రాచకొండ
రాచకొండ, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని గ్రామం.[1]
రాచకొండ | |
— రెవిన్యూ గ్రామం — | |
రాచకొండ కోట దక్షిణ ముఖద్వారం | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | యాదాద్రి - భువనగిరి |
మండలం | నారాయణపూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,300 |
- పురుషుల సంఖ్య | 682 |
- స్త్రీల సంఖ్య | 618 |
- గృహాల సంఖ్య | 344 |
పిన్ కోడ్ | 508253 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది మండల కేంద్రమైన నారాయణపూర్ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి 65 కి. మీ. దూరంలోనూ ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంక వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 344 ఇళ్లతో, 1300 జనాభాతో 5611 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 682, ఆడవారి సంఖ్య 618. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 70 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1182. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577133[3].పిన్ కోడ్: 508253.
గ్రామ చరిత్ర
మార్చురాచకొండ పర్యాటక ప్రాముఖ్యత గల ప్రదేశం. పట్టాభిగుట్ట దగ్గర ఒక గుహలోకల 'దశావతార' శిల్పాలు, పట్టణంలోని ఐదు దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు. రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా సా.శ.1325 నుండి 1474 వరకు మొత్తము తెలంగాణను పరిపాలించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఇలాంటి గుహలు 17 ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాచకొండ గుట్టల్లో రెండు రాతి గుహలు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర పూర్వయుగానికి చెందిన.. అంటే రాత కనిపెట్టక ముందు కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆదిమానవులు నివసించేవారనడానికి నిదర్శనంగా వారు వేసిన చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. అంటే తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైనదని మరోసారి రుజువైందన్నమాట. ఇలాంటి గుహలు ఈ రాచకొండ గుట్టల్లో మరెన్నో ఉండొచ్చు.
మొదటి గుహలో..
మార్చుగుర్రాల గుట్ట మీద చాళుక్య యుగం నాటి వైష్ణవాలయం ఉంది. దీనికి సమీపంలోనే పెద్ద రాతి గుండ్ల మధ్య సహజసిద్ధమైన గుహ ఉంది. త్రిభుజాకార ముఖద్వారం ఉన్న ఈ గుహ సుమారు రెండు వందలమంది కూర్చునేంత వైశాల్యంతో ఉంటుంది. గుహలో తూర్పు పడమరలకు సహజ ద్వారాలుండగా ఉత్తర.. పడమర గోడలు ఏటవాలుగా ఉన్నాయి. ఒక పెద్ద గుండుపై మరో బండరాయి పడడంతో ఈ గుహ ఏర్పడింది. ఉత్తరం వైపు చూస్తున్న ఏటవాలు రాతి గోడ ఉపరితలం మీద చిత్రలేఖనాలున్నాయి. తూర్పు నుంచి పడమర వైపు కొనసాగుతున్న ఈ గోడకు మొదట మనుషుల బొమ్మలు కనిపిస్తాయి. తరువాత దీర్ఘ చతురస్రాకారంలో పటం డిజైన్) బొమ్మ ఉంది.
