రంగినీని సత్యనారాయణ రాజు

కలం పేరు రసరాజు (కలం పేరుతో సుప్రసిద్ధులు)
రసరాజు ఛాయాచిత్రపటం.
జననం
రంగినీని సత్యనారాయణ రాజు

(1943-10-04) 1943 అక్టోబరు 4 (వయసు 81)
జాతీయతభారతీయుడు
వృత్తిజూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
ఉద్యోగంఎలెక్ట్రి సిటీ ఆఫీస్
జీవిత భాగస్వామిసూర్యనారాయణమ్మ
పిల్లలుతిరుపతి వెంకట అనంత కాసిరాజు.,యశొధరవర్మ
తల్లిదండ్రులుతండ్రి రంగినీని కాశిరాజు,తల్లి :శ్రీమతి వెంకమ్మ

జనననం

మార్చు

రంగినీని సత్యనారాయణరాజు వీరి కలంపేరు రసరాజు.వీరు కలంపేరుతో సుప్రసిద్ధులు. వీరు 04-10-1943 తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడిలంక గ్రామంలో శ్రీ రంగినీని కాశిరాజు, శ్రీమతి వెంకమ్మ దంపతులకు జన్మించారు.వీరి జీవితభాగస్వామిని శ్రీమతి సూర్యనారాయణమ్మ.వీరి సంతానం తిరుపతి వేంకట అనంత కాశిరాజు, యశోధరవర్మ.వీరి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా భట్లమగుటూరు.వీరు చేసే వృత్తి కరెంట్ ఆఫీసులో జూనియర్ అకౌంట్స్ ఆఫీసరుగా పనిచేస్తూ సాహిత్యం పై ఉన్న మక్కువతో తండ్రి గారినుంచి సంక్రమించిన కవితా వ్యాసంగంతో సాహిత్యం పై ఎంతో కృషి చేసి ఎన్నో బిరుదములు, అవార్డులు పొందారు.

విద్యాభ్యాసం

మార్చు

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో జరిగింది.

కవితాఅక్షరాభ్యాసం

మార్చు

వీరి తండ్రి కాశిరాజు గారి వద్ద (వీరి తండ్రి కవి, హరికథకులు, భజన గురువుగా ప్రసిద్ధులు)

ముద్రిత గ్రంధాలు

మార్చు

1.రసభారతి (పద్యకవితా సంపుటి)2.వేదిక (పద్యకవితా సంపుటి)3.రసకలశం (ముచ్చటగా మూడు శతకాలు)4.కొమ్మా-రెమ్మా (ఆంధ్రజ్యోతి కాలమ్)

