయిర్ ఫోర్సెస్ మంత్లీ, జూలై 2007, పే.83
 6. వలేరి కోలోసోవ్, మిలిటరీ రిఫార్మ్: మైనస్ వన్ హండ్రెడ్ థౌసంద్, కొమ్మేర్సంట్, 11 అక్టోబర్ 2004, సైటేడ్ ఇన్ స్కాట్ & స్కాట్, రష్యన్ మిలిటరీ డైరెక్టరి 2004
 7. రూట్ లేడ్జ్/IISS, IISS మిలిటరీ బాలెన్స్ 2007, పే.200
 8. 8.0 8.1 రష్యా త్వరలో ఫిఫ్త్-జెనరేషన్ ఫైటర్ నమూనా ను తయారుచేస్తుంది, 8 ఆగష్టు 2007
 9. 9.0 9.1 RIA నోవోస్టి, రష్యా త్వరలో Su-34 స్ట్రైక్ ప్లేన్స్ కలిగిన రెండు ఎయిర్ రైన్మెంత్స్ ను అమర్చబోతుంది, 2 ఆగష్టు 2007
 10. http://warfare.ru/?catid=257&linkid=1615&linkname=SU-34/32FN-Fullback-Long-range-fighter-bomber
 11. BBC న్యూస్, రష్యా అంతర్గత ఘర్షణలను పునః ప్రారంభించినది , 17 ఆగష్టు 2007, పాట్రోల్స్
 12. రష్యా సోవియెట్-ఏరా స్ట్రాటజిక్ బామ్బెర్ పాట్రోల్స్ ను తిరిగి పొందబడినది - పుతిన్ -2 రష్యన్ న్యూస్ & ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ
 13. BBC న్యూస్, RAF రష్యన్ ప్లేన్లను అడ్డుకునెను, 30 ఏప్రిల్ 2008
 14. Warfare.ru, ఎయిర్ ఫోర్స్: స్ట్రక్చర్ accessed మే 2009 న పొందబడినది.
 15. http://www.combataircraft.net/issues/latestissue.php, ఆగష్టు 2009న పొందబడినది
 16. రష్యన్ మిలిటరీ ఎయిర్ క్రూ నమ్బెర్స్ సిబ్బంది తడబాటు
 17. Reuters.com, వన్-థర్డ్ రష్యన్ ఫైటర్ జెట్స్ ఓల్డ్ అండ్ అన్సేఫ్: నివేదిక శుక్రవారం, Feb 6, 2009 5:40am EST
 18. రష్యన్ మిలటరీ బలహీనతలు ప్రణాలికా బద్దమైన అణు శక్తీ ప్రాముఖ్యతను పెంచాయి
 19. రష్యా 21వ శతాబ్దానికి బొమ్బెర్-ALCM ఫోర్స్ ను సిద్దం చేసింది
 20. RIAN, సుఖోయి రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తో రికార్డు స్థాయిలో $2.5 బిలియన్ ఒప్పందం పై సంతకం చేసారు, ఆగష్టు 2009
 21. http://asbarez.com/70628/ex-soviet-states-to-set-up-joint-air-defense-networks/, 18 సెప్టెంబర్ 2009
 22. రెబెన్ F జాన్సన్, PAK-FA ఇంజిన్ ను అభివృధి చేయటానికి రష్యన్ ఒడంబడిక,జేన్స్ డిఫెన్స్ వీక్లీ, 19 ఏప్రిల్ 2010
 23. రష్యన్ ఫైటర్ జెట్లు రష్యా నుండి ఫార్ ఈస్ట్ వరకు మొట్టమొదటి నాన్ స్టాప్ ఫ్లైట్
 24. http://echo.msk.ru/programs/voensovet/702931-echo/
 25. 25.0 25.1 25.2 25.3 http://www.warfare.ru/?linkid=2180&catid=241&type=bombers
 26. 26.0 26.1 26.2 26.3 http://www.warfare.ru/?linkid=2180&catid=241&type=fighters
