రాబర్ట్ బ్రౌనింగ్ (1812 మే 7–1889) గొప్ప ఆంగ్ల పద్యకారుడు మరియు నాటక రచయిత. ఆయన నాటకీయ రచన శైలి, అందునా ప్రత్యేకించి ఆయన ఏకపాత్రాభినయ రచన ఆయనను విక్టోరియన్ కవులలోని సర్వ శ్రేష్టులలో ఒకడిగా నిలిపింది.

రాబర్ట్ బ్రౌనింగ్ (Robert Browning)
Robert Browning by Herbert Rose Barraud c1888.jpg
Robert Browning circa 1888
పుట్టిన తేదీ, స్థలం7 May 1812 (1812-05-07)
కాంబెర్‌వెల్, లండన్, ఇంగ్లాండ్
మరణం1889 డిసెంబరు 12 (1889-12-12)(వయసు 77)
వెనీస్, ఇటలీ
వృత్తిPoet
గుర్తింపునిచ్చిన రచనలుThe Ring and the Book, Men and Women, The Pied Piper of Hamelin, Porphyria's Lover, My Last Duchess

సంతకం

ప్రారంభ సంవత్సరాలుసవరించు

బ్రౌనింగ్ ఇంగ్లాండు లోని లండన్ పరిసర ప్రాంతమైన కాంబెర్వెల్ లో, రాబర్ట్ మరియు సారా అన్నా బ్రౌనింగ్ ల మొదటి సంతానముగా జన్మించాడు. ఆయన తండ్రి ఇంగ్లాండు బ్యాంకులో మంచి సంపాదన గల గుమస్తాగా సాలీనా £150[1] సంపాదించేవాడు.

బ్రౌనింగ్ తాత సెయింట్ కిట్ట్స్, వెస్టిండీస్ లో బానిసలకు యజమాని అయినప్పటికీ బ్రౌనింగ్ తండ్రి గొప్ప సంఘ సంస్కర్తగా పేరు పొందారు. బ్రౌనింగ్ తండ్రిని వెస్టిండీస్ లో చెరకు వ్యవసాయక్షేత్రములో పని చేయుటకు పంపినారు. అక్కడ ఆయన బానిసత్వము మీద తిరగబడి, ఇంగ్లాండు తిరిగి వచ్చాడు. బ్రౌనింగ్ తల్లి సంగీత విద్వాంసురాలు. ఆయనకు సరియన్నా అనే పేరు గల సోదరి ఉంది. బ్రౌనింగ్ బామ్మ మార్గరెట్ టైటిల్ జమైకాకు చెందిన మిశ్రమ జాతి సంతానము అనెడి వదంతు ఉండేది. ఆమెకు సెయింట్ కిట్ట్స్ లోని వ్యవసాయక్షేత్రము వారసత్వముగా లభించింది.

రాబర్ట్ తండ్రి సుమారు 6,000 పుస్తకములు ప్రోగు చేసారు వాటిలో చాలా పుస్తకములు అరుదైనవి. ఈవిధముగా, రాబర్ట్ మంచి సాహితీ వనరులు గల కుటుంబములో పెరిగాడు. ఆయనకు తల్లి వద్ద చనువు ఎక్కువ. ఆమెకు పెక్కు దైవభక్తి ఉన్నప్పటికిని ఆచార వ్యవహారములలో సొంత నిర్ణయములు తీసుకోగల గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆయన చిన్న సోదరి సరియన్నా కూడా మంచి తెలివైనది. ఆమె సోదరునికి ఆఖరి సంవత్సరములలో తోడుగా నిలిచింది. రాబర్ట్ తండ్రి సాహిత్యము మరియు కళలలో రాబర్టును ఎంతగానో ప్రోత్సహించాడు.

పన్నెండు సంవత్సరముల ప్రాయములో ప్రచురణకర్తలు దొరకక బ్రౌనింగ్ తన పద్యపుస్తకమును నాశనము చేశాడు. ప్రైవేటు బడులలోని వ్యవస్థీకృత విద్యా విధానము నచ్చక ఇంటి వద్ద ట్యూషను మాష్టారు వద్ద విద్య అభ్యసించాడు.

