రాచరికం (2025 సినిమా)
రాచరికం 2025లో విడుదలైన తెలుగు సినిమా. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మించిన ఈ సినిమాకు సురేశ్ లంకలపల్లి దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 8న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[3]
రాచరికం | |
---|---|
![]() | |
దర్శకత్వం | సురేశ్ లంకలపల్లి |
కథ |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఆర్య సాయి కృష్ణ |
కూర్పు | జానకి రామ్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 31 జనవరి 2025 |
సినిమా నిడివి | నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురాయలసీమలోని రాచకొండలో సాధారణ ఎమ్మెల్యేగా తన ప్రయాణం ప్రారంభించిన రాజారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) పాతికేళ్లలో ముఖ్యమంత్రి సీటుకు బలమైన అభ్యర్థిగా ఎదుగుతాడు. రాజారెడ్డికి ఇద్దరు పిల్లలు భార్గవి రెడ్డి (అప్సరా రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన శివ (విజయ్ శంకర్) 'మన శక్తి' పార్టీకి యువ నాయకుడిగా ఉంటాడు. శివ, భార్గవి రెడ్డి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలిసిన తన కూతురు భార్గవిని రాజిరెడ్డి బైరెడ్డి (విజయ్ రామరాజు)కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తరువాత వీరిద్దరి ప్రేమ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా? ఆ ప్రేమ ఈ అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
మార్చు- వరుణ్ సందేశ్[5]
- అప్సరా రాణి
- విజయ్ శంకర్
- హైపర్ ఆది
- రంగస్థలం మహేష్
- విజయ రామరాజు
- శ్రీకాంత్ అయ్యంగార్
- మహబూబ్ బాష
- రూపేష్ మర్రాపు
- ప్రాచీ థాకర్
- లత
- ఈశ్వర్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఏం మాయని మాయని[6]" | వేంగి | వేంగి | హరిచరణ్ | 3:51 |
2. | "మౌల మౌల" | రామజోగయ్య శాస్త్రి | రాహుల్ సిప్లిగంజ్, కుమార వాగ్దేవి | 4:52 | |
3. | "టిక్కు టిక్కు" | పెంచల్ దాస్ | పెంచల్ దాస్, మంగ్లీ | 3:32 | |
4. | "మంగళ స్వరూపమే" | సురేష్ లంకపల్లి | హర్షిత పసల | 2:34 |
మూలాలు
మార్చు- ↑ "కొత్త కోణంలో రాచరికం సినిమా : ప్రొడ్యూసర్ ఈశ్వర్". Prajasakti. 28 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "ఆర్జీవీ భామ అప్సరా రాణి 'రాచరికం' ట్రైలర్ రిలీజ్.. అరాచకంగా ఉందిగా." 10TV Telugu. 8 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "వరుణ్ సందేశ్ నెగెటివ్ పాత్రలో రాచరికం.. జనవరి 31న రిలీజ్". NTV Telugu. 27 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "రాచరికం రివ్యూ: సీఎం సీటుకు అక్క, తమ్ముడు చేసిన రక్తచరిత్ర - రాయలసీమ రాజకీయాలకు అద్దం పట్టేలా..." 1 February 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "రాయలసీమ రాచరికం.. నెగిటివ్ రోల్లో హీరో వరుణ్ సందేశ్". V6 Velugu. 28 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "మాయ చేస్తున్న అప్సరా రాణి.. ఏం మాయని సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్". NT News. 29 September 2024. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.