రాజు అవలే
రాజు జయవంతరావు అవలే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హత్కనంగలే శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజు అవలే | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | సుజిత్ మించెకర్ | ||
---|---|---|---|
తరువాత | అశోక్‌రావ్ మానే | ||
నియోజకవర్గం | హత్కనంగలే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇచల్‌కరంజి | 1974 జూన్ 26||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | జయవంతరావు అవలే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజు అవలే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి హత్కనంగలే శాసనసభ నియోజకవర్గం నుండి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014 మహారాష్ట్ర ఎన్నికలలో జన్ సురాజ్య శక్తి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి డాక్టర్ సుజిత్ వసంతరావు మినాచెకర్‌పై 6770 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజు అవలే 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జన్ సురాజ్య శక్తి అభ్యర్థి అశోక్ తుకారాం మానె చేతిలో 46249 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Hatkanangle". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ The Times of India (24 November 2024). "Third front draws a blank, netas say swept away by 'Ladki Bahin'". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.