రసభారతి

మార్చు

రసభారతి పద్యకవితా సంపుటి 1991 పై ప్రముఖుల అభి ప్రాయాలు : 1 *”కళాప్రపూర్ణ “ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి.: “అక్షరానందము “06-03-1991. శ్రీ రసరాజుగారు తరచూ నాయోగ క్షేమములు కనుగొను చుండు ఆత్మీయులు.నాడు,నేడు అవిచ్చిన్నముగా సాగుచున్న ఛందో మార్గమును నిస్సంకోచముగా అనుసరించు చున్న కవి వీరు.సంప్రదాయ రీతిలో సాగిన వివిధ విషయస్పష్టమైన శీర్షికలతో “రసభారతి”కి హారతి పట్టిన కవి. వర్ణచిత్రాలు,రసరేఖలు,వెలుగుపూలు,విద్యుత్ జ్యోతి మున్నగు శీర్షికలు పుట పుటకు చైతన్య స్ఫూర్తి కలిగించుచున్నవి .రాయలు, విశ్వనాధ. జాషువా నారాయణ రెడ్డి ,మున్నగు నాటి,నేటి కవులు ఇందు స్తుతింప బడిరి. సులభసుందరమైన వీరి పలుకుబడికి నిరాటంకమైన ఛందో రీతికి “బ్రౌనుదొర”ప్రస్తుతి నుండి ఒక ఉత్పలము. “బ్రౌనుదోరా ! మహాత్మ ! రసబంధుర మాంధ్ర కవిత్వము సుందరో దయాన వనంబులో నొదిగి –హాయిగ-కావ్యసుమమాలలోన పూ దేనెను గుండెలంటగను తృప్తిగ త్రావిన మేటి తేటి వీ వై నవరాగామాలికల నల్లితివయ్య రాసోచితంబుగన్” మనోజ్ఞమైన వీరిశైలికి ఎన్నో ఉదాహరణములు చూపవచ్చును, వీరి పద్యపఠనరీతియు రసరాగ రంజితము . ఇటీవల వెండితెరవైపు పరువిడుచున్న వీరి కలము ఫలోన్ముఖమగుగాక !. 2 *జ్ఞానపీఠ అవార్డు గ్రహీత- పద్మశ్రీ డా ! సి.నారాయణ రెడ్డి (వైస్ చాన్సలర్ :తెలుగు విశ్వవిద్యాలయం ) - అభినందన –10-03-1991. “మా ప్రభుత్వమున దైవత్వమ్మే దీపించేడిన్ “ అని అంటాడు రసరాజు.ఇక్కడ దైవత్వమంటే దేవుళ్ళు కొలువున్న వ్యవస్థ అని కాదు.కసి, మసి అంటని శిశుత్వం .పండు వెన్నెల్లా పరిశుద్ధంగా నవ్వగలిగే బాల్యం . బాల్యం స్వచ్ఛ భావాలకు సంకేతం.బాలల రాజ్యం అంటే క్షుద్ర మనస్సులు విధించిన అరపోరాలు లేని రాజ్యమన్నమాట .ఈ శీర్షికలో రసరాజు రచించిన పద్యాలు ఒక ఆదర్శ ప్రభుత్వానికి ప్రతీకలు.అంతేకాదు ఈ పద్యాల్లో కనిపించే బాలరాజు రసరాజే . హృద్య భావుకత, పద్యచాలన చతురత మేలవిన్చుకున్న కవితా మూర్తి రసరాజు.అతనిది నడిచే పద్యంకాడు.పాఠకున్ని తనవెంట పరుగులు తీయించే విద్యుద్గమనం .మరోసారి జాషువా రూపంలో మంద హాసం చేస్తున్నాడా అనిపించేటంత మధుర గభీర రచన అది. పండగల గురించి రాసినా, ప్రముఖుల గురించి అభినందనలు రాశివోసినా సమకాలీన వస్తువు గురించి రాసినా సంస్మరణాత్మక రచన సాగించినా పద్యంలో ఏ భావాన్నైనా పదునుగా ప్రకటించ గలిగే ప్రావీణ్యం రసరాజుకు అలవడింది.ఈ “రసభారతి”లో ఏ పద్యాన్ని పట్టి చూసినా ఆర్ద్రత అగుపిస్తుంది ఆత్మీయత పలకరిస్తుంది. ఇంతటి భావశీలి పద్య రచనా శిల్పమౌళి ఖండికలతోనే సరిపెట్టు కోకుండా ఒక సమగ్ర పద్యకావ్యం రాయాలని నా ఆకాంక్ష .ఛందస్సులో –అందులో పద్య ఛందస్సులో కావ్య నిర్వహణ శక్తి ఉన్నవాళ్ళు కరువైపోతున్నారు.రసరాజు అందుకు సమర్ధుడనీ ఈ రసభారతి సాక్ష్యం చెబుతున్నది.అప్పుడప్పుడు రాసిన చక్కని కవితా ఖండికలను ఈ గ్రంధరూపంలో అందిస్తున్న రసరాజుకు నా హార్ధికాభినందన. 3*ఇంకా మరికొందరి అభిప్రాయాలు ”కలావాసస్పతి” కొంగర జగ్గయ్య, బి.ఏ, లిట్ –మద్రాసు 4* మల్లెమాల సుందరామిరెడ్డి- (ఎం.ఎస్.రెడ్డి ) చైర్మన్ ఎ.పి.ఫిల్మ్ డెవలపప్ మెంట్ కార్పోరేషన్ –హైదరాబాదు .06-03-1991

