రాజులు (కులం)

రాజులుగా పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.ఆంధ్ర ప్రాంతంలో అసలు క్షత్రియ వర్ణం లేనప్పటికీ వర్ణ వ్యవస్థలో క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 2002 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రాజులు జనాభాలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నార.ప్రధానంగా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.[2]

ఆచార వ్యవహారాలుసవరించు

బ్రాహ్మణుల వలే రాజులు కూడా ద్విజులు. - అనగా ఉపనయనము (ఒడుగు) సమయంలో జంద్యము (యజ్ఙోపవీతం) ధరించే ఆచారం ఉంది. బారసాల, కేశఖండనం, ఉపనయనం, కన్యాదానం, కాశీ యాత్ర వగైరా ఉన్నాయి.

స్వాతంత్రం తర్వాతసవరించు

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో జమీందారీ వ్యవస్థ రద్దుచేసి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది.క్రమేణా భూస్వాములు,జమీందారులు సామాన్య ప్రజానీకంలో కలిసిపోయారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో స్థిరపడిపోయారు. కొద్దిగా రాయలసీమకు, వలస వెళ్ళారు.

ప్రముఖులుసవరించు

 
అల్లూరి సీతారామరాజు విగ్రహం

క్షత్రియులకు సంబంధించిన జాతులుసవరించు

  1. భట్టురాజులు

మూలాలుసవరించు

  1. Satyanarayana, A. (2002). "Growth of Education among the Dalit-Bahujan Communities in Modern Andhra, 1893-1947". In Bhattacharya, Sabyasachi (ed.). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India. Orient Blackswan. p. 53. ISBN 978-81-250-2192-6. Retrieved 2012-02-29.
  2. Suri, K. C. (September 2002). "Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India" (PDF). London: Overseas Development Institute. p. 10. ISBN 0-85003-613-5. Archived from the original (PDF) on 2007-09-28. Retrieved 2012-02-29.