సుమారు గజం పొడవు, అరగజం వెడల్పు పరిమాణాలతో ఉన్న ఈ పటం బొమ్మే ఇక్కడి చిత్రలేఖనాల్లో అతిపెద్ద చిత్రం. పటం బొమ్మకు పడమటి దిక్కున కొందరు మనుషుల బొమ్మలున్నాయి. వాటి తరువాత వరుసగా సుమారు ఆరేడు గజాల పొడవున ఎర్ర గీతలు గీసి ఉన్నాయి. సుమారు ఫీటు పొడవు, రెండు అంగుళాల వెడల్పుతో ఉన్న గీతల మధ్య దూరం అర ఫీటుంటుంది. నిజానికి ఈ గీతలు భక్తుల ప్రతిరూపాలు. పటం దైవానికి ప్రతీక. ఎదురుగా ఉన్న రాయిపై పద్మనాయకుల కాలాన చెక్కిన గణపతి శిల్పం ఉంది. గుర్రాల గుట్ట ప్రవేశ ద్వారానికి కుడివైపున కన్పించే పెద్ద గుండ్ల కింద మరో గుహ ఉంది. ఇక్కడేమో పెట్రోగ్లిప్స్ (petroglyphs), కప్యూల్స్ (cupules) ఉన్నాయి. రాయిపైన లోహ పరికరంతో చెక్కే చిత్రాలను ఇంగ్లీషులో పెట్రోగ్లిప్స్ అంటారు. రెండు సెం.మీ. ల లోతు, వృత్తాకారంలో ఉండే చిన్న చిన్న బద్దిలను కప్యూల్స్ అంటారు. ఇక్కడి పెట్రోగ్లిప్స్‌లో చాలా విశేషాలు చిత్రించి ఉన్నాయి. మొదటి చిత్రంలో ముగ్గురు మనుషులు, వారి కింద వరుసలో మరో ముగ్గురు కర్రలు, ఈటల సహాయంతో తమకు ఎదురుగా వస్తున్న పులిని ఎదుర్కొంటున్నట్లు చిత్రించి ఉంది.
ఈ ఆరుగురి మీద లింగం లేదా గుడిని పోలిన రేఖా చిత్రముంది. వీరి మధ్య పిరమిడ్ లేదా త్రిభుజాకారంలో ఆరు కప్యూల్స్ ఉన్నాయి. మనుషుల నుంచి ప్రారంభమై వరుసగా పులి కింది నుంచి వెనుకవైపునకు కప్యూల్స్ సుమారు 20 చిత్రించి ఉన్నాయి. ఈ కప్యూల్స్‌కు, పులికి మధ్య ఒక అడ్డు గీత నుంచి కిందికి నాలుగైదు గీతలు వేలాడుతున్నట్లుగా చిత్రమొకటి ఉంది. పై రేఖా చిత్రాలన్నింటి పొడవు సుమారు 6 అంగుళాలుండగా, వెడల్పు సుమారు రెండు అంగుళాలుంటుంది.
తెలంగాణలో వీటిని చెక్కిన మానవులు సుమారు క్రీ.పూ. 3 వేల సంవత్సరాల నుంచి క్రీ. పూ. ఒక వేయి సంవత్సరాల మధ్య కాలంలో జీవించి ఉండొచ్చు. పై చిత్రాలను బట్టి కొత్త రాతియుగం నాటికి తెలంగాణ ప్రజలు లోహ ఆయుధాలను వాడుతున్నారని వేట వారి ప్రధాన జీవనాధారం అని, దైవాన్ని పూజిస్తున్నారని, వారికి ఒక క్రమ సమాజం ఏర్పడిందని చెప్పవచ్చు.
గుర్రాల గుట్ట మీద..
మార్చుకాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వర్ధిల్లిన రాచకొండ చరిత్రకు సాక్ష్యంగా కొన్ని కట్టడాలు ఇక్కడ దర్శనమిస్తాయి. కానీ అంతకుముందు కూడా ఇక్కడ మరో చరిత్ర ఉందని చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన రెండు గుహల్లో ఇదే విషయం బోధపడుతుంది. మానవ నాగరికత, పరిణామ క్రమం, సంస్కృతికి మూలాలు ఈ రాతి గోడల మీద దర్శనమిస్తున్నాయి. మనది దక్కన్ సంస్కృతి అనడానికి దక్కన్ పీఠభూమి మీద ఉన్న కర్ణాటకలో, మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి చిత్రలేఖనాలున్నాయి. సంస్కృతి అంటే ఏంటి? చిత్రం, శిల్పం, నాట్యం, సంగీతం, సాహిత్యం.. ఇవే కదా.