 27. http://www.defencetalk.com/sukhoi-assembles-first-production-su-35s-29430/
 28. "Russian air force completing MiG-31BM modernization program". Retrieved 2010-08-17. Text " Defense " ignored (help); Text " RIA Novosti " ignored (help); Cite web requires |website= (help)
 29. http://www.warfare.ru/?linkid=2180&catid=241&type=attack
 30. SU-34 ఫుల్ బాక్ లాంగ్ రేంజ్ ఫైటర్ బాంబర్, warfare.ru, రష్యన్ మిలిటరీ విశ్లేషణ. సెప్టెంబరు 9, 2008న పునరుద్ధరించబడింది.
 31. "ఎయిర్ క్రాఫ్ట్ ప్రొఫైల్:Su-25 ఫ్రొగ్ ఫుట్ ", ఎయిర్ ఫోర్సెస్ మంత్లి మగజైన్, జూలై 2009 జారి.
 32. న్యూస్ , ఎయిర్ ఫోర్సెస్ మంత్లి, ఆగష్టు 2008 జారి, పే. 30
 33. ఆంటొనోవ్ An-22, warfare.ru, రష్యన్ మిలిటరీ విశ్లేషణ. సెప్టెంబరు8, 2008న పునరుద్ధరించబడింది.
 34. http://en.rian.ru/mlitary_news/20100624/159560588.html
 35. ది రష్యన్ బేర్ గెట్స్ రెస్ట్లెస్స్ అగైన్ , ఎయిర్ ఫోర్సెస్ మంత్లి మగజైన్, ఆగష్టు 2009 ఇష్యు, పేజీలు. 60—64
 36. AWACS/AEW&C ఆపరేటర్స్ , ఎయిర్ ఫోర్సెస్ మంత్లి, ఆగష్టు 2008 ఇష్యు, పే. 91
 37. ఫ్లైయింగ్ హై , ది మాస్కో న్యూస్, ఏప్రిల్ 24, 2008. సెప్టెంబర్ 6 2008న గ్రహింపబడినది.
 38. 38.0 38.1 http://www.warfare.ru/?lang=&catid=260&linkid=1631&linkname=KA-50-Hocum/-Werewolf
 39. http://www.warfare.ru/?lang=&catid=260&linkid=1632&linkname=KA-52-Alligator
 40. http://en.rian.ru/russia/20081104/118120823.html
 41. 41.0 41.1 http://www.warfare.ru/?linkid=2180&catid=241&type=helicopters
 42. 2015 నాటికి రష్యన్స్ ఎయిర్ ఫోర్స్ కంబాట్ హెలికాప్టర్స్ కు మార్చబడును' , కొమ్మేర్సంట్, అక్టోబర్ 24, 2007. సెప్టెంబరు 9, 2008న పునరుద్ధరించబడింది.
 43. గై, మార్టిన్. ఏ హెవి వైట్ సెయింట్ , ఎయిర్ ఫోర్సెస్ మంత్లి మగజైన్, నవంబర్ 2008 ఇష్యు, పే. 68.
 44. కమోవ్ Ka-60, warfare.ru, రష్యన్ మిలిటరీ విశ్లేషణ. సెప్టెంబరు 29, 2008న పునరుద్ధరించబడింది.

మరింత చదవడానికిసవరించు

 • హిఘామ్, రాబిన్ (ఎడిటర్). రష్యన్ ఏవియేషన్ అండ్ ఎయిర్ పవర్ ఇన్ ది ట్వంటియత్ సెంచరీ . రౌట్లెడ్జ్, 2007 ISBN 0-7146-4784-5.
 • పాల్మెర్, స్కాట్ డబ్ల్యూ. డిక్టేటర్‌షిప్ ఆఫ్ ది ఎయిర్: ఏవియేషన్ కల్చర్ అండ్ ది ఫేట్ ఆఫ్ మోడరన్ రష్యా . న్యూయార్క్: కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 2006. ISBN 0-521-85957-3.

బాహ్య లింకులుసవరించు