బ్రౌనింగ్ మంచి విద్యార్థి, ఆయన పద్నాలుగు సంవత్సరముల వయసులోనే ఫ్రెంచి, గ్రీకు, ఇటలీ మరియు లాటిన్ భాషలలో ప్రావీణ్యము సంపాదించారు. ఆయన శృంగార కవులను బాగా ఇష్టపడేవాడు. అందునా ప్రత్యేకించి షెల్లీ అభిమానైయ్యాడు. షెల్లీని అనుసరిస్తూ ఆయన హేతువాదిగా మరియు శాకాహారిగా మారిపోయాడు. అయితే తరువాతి కాలములో ఆయన వీటిని వదిలివేశాడు. పదహారు సంవత్సరముల ప్రాయములో, ఆయన లండను విశ్వవిద్యాలయములో చేరి పిమ్మట దానిని వదిలివేశాడు. ఆయన తల్లి యొక్క మత విశ్వాసముల మూలముగా అతను ఆక్స్-ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయములలో చదువుకొలేదు. ఆ రోజులలో ఆయా విశ్వవిద్యాలయములలో ఇంగ్లండు చర్చి సభ్యులకు మాత్రమే చదువుకొనుటకు అవకాశము లభించేది. అతనికి మిక్కిలి సంగీత సామర్ద్యము ఉండుటవలన ఆయన వివిధ రకముల గేయములకు స్వరకల్పన కూడా చేశాడు.

మధ్య సంవత్సరములుసవరించు

1845 లో బ్రౌనింగ్ విమ్పోల్ స్ట్రీటులోని ఎలిజిబెత్ బర్రేట్ అనే ఆమెను, ఆమె తండ్రి గారి ఇంటిలో కలవడమైనది. తర్వాత కాలములో వారి మధ్య ప్రణయము ఏర్పడి, 1846 సెప్టెంబరు 12న వారు రహస్య వివాహము చేసుని పారిపోయారు. ఎలిజబెత్ తండ్రి వారి వివాహమునకు ఒప్పుకోక పోవుట వలన, రహస్య వివాహము చేసుకొనవలసి వచ్చింది. వివాహము తరువాత వారు మొదట ఇటలీలోని పిసా లోను, తదుపరి ఒక సంవత్సర కాలములో ఫ్లోరెన్స్ లోని కాసా గిడి వద్ద అపార్టుమెంటులో నివసించారు. (ఇది ఇప్పుడు వారి జ్ఞాపకార్ధం మ్యూజియముగా ఉన్నది).

 
వీధుల వెంబడి తిరిగి వేణునాదము వాయించేవాని వెంట చిన్న పిల్లలంతా నడుచుచూ హామ్లిన్ బయటకు వచ్చారు. రాబర్ట్ బ్రౌనింగ్ గారి వెర్షనును కేట్ గ్రీనవే గారు తన దృష్టాంతములో పొందుపరిచారు.

1849లో వారి ఏకైక సంతానము రాబర్ట్ వీడిమన్ బర్రేట్ బ్రౌనింగ్ జన్మించెను. అతనిని "పెనిని" లేదా "పెన్" అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఈ కాలములోనే బ్రౌనింగ్ కు ఇటలీ యొక్క కళాత్మక వాతావరణము వలన అపారమైన ఆసక్తి కలిగి చాలా నేర్చుకొగలిగాడు. తరువాతి కాలములో అతను "ఇటలీ తన విశ్వవిద్యాలయము" అని చెప్పుకునేవాడు. బ్రౌనింగ్ వెనిస్ కు బయట అసోలో లోని వెనెటోలో ఒక ఇల్లు కూడా కొన్నాడు. కాని ఆ కొనుగోలుకు పట్టణ కౌన్సిలు వారు అనుమతించిన రోజునే విషాదంతముగా అతను మరణించాడు.[2] అతని భార్య 1861లో మరణించింది.