విషయ సూచిక

5*“రసభారతి”లో రస రేఖలు

1.అంజలి, 2. శ్రీకృష్ణదేవరాయలు, 3. బ్రౌనుదొర 4.జీవన గీత 5.ఉగాది6 సాహితీ విశ్వ నాధుడు, 7. భగ్నజీవి 8. స్వేచ్ఛా ప్రభాతం9. అద్వైతం10. దీపలక్ష్మి. 11అల్లూరి సీతారామరాజు 12 . అభిశంసనం 13 . సంక్రాంతి 14. జాషువా 15 వక్రించిన వర్తమానం 16. స్వతంత్ర కేతనం17 మహాత్ముడు, 18 . సిద్ధార్ధి 19 . నివేదన 20.దీపోత్సవం 21. అమరజీవి 22. తెజోభారతం 23 .నారాయణ రెడ్డి 24 .అభ్యర్ధనం 25. బాలల రాజ్యం .26 .కాంతి పర్వం.27. మీర్జా గాలిబ్. 28. ఆవేదన. 29. ఆత్మీయము.30. స్వాగత గీతి. 31. గోస్తనీ జలప్రళయం .32 .దీప్త చైతన్యం .33. వెలుగుపూలు.34. స్వరాజ్యం, .35 .భారతరత్నం.36. లాల్ బహదూర్.37. నవవసంతం .38. చైత్ర కల్యాణం.39 .నేటి దీపావళి .40 .గ్రీష్మపతి .41. నవభారతం,.42 .ఇందిరా నిర్యాణం .43. ప్రతీక్షణం .44 .మద్యంలో మానవుడు .45. నరుడు-నరకుడు.46. నీరాజనం .47. విద్యుత్ జ్యోతి .48. భారతీయుడు .49 .జిల్లేడుపువ్వు .50 .అభయాశీర్వాదం .51 .వర్ణచిత్రాలు .52. ప్రళ యచిత్రం .53. ఓ ప్రభూ!.54. సమతాగావాక్షం.55. ఆహ్వానం.56. గాంధీ భారతం.57 .కళావాచస్పతి. 58. పౌష్యలక్ష్మి.59. రసరేఖలు.60. శుక్ల వత్సరాది.61. ఎక్కడున్నవి వెలుగులు, .62. రసానుభూతి,.63. నవ్యజీవన సంక్రాంతి .64. బుద్ధపూర్ణిమ.65. ప్రమోద .66. మహనీయుడు .67. కృతజ్ఞత .

వేదిక పద్యకవితా సంపుటి

మార్చు

• “వేదిక “ పద్యకవితా సంపుటి -2003లో నన్నయ భట్టారక పీఠం తణుకు తంగిరాల వెంకట కృష్ణ సొమయాజులు కావ్య పురస్కారం ),2004లో మహాకవి గడియారం వేంకట శేష శాస్త్రి స్మారక సాహిత్య అవార్డు రచన సాహిత్య వేదిక-కడప ),2005లో వడ్డీ సుజాత-శ్యామసుందర రావు కావ్య పురస్కారం, శ్రీ రామరాజభూషణ సాహిత్య పరిషత్ –భీమవరం ) సంవత్సరాలలో వరుసగా అవార్డులు పొందిన పద్యకవితా సంపుటి దీనిలో

