రాజన్ పాటిల్
రాజన్ బాబూరావు పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజన్ పాటిల్ | |||
పదవీ కాలం 1995 – 2009 | |||
ముందు | నింబాల్కర్ చంద్రకాంత్ దత్తాజీరావు | ||
---|---|---|---|
తరువాత | ధోబాలే లక్ష్మణ్ కొండిబా | ||
నియోజకవర్గం | మోహోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజన్ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పిడబ్ల్యూపి అభ్యర్థి నింబాల్కర్ చంద్రకాంత్ దత్తాజీరావుపై 15,922 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి నింబాల్కర్ చంద్రకాంత్ దత్తాజీరావుపై 17,835 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజన్ పాటిల్ 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి నింబాల్కర్ చంద్రకాంత్ దత్తాజీరావుపై 31,225 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత రెండుసార్లు రాష్ట్ర సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Mohol News : मोहोळचे माजी आमदार राजन पाटील यांची राज्य सहकारी परिषदेच्या अध्यक्ष पदी निवड". Marathi News Esakal. 27 September 2024. Archived from the original on 9 October 2024. Retrieved 13 January 2025.
- ↑ "Former Mohol MLA Rajan Patil elected as President of State Cooperative Council solapur| Mohol News : मोहोळचे माजी आमदार राजन पाटील यांची राज्य सहकारी परिषदेच्या अध्यक्ष पदी निवड". 9 October 2024. Archived from the original on 27 సెప్టెంబర్ 2024. Retrieved 13 January 2025.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)CS1 maint: bot: original URL status unknown (link)