ఇందులో మనిషి మొదటగా నేర్చుకుంది చిత్రలేఖనమే. ఆ చిత్రాలే మానవ జీవనవిధానాన్ని ప్రతిబింబింపజేస్తాయి. రాచకొండ రాతి గుహల్లో అలాంటి చిత్రాలే ఉన్నాయి. రాచకొండ దుర్గం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే ఎడమవైపు గుర్రాల గుట్ట, కుడివైపు కచేరీ గుట్ట ఉంటాయి. ప్రాచీన చిత్రాలు వెలుగులోకి వచ్చిన రాతి గుహలు గుర్రాల గుట్ట మీద ఉన్నాయి. ఇంతకీ ఆ గుహల్లో ఏముంది? ఆ చిత్రాలు ఏం చెబుతున్నాయి? ఎప్పటివై ఉండొచ్చు?
రాతి చిత్ర శాస్త్రం ప్రకారం.. మొదటి గుహలోని చిత్రలేఖనాల్లో క్రూర జంతువులు, వేటాడిన జంతువులు, ఆయుధాలు లేకుండా పటం, మనుషులు మాత్రమే చిత్రించి ఉన్నాయి కాబట్టి ఇవి మధ్య రాతియుగానికి ముందువి అయి ఉండొచ్చు. తరువాత వచ్చిన కొత్త రాతి యుగానికి చెందినవి కూడా అయి ఉండొచ్చు. సున్నపు రాళ్లు, ఎరుపు రాళ్లు, ఆకు పసర్లలాంటివి వాడి ఈ చిత్రాలను గీసి ఉండొచ్చు. అందువల్లే ఇన్ని శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉన్నాయి. సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) వారు సీ14 టెస్ట్ ద్వారా, థెర్మోల్యుమిన్‌సెన్స్ డేటింగ్ ద్వారా కచ్చితంగా వీటిని ఎప్పుడు గీశారో తెలుసుకోవచ్చు.
రెండో గుహలోని చిత్రాలు మధ్యరాతి యుగానికి.. అంటే క్రీ.పూ. 10వేల సంవత్సరాల నుంచి క్రీ.పూ. 3 వేల సంవత్సరాల మధ్య యుగకాలంలో గీసి ఉండొచ్చు. ఈ కాలంలోనే తెలంగాణలో ఇలాంటి చిత్రలేఖనాలు రాతి గుహవాసాల్లో చిత్రించడం ప్రారంభమైందని ప్రొఫెసర్ ఎన్. చంద్రమౌళి రాసిన ప్రామాణిక గ్రంథం చెబుతోంది. ఈ రెండు గుహల్లోని చిత్రలేఖనంపై ప్రామాణిక పరిశోధన చేస్తే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశముంది.
ప్రముఖ అర్కియాలజిస్ట్ వీవీ కృష్ణశాస్త్రి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి గుహలు 28 ఉన్నట్లు రాశారు. అందులో 15 తెలంగాణలో, 13 ఆంధ్రా, రాయలసీమలో ఉన్నట్లు వివరించారు. వీటిలో తెలంగాణలో ఉన్నవాటి గురించి ప్రస్తావించారు కానీ వివరించలేదు.
రాచకొండ మీద పుస్తకం రాసేందుకు పరిశోధన చేస్తున్నాru. ఇందులో భాగంగానే వీటిని గుర్తించాru. రాష్ట్ర పురావస్తు శాఖ ఈ రెండు గుహల చుట్టూ కంచె వేయించి ఈ అరుదైన చిత్రలేఖనాలను పరిరక్షించాలి. ఇప్పటికే చిత్రలేఖనాల గుహ సమీపంలో రెండు చోట్ల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి.బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాలలు నారాయణపూర్లో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల నారాయణపూర్లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చౌటుప్పల్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, పాలీటెక్నిక్ నల్గొండలోను, మేనేజిమెంటు కళాశాల తూప్రాన్ పేట్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చౌటుప్పల్లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు నల్గొండలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుతాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుగ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుపోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చురాచకొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 3602 హెక్టార్లు
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 155 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 89 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 210 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 72 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 71 హెక్టార్లు
- బంజరు భూమి: 5 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1402 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1181 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 297 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చురాచకొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 297 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చురాచకొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2022-01-06 suggested (help) - ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".