విషయ సూచిక

1. స్వామి 2. నవలోకం, 3. పూలసంక్రాంతి 4.నన్నయ, 5. పదవి, 6.తెలుగుతల్లి, 7. యువ 8. సత్యసాయి, 9. సోనీ 10 అసూయ 11 కవిపుష్కరిణి 12. కా”రణశీలి”కందుకూరి 13 నేటి చరిత్ర 14. అక్షరమాల 15. రంగవల్లి, 16. రసప్రియ 17. శిశిర శిల్పం 18. దీపం 19. ఉదయగీతి 20. బహుధాన్య 21. వేదిక 22. ఆమె 23. వర్తమానం 24. కవి, 25.అతడు 26. గుజరాతుగాయం 27.ఆంధ్ర బాలగంధర్వుడు 28. విశ్వనరుడు 29.ముఖలింగం 30. ఓటు 31. త్రివేణి 32. పొరపాటు. 33. యుగాపురుషం 34. హెచ్చరిక 35. కవితా కార్తీకం 36. సంగీత భాష 37. రవసంతం 38. స్వేచ్చ 39. విడిపూలు 40. దేవదాసు 41. ఉగ్గుగిన్నే 42. హిప్పోక్రటేసు 43. అవ్వ 44 వాసవి 45. బాపు 46. పాటకు పతాకనెత్తిన భాగవతుడు .

కొమ్మ-రెమ్మ అంధ్రజ్యోతి కాలమ్స్

మార్చు

• కొమ్మ –రెమ్మ ఆంధ్రజ్యోతి లో అప్పుడప్పుడు అనేకానేక విషయాలపై వ్రాసిన చిన్న చిన్న వ్యాసాల (కాలమ్స్ )సంకలనమే ఈ “కొమ్మ-రెమ్మ” ఒకనిర్ధిష్టమైన శీర్షిక క్రింద ఇవేవీ అప్పుడు ప్రకటింప బడలేదు .ఇప్పుడీ పుస్తకానికి మాత్రము అవన్నీ కొమ్మలూ, రెమ్మలూ అయ్యాయి.-శ్రీ రమణ గారి అభిప్రాయం ఎడిటర్-నవ్య వీక్లీ హైదరాబాదు :-ఇందులో ఎనిమిదేళ్ళ వ్యవధిలో రాసిన దాదాపు పాతిక రసగుళికలున్నాయి.కొన్ని శీర్షికలు మొదట మామూలుగా ఉండి, పోనుపోనూ నెమలి పించం విప్పిన అనుభూతిని కలిగిస్తాయి.మనుషుల బలహీనతలు, మారుతున్న విలువలు అనుకోకుండా జరిగే తమాషాలు, సాహిత్యసభలు, సన్మానాలు.....ఇలా ఎన్నో అంశాలు మనల్ని నవ్విస్తూ కదులుతాయి ఇందులో పేజీలు.శీర్షిక నడపాలంటే విస్తృతమైన ఆలోచనా పరిధి, దానికి తగిన ముడిసరుకు ముఖ్యం .కొన్ని చక్కటి ఆద్యంతాలతో పదునైన ముగింపుతో పదహారణాల గల్పికలు కనిపిస్తాయి ఈ సంపుటిలో .కాలంలో అన్నీ వొదుగుతాయి .ఎటొచ్చీ పొదిగేవారికి పనితనం ఉండాలి.”నాడీ నాడీ నడుమ బేహారి” చదివితే పెద్దగా చదువూ సంధ్యాలేని సాధారణ బేహారులు ఎంత లౌకికజ్ఞానం కలిగిఉంటారో అర్ధం అవుతుంది.మితిమించితే ఏదైనా అనర్ధమేనని మెసేజిని నవ్వుతూ నవ్వుతూ అంటిస్తుంది ‘సంప్రదాయం’ఖండిక,”అనగనగా ఒక రాజు “లాంటి శీర్షికలో మంచి విందు భోజనం వడ్డించి అమూల్యమైన సందేశంతో చుక్కపె ట్టారు రసరాజు గారు హాస్యంగా రాసినంతమాత్రాన విషయం తేలిపోవాలని ఎక్కడా లేదు.సరదా,సత్తా ఉన్నవారు తమ శక్తి కొద్దీ సాముగరిడీలు చేయడానికి విస్తృతమైన పరిధి గల ప్రక్రియ .ఈ అక్షర విన్యాసంలో రసరాజు పూర్తిగా సఫలమైనారని చివరంటా చదివాక నాలాగే మీకూ అనిపిస్తుంది– ==విషయసూచిక== • 1 .ఒకటోనెంబరు 2 .అమ్మకంలో ఆధునికత 3 బాబోయ్ బఫెడిన్నర్ ,4.సమయానుకూల ఛత్రదారులు 5 పని • కిరాకి మంచితనం 6.ఎందరమహానుభావులు 7 కళాహృదయులు 8 సివిక్ సెన్స్ 9 నామాలకధ 10 నాడీనాడీ నడుమ బేహారి.11 సేసకరణ చక్రవర్తి 12 అభిరుచులే అశ్వాలైతే 13 సన్మానభంగమ్ 14 మార్కెట్ మనస్తత్వం 15 తమా'షా'రాయుళ్ళు 16 దొరల్లో దొంగలు 17 సంప్రదాయం 18 "లావు" కథలు 19 ముళ్ళవాతపడ్డ గులాబీలు 20 కదలడు-వదలడు 21 ఎక్కడికిపోతున్నాం? 22 జంటపేర్లు 23 అనగనగా ఒకరాజు 24 దేవుడా! నీవేదిక్కు 25 అదే ఇది 26 శ్రేయోభిలాషులు 27 అమెరికా బస్సు 28 ఎందరో మహాను 'బాబు'లు 29 ఇదేఈనాటి పాట.