బ్రౌనింగ్ మొదటి దశలోని పద్య రచనలు ఆయనను గొప్ప మేధావిగా నిలబెట్టినప్పటికిని, ఆయన తన మధ్య వయస్సు వరకు మరుగునే ఉన్నారు. (శతాబ్ద మధ్య కాలము వరకు టెన్నిసన్ మిక్కిలి పేరుగాంచిన పద్య కవి). ఫ్లోరెన్స్ లో ఆయన రచించిన పద్యములు అన్నీ కలిపి "మెన్ అండ్ ఉమెన్ " అనే పుస్తకముగా రెండు సంచికలలో వచ్చింది. ఈ పద్య కావ్యము మూలముగా ఆయనకు గొప్ప పేరు వచ్చింది. అయినప్పటికి ఇది 1855లో ప్రచురితమయ్యే సమయానికి పెద్దగా ప్రభావితము చూపలేకపోయింది. 1861లో భార్య మరణము తరువాత, ఆయన ఇంగ్లండు తిరిగి వచ్చి లండను సాహిత్య వేదికలో భాగము అయ్యాక ఆయన కీర్తి నలువైపులా వ్యాపించింది. ఆయన అయిదు సంవత్సరముల కృషి చేసి 1868 లో ప్రాస లేకుండా రచించిన ది రింగ్ అండ్ ది బుక్ అనే రచన ప్రచురితమైనది. ఇది ఆయనకు వాస్తవముగా గొప్ప గుర్తింపును తెచ్చి పెట్టినది. 1690లలో హత్య కేసును ఆధారముగా చేసుకొని 12 పుస్తకముల పద్య సంపుటిని రచించాడు. ఆ కథలోని వేర్వేరు పాత్రలతో చెప్పించిన పది పెద్ద పద్యములు, వివిధ సంఘటనల మీద ఆయా పాత్రల యొక్క ఆలోచన ధోరణులను సవివరముగా వ్యక్తపరుస్తాయి. ఆ పుస్తకమునకు బ్రౌనింగ్ తనే స్వయముగా పరిచయము మరియు సమీక్ష వ్రాసినాడు. బ్రౌనింగ్ సొంత నాణ్యతా ప్రమాణముల కన్నా అతి పొడవైన (ఇరువై వేల లైన్లు గల)ది రింగ్ అండ్ ది బుక్ అనే పద్య కావ్యము బ్రౌనింగ్ యొక్క అత్యంత గణనీయమైన కవిత్వముగా చెప్పవచ్చు. అందువలనే ఆ రచన నాటక పద్యకావ్య రచనలో అమూల్యమైన కృషిగా కొనియాడబడింది. నవంబరు 1868 మొదలుకొని ఫిబ్రవరి 1869 వరకు నాలుగు భాగములుగా ప్రచురితమైన ఈ పద్యకావ్యము, వాణిజ్యపరముగా మరియు విమర్శనాపరముగా చాలా గొప్ప విజయమును సాధించింది. ఈ పద్యకావ్యము బ్రౌనింగ్ నలబై సంవత్సరముల కృషికి తగిన కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.

ఎలిజెబత్ బారెట్ బ్రౌనింగ్సవరించు

 
1882లో పంచ్ అనే పత్రికలో వ్యంగ్య చిత్రము ఈ విధముగా వచ్చినది: "ది రింగ్ అండ్ ది బుక్ మేకర్ ఫ్రమ్ రెడ్ కాటన్ నైట్ కేప్ కంట్రి"

రాబర్ట్ బ్రౌనింగ్ మరియు ఎలిజెబత్ ల ప్రణయ కార్యకలాపాలు మరియు వివాహము చాలా రహస్యముగా జరిగాయి. ఆమె బలహీనురాలు మరియు అతని కంటే ఆరు సంవత్సరములు వయసులో పెద్దది అగుట చేత స్ఫూరదూపి మరియు ప్రాపంచిక వ్యక్తి అయిన బ్రౌనింగ్ ఆమెను ప్రేమిస్తున్నానంటే నమ్మలేకపోయేది. ఆమె తర్వాతి రెండు సంవత్సరములలో రచించిన సోనేట్స్ ఫ్రమ్ పోర్చుగీసులో తన సందేహాలు వ్యక్తపరిచింది. ప్రేమ అందరికన్నా గొప్పది. ఆగస్టు 1846లో వారికి సెయింట్ మెరీల్-బోన్ పారిష్ చర్చిలో రహస్య వివాహము జరిగిన తరువాత బ్రౌనింగ్ తన హీరో షెల్లీని అనుకరిస్తూ తన భార్యతో ఇటలీ వెళ్లి, ఆమె చనిపోయేవరకు అక్కడే నివాసం ఉన్నాడు. ఎలిజెబత్ కు విశ్వాసపాత్రురాలైన విల్సన్ అనే నర్సు చర్చిలో వారి వివాహమునకు సాక్షి, ఆమె ఆ జంటకు తోడుగా ఇటలీ వెళ్లి వారికి సేవకురాలిగా ఉండిపొయింది.'

