రాజస్థానీ వంటకాలు

ఈ వ్యాసం భారతీయ వంటలు శీర్షికలో భాగం
తయారుచేసే పద్ధతులు, వంటసామగ్రి

వంటపాత్రలు

ప్రాంతీయ వంటలు
ఉత్తర భారతదేశం

పంజాబీమొఘలాయిరాజస్థానీ
కాశ్మీరీభోజ్‌పూరీబనారసీబిహారీ

దక్షిణ భారతదేశం

కేరళతమిళఆంధ్రతెలంగాణకర్ణాటక

తూర్పు భారతదేశం

బెంగాలీఅస్సామీఒరియా
ఈశాన్య భారత

పశ్చిమ భారతదేశం

గోవాగుజరాతీమరాఠీ
మాల్వానీపార్శీ

ఇతరత్రా

విదేశీచారిత్రకజైన (సాత్విక)
ఆంగ్లో-ఇండియన్చెట్టినాడుఫాస్టుఫుడ్

Ingredients and types of food

ముఖ్యమైన వంటకాలుతీపి పదార్ధాలు
పానీయాలుఅల్పాహారాలుమసాలాలు
Condiments

See also:

Indian chefs
Cookbook: Cuisine of India

మార్చు


పనీర్ బాకడ్ వాడి మార్చు

కావలసిన పదార్థాలు:

  • పనీర్ తురుము 1 కప్పు
  • పల్లీలు 1 కప్పు
  • మైదా 2 కప్పులు
  • పంచదార 1 కప్పు
  • ఉప్పు చిటికెడు
  • నిమ్మ రసం 2 టీ స్పూన్లు
  • నూనె వేయించేందుకు సరి పడ
  • నెయ్యి 1 కప్పు

తయారు చేసే విధానం: మైదాలో కొద్దిగా నెయ్యి కలిపి నీటితో ముద్ద చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి. పనీర్ తురుము, కొబ్బరి తురుము, పంచదార, ఉప్పు, నిమ్మరసం, పల్లీల పొడిలో కలుపుకోవాలి. ఇప్పుడు మైదా చిన్న ముద్ద తీసుకుని చపాతీ లా ఒత్తుకుని, దానిపై పల్లీ పొడి మిశ్రమాన్ని ఉంచి, రోల్ లాగా ఛుట్టి, చివరలు విడిపోకుండా కొద్దిగా తడి చేసుకుని మూసివేయాలి. వీటిని నూనెలో వేయించాలి. మంచిగా వేగిన తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయవచ్చు. ఇవి వారం రోజుల వరకు నిలువ ఉంటాయి.

దహీ గట్టా మార్చు

కావలసిన పదార్థాలు:

  • శనగపిండి 1 కప్పు
  • పెరుగు 2 కప్పులు
  • జీలకర్ర 1/2 టీ స్పూన్
  • గరం మసాల చిటికెడు
  • కారం 1 టీ స్పూన్
  • ఉప్పు తగినంత
  • నెయ్యి 4 టీ స్పూన్లు

తయారు చేసే విధానం: శనగ పిండిలో తగినంత పెరుగు, చిటికేడు ఉప్పు కలిపి చిన్న చిన్న ముద్దలు (గట్టాలు) గా చేసుకోవాలి. ఈ గట్టాలను ఆవిరిపై ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి జీలకర్ర, ధనియాలు, పసుపు, గరంమసాలా, కారం, ఉప్పు, పెరుగు కలుపు కోవాలి. చిక్కదనం కోసం రెండు స్పూన్ల శనగ పిండిలో కొద్దిగా నీళ్ళు కలిపి, దానిని పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలి. చివరగా ఉడికించిన శనగపిండి గట్టాలను కూడా కలుపు కోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది.

చనా జైసల్మేర్కీ మార్చు

కావలసిన పదార్థాలు:

  • కాబులీ చనా 1 కప్పు
  • పెరుగు 1 కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు 1 కప్పు
  • కారం 1 టీ స్పూన్
  • గరంమసాల చిటికెడు
  • దనియాల పొడి 1/2 టీ స్పూన్
  • నూనె 3 టీ స్పూన్లు
  • జీలకర్ర, జీలకర్ర పొడి 1 టీ స్పూన్
  • శనగ పిండి 2 టీ స్పూన్లు

తయారు చేసే విధానం: కాబూలీ చనాను ముందుగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. బాణలీలో నూనె వేసి, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేసి వేయంచాలి. జీలకర్ర పొడి, దనియాల పొడి, కారం, ఉప్పు కలుపుకోవాలి. తరువాత పెరుగులో శనగ పిండి కలిపి, ఉల్లిగడ్డ మిశ్రమానికి చేర్చి, ఐదు నిమిషాలపాటు ఉడక నివ్వాలి. దీనిలో ఉడికించిన కాబూలీ చనా కూడా కలుపుకోవాలి. దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయవచ్చు.