రసరాజు నానీలు

మార్చు

రసరాజు గారి నానీలు పై డా.సి.నారాయణరెడ్డి గారి స్పందన- స్వీకృతి పద్యాన్ని కైవసం చేసుకుని పరమ హృద్య రచనలు చేసిన ఆత్మీయుడు రసరాజు -ఇప్పుడు "నానీల"బాణీలు ఆలపిస్తున్నాడు.మూడు పాదాలతో నడిచే 'హైకూ' ను చతుష్పదిగా మార్చాడు ఆచార్య గోపీ.ఆ ఒరవడిలో వెలువడిన మరో కవితాసంపుటి ఇది. ఆర్ద్రభావుకత,అభివ్యక్తి నిపుణత ,రసరాజుకు "పెన్ను"తో పెట్టిన విద్యలు. దేనికదే ఒక మచ్చుతునక.తాను దూసుకొచ్చిన "నానీ"లను నా దోసిట పోసి అందుకోమన్నాడు రసరాజు. ఇదే ఆత్మస్పందక స్వీకృతి.-సి.నారాయణరెడ్డి.

అంకితం

మార్చు
  • ఈ కవితాసంపుటిని డా.సి.నారాయణరెడ్డి గారికి అంకితం .

జ్ఞానపీఠం - పసివాడితో కూడా కరచాలనం చేస్తుంది "నానీ" ! అంటూ .....

  • ప్రొఫేసర్ -ఎన్.గోపి- పోట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సులర్, హైదరాబాద్

నానీల చిన్నాన్న రసరాజు . రసరాజు లాంటి సీనియర్ కవులచేత కూడా నానీలు రాయించిందంటే ఈ కవితా రూపం ఒక నికషోపల రమ్యంగా స్థిర పడినట్టే.

  • పిచ్చుకపై

బ్రహ్మాస్త్రం వేస్తావా ! అదే దాన్ని ముక్కున కరుచుకు పొతే !....

  • రసరాజు రాసిన ఈ నానీ సరిగ్గా నానీల ప్రక్రియకూ వర్తిస్తుంది నిర్మాణపరంగా నానీ మినీకవిత కాదు.మినీకవితకు కోసమెరుపుండాలి.తలుక్కున మెరిసిపోయే కవిత కాదు నానీ.స్థిరకాంతిని వెదజల్లుతూ మెల్లగా మనసునిండా వ్యాపించే గుణం నానీలకుంది.20 నుంచి 25 అక్షరల విస్థీర్ణంలోనే నానీ తన భావవ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుంది.నిర్ధిష్టమైన పాదనియతి లేకున్నా, ఉన్న జాగాలోనే ఒక నిర్మాణ నియతి ఏర్పరచుకుంది.తొలి రెండు పాదాలకు, మలి రెండు పదాలు సమర్ధకంగా రూపొందాయి.రెండు రెండు పాదాల్లో ఒక్కో భావాంశం ఉంటుంది.రెండొ బావాంశం చదివినప్పుడే నానీల్లోని ఒక భావం సంపూర్ణమౌతుంది.అన్ని నానీలు ఇలగే ఉంటాయని కాదు.ఎక్కువ భాగం ఇలా ఉంటాయి. కొన్ని నానీల్లో మొదటి దానికి రెండోది కొనసాగింపుగా కూడావుండొచ్చు.అయితే రసరాజు నానీల్లో ఇలాంటివి దాదాపు లేవు.

గోపీ నానీల తర్వాత వచ్చిన నానీలన్నీ గోపీకి అనుకరణలు కావు .నానీ రూప ప్రక్రియ ఆయా కవులకు అప్రయత్నంగా నచ్చి, హత్తుకొని వారిచేతనానీలు వ్రాయించింది.రూపపరంగా నానీలు సాధించిన విజయంగా నేను దీనిని భావిస్తున్నాను.ఎన్.గోపి.

పాఠ్యగ్రంధాలు

మార్చు

"రసభారతి" పద్యకవితా సంపుటి (బెంగుళూరు /గుల్బర్గా విశ్వవిద్యాలయాలు) ఎం.ఫిల్ శ్రీ ఎం.రమేష్ (అంశం :రసరాజు రచనలు - ఒక పరిశీలన) (పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం -2004)

బిరుదములు

మార్చు

1.మధురకవి (భారతీ సమితి-గుడివాడ)1975,2.సాహితీ కళాభిజ్ఞ (ఫైన్ ఆర్త్స్ అకాడమి - ఏలూరు )2002

సినిమా పాటలు

మార్చు

అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ, రౌడీగారి పెళ్ళాం, దొంగా-పోలీస్, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్, కుంతీపుత్రుడు మొదలగు చిత్రాలు.

కధలు,కాలమ్స్

మార్చు

150 వరకు (వివిధ పత్రికలో అన్ని స్థాయిల్లో బహుమతులు) ఆంధ్రజ్యోతి దినపత్రిక (1987-1995) వనితాజ్యోతి మాసపత్రికలో "శతకంలో వనిత"శీర్షిక (1992-2000)

తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు

మార్చు
  • సృజనాత్మక సాహిత్యంలో చేసిన కృషికి కీర్తిపురస్కారం -2003
  • "వేదిక" పద్యకవితా సంపుటికి ఉత్తమ పద్యకావ్య పురస్కారం -2005
  • పద్యకవితాప్రక్రియలో "పద్మభూషణ్ "డా.బోయి భీమన్న పురస్కారం (లక్ష రూపాయలు)2014

అమెరికాలో పురస్కారాలు

మార్చు
  • ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS)నుండి ప్రతిష్టాత్మక జీవనసాఫల్య పురస్కారం (న్యూజెర్సీ/ఎడిసన్ -2011)"తెలుగుతోరణం "సంగీత నృత్యరూపక రచన.
  • ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS)నుండి సత్కారం (డల్లాస్ -2013)"క్షేత్ర దర్శిని"సంగీత నృత్యరూపక రచన.
  • ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA)సన్మానం (అట్లాంటా-2014)
  • తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(TANTEX)సన్మానం (డల్లాస్ -2014)
  • తెలుగు సాంస్కౄతిక సమితి సత్కారం (హ్యుష్తన్-2014)

ప్రభుత్వ పురస్కారం

మార్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది విశిష్టసాహితీ పురస్కారం -2007

ఫిల్మ్ అవార్డ్

మార్చు

"అసెంబ్లీ రౌడీ"సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన "అందమైన వెన్నెలలోన..."పాటకు ఉత్తమ సినీగీత రచయితగా మదరాసు కళాసాగర్ ఫిల్ం అవార్డ్-1992.