జోధ్ పురి ఆలూ మార్చు

కావలసిన పదార్థాలు:

  • చిన్న ఆలుగడ్డలు 10
  • పచ్చి కొబ్బరి 1 చిప్ప
  • పెరుగు 1 కప్పు
  • కారం 1 టీ స్పూన్
  • జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్
  • గరం మసాల చిటికెడు
  • ఉప్పు తగినంత
  • దనియాల పొడి 1/2 టీ స్పూన్
  • ఉల్లిగడ్డ తరుగు 1 కప్పు
  • జీలకర్ర 1/ టీ స్పూన్

తయారు చేసే విధానం ఆలూని ఉడికించి ప్రక్కన ఉంచుకోవాలి. పచ్చి కొబ్బరిని తురుముకోవాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, తురిమిన పచ్చి కొబ్బరి వేసి వేయించాలి. తరువాత పెరుగు, గరం మసాల, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, దనియాల పొడి వేసి, ఉడికిన ఆలుగడ్డను కూడా కలుపుకోవాలి. దీనిని రోటీతో కానీ, అన్నంతో కానీ తినవచ్చు.

మేథీ మంగోడీ మార్చు

కావలసిన పదార్థాలు :

  • మినప్పిండి వడియాలు (మంగోడి) 1 కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు 1 కప్పు
  • కారం 1 టీ స్పూన్
  • శనగ పిండి 2 టీ స్పూన్లు
  • జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్
  • ధనియాల పొడి 1/2 టీ స్పూన్
  • పసుపు 1/4 టీ స్పూన్
  • ఉప్పు తగినంత
  • పెరుగు 1 కప్పు
  • నెయ్యి 4 టీ స్పూన్లు
  • నూనె వేయించేందుకు సరి పడ

తయారు చేసే విధానం : వడియాలను నూనెలో వేయించి ప్రక్కన ఉంచుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి కొద్దిగా వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిగడ్డ, పసుపు, మెంతికూర వేసి వేయించాలి. తరువాత పెరుగు కలుపుకొని జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు కలపాలి. కొద్దిగా నీళ్ళలో శనగ పిండి కలిపి దానిని ఉల్లిగడ్డ మిశ్రమానికి కలుపుకోవాలి. చివరలో ఫ్రై చేసి ఉంచిన వడియాలు కలిపి, ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. చివరలో కొత్తిమీర పైన చల్లుకోవాలి.

గోభీ రాజ్ వాడీ మార్చు

కావలసిన పదార్థాలు :

  • కాలి ఫ్లవర్ 1 పువ్వు
  • మైదా 4 టీ స్పూన్లు
  • పెరుగు 4 టీ స్పూన్లు
  • కారం 2 టీ స్పూన్లు
  • దనియాల పొడి 1/2 టీ స్పూన్
  • గరం మసాల చిటికెడు
  • జీలకర్ర పొడీ 1/2 టీ స్పూన్
  • ఉప్పు తగినంత
  • నూనె వేయించేందుకు సరిపడ
  • అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్
  • కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు

తయారు చేసే విధానం : కాలీ ఫ్లవర్ ను చిన్న ముక్కలుగా చేసుకుని, కార్న్ ఫ్లోర్, మైదా, పెరుగు, జీలకర్ర పొడి, దనియాల పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కలిపి నూనెలో వేసి, ముక్కలు కరకర లాడే వరకు ఫ్రై చేసుకోవాలి.

రాజస్థానీ కిచిడీ మార్చు

కావలసిన పదార్థాలు :

  • బాస్మతి బియ్యం 3 కప్పులు
  • ఎర్ర కంది పప్పు 1 కప్పు
  • క్యారెట్ ముక్కలు 1/2 కప్పు
  • బీన్స్ ముక్కలు 1/2 కప్పు
  • పచ్చి బటానీ 1/2 కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు 1/2 కప్పు
  • నెయ్యి 1/4 కప్పు
  • పచ్చి మిరపకాయలు 3
  • దనియాల పొడి 1/2 టీ స్పూన్
  • పసుపు 1/4 టీ స్పూన్
  • ఉప్పు తగినంత
  • నీళ్ళు 6 కప్పులు
  • జీలకర్ర 1 టీ స్పూన్

తయారు చేసే విధానం : అడుగు మందంగా ఉన్న పాత్రలో నెయ్యి వేసి జీలకర్ర, మిరప కాయలు, క్యారెట్, పచ్చి బటాణీ, బీన్స్ ముక్కలువేసి ఫ్రై చేయాలి. దనియాల పొడి, పసుపు, ఉప్పు కలిపి నీళ్ళు పొయ్యాలి. నీల్లు మసిలిన తరువాత బాస్మతి బియ్యం, కంది పప్పు కలిపి ఉడికించాలి. చివరగా కొత్తిమీర కలుపుకోవాలి.