ఇతర పురస్కారాలు

మార్చు
  • "గుడిసెలో మానానికి గుడ్డకరువు-షోకేసులో బొమ్మకు గుడ్డ బరువు" అనే బహుళ ప్రాచుర్యం పొందిన మినీకవితకు రాష్ట్రస్థాయి అవార్డ్ (1978)
  • ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అవార్డ్-1996 (తంగిరాల సాహిత్యపీఠమ్-బెంగుళూరు)
  • "రసభారతి"పద్యకవితా సంపుటికి కల్లూరు అహోబలరావు అవార్డ్-1998 (స్వర్ణభారతి సాహిత్యవేదిక-హిందూపూర్)
  • మహాకవి మధునాపంతుల స్మారక పద్యకవితా పురస్కారం -2001 (సాధన సాహితీ స్రవంతి-హైదరాబాదు)
  • స్పిరిట్ ఆఫ్ ఎక్స్లెలెన్స్ అవార్ద్ 2001 (అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్త్స్-తిరుపతి)
  • "వేదిక"పద్యకవితాసంపుటికి తంగిరాల వేంకటకృష్ణసోమయాజులు కావ్య పురస్కారం -2003 (నన్నయ భట్టారక పీఠమ్-తణుకు)
  • "వేదిక "పద్యకవితా సంపుటికి మహాకవి గడియారం వేంకటశేషసశాస్త్రి స్మారక సాహిత్య అవార్డ్-2004 (రచన సాహిత్యవేదిక-కడప)
  • "వేదిక"పద్యకవితాసంపుటికి "వడ్డి సుజాత-శ్యామసుందరరావు-కావ్య పురస్కారమ్-2005 (శ్రీరామరాజభూషణ సాహిత్య పరిషత్ -భీమవరం)
  • దేవరకొండ బాలగంగాధర తిలక్ అవార్డ్ -2005 (నన్నయ భట్టారక పీఠమ్-తణుకు)
  • డా.సి.నారాయణరెడ్డి సాహితీ పురస్కారం -2005 (నారాయణరెడ్డి కళాపీఠం -హైదరాబాద్)
  • గజల్ సౌజన్య పురస్కారం -2006 (గజల్ చారిటబుల్ ట్రష్త్-హైదరాబాద్)
  • ఉగాది ప్రతిభా పురస్కరం -2009 (బి.వి.ఆర్.కళాకేంద్రం-తాడెపల్లిగూడెం )
  • డా.నాగభైరవ పురస్కారం -నెల్లూరు 2011
  • డా.జాలాది ఆత్మీయపురస్కారం -2012 (జాలాది చారిటబుల్ ట్రష్త్ -విశాఖపట్నం )
  • సనాతనధర్మ పురస్కారం -2014 (సేవ్ టెంపుల్స్ / (గ్లోబల్ హిందూ హెరిటెజ్ ఫౌండెషన్)
  • డా.రామడుగు వేంకటేశ్వరశర్మ సాహితీ పురస్కారం -2015 (గుంటూరు)
  • నంది నాటకోత్సవాల జ్యూరీమెంబర్ -2013 (తుదిపోటీల న్యాయనిర్ణేత/పద్యనాటకం )
  • ధ్వన్యాలోక-ప్రతిష్ఠాత్మక సృజనాత్మక సాహిత్య కేంద్రం -మైసూరు "ధ్వన్యాలోక"లో రెసిడెంట్ ఫెలోగా కొంతకాలం రచనావ్యాసంగం -1985

చిత్రమాలిక

మార్చు

పదవీ విరమణ

మార్చు

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ -ఎలక్ట్రిసిటి రెవెన్యూ ఆఫీస్-తణుకు 2002.

చిరునామా

మార్చు

రసరాజు యల్.ఐ.జి.177, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తణుకు-534 211, ఫొన్.08819-224252/9440388659. వాడుకరి: వడ్డూరి రామకృష్ణ-9440953315

మూలాలు,లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రసరాజు&oldid=3277237" నుండి వెలికితీశారు