ఆమె తండ్రి బారెట్ వివాహము చేసుకొన్న తన ఇతర పిల్లల మాదిరిగానే ఎలిజెబత్ కు వారసత్వ హక్కులను రద్దు పరిచాడు. "శ్రీమతి ఎలిజెబత్ కల్పనలు చాలా మధురమైనవి, అమాయకురాలైన ఆమె తన యవ్వనములో నిరంకుశుడైన తండ్రిచేత క్రూరమైన హింసలకు గురైనప్పటికినీ, ఆమె తన అదృష్టవశాత్తు చురుకైన, అందగాడైన కవి రాబర్ట్ బ్రౌనింగ్ ప్రేమలో పడింది. "ఆమె చివరకు విమ్పోల్ వీధిలోని ఖైదు వంటి తన తండ్రి ఇంటి నుండి పారిపోయి ఇటలీ వెళ్లి సుఖ సంతోషములతో జీవించింది."[3]

ఎలిజెబత్ తనతో కొంత సొమ్ము తీసుకురావటము వలన ఆ జంట సంతృప్తితో సుఖముగా ఇటలీలో నివసించగలిగింది. వారి కీర్తి మూలముగా ఆ జంటను ఇటలీలో అందరూ గౌరవముగా చూసేవారు మరియు వారి ఆటోగ్రాఫులు కొరకు ఎగబడేవారు. 1849లో 43వ ఏట ఎలిజెబత్ తన కుమారుడు రాబర్ట్ వీడ్మన్ బారెట్ బ్రౌనింగ్ కు జన్మనిచ్చింది. అతనిని వారు పెన్ అనే ముద్దుపేరుతో పిలిచేవారు. వారి కుమారుడు తరువాత వివాహము చేసుకొన్నాడు అయితే అతనికి న్యాయపరముగా పిల్లలు లేరు. ఫ్లోరేన్సు సమీప ప్రాంతములు అతని వంశీకులతో నిండిపోయినవని వదంతు ఉంది.

“చాలా మంది బ్రౌనింగ్ విమర్శకులు ఆయన మొదటిలో 'లౌకికమైన కవిగా' ఉండి తరువాత 'అలౌకికమైన కవిగా' మారి విజయము సాధిచాడని అందుకు ప్రియురాలితో సంభాషణలు ఉపయోగపడినవనియు సూచించారు.”[4] ' ఎలిజెబత్ తన భర్త ఒత్తిడి మేరకు తన రెండవ భాగమైన పద్యము లలో ఆమె ప్రేమను గద్యరూపములో వర్ణించింది, ఇది ఆమె జనాదరణను మరియు అభిమానులను పెంచింది మరియు అభిమానపాత్రురాలైన విక్టోరియా కవయత్రిగా ఆమె స్థానాన్ని బలపరిచింది. విలియం వర్డ్స్ వర్త్ మరణము తరువాత ఆమె కవి శేఖర గౌరవ సత్కారమునకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరికి అది టెన్నిసన్ కు దక్కింది.'

అతని ఆఖరి కొద్ది సంవత్సరములుసవరించు

అతని శేషజీవితములో ఆయన చాలా ఎక్కువగా యాత్రలు చేశాడు. బ్రౌనింగ్ గారి తదుపరి రచనలు ఈ రోజులలో విమర్శాత్మకముగా పునఃమూల్యాంకనము గావింపబడుచు వాటి పద్య సంబంధమైన నాణ్యతకు, అలౌకికమైన దృష్టికి తార్కాణములుగా నిలిచిపోయాయి. 1870 లలో ఫిఫైన్ ఎట్ ది ఫెయిర్ మరియు రెడ్ కాటన్ నైట్-కేప్ కంట్రి వంటి పెద్ద పద్యకావ్యములు ప్రచురితమయ్యాక, బ్రౌనింగ్ తిరిగి చిన్న పద్యకావ్యములు వైపు మొగ్గు చూపాడు. ఆయన తదుపరి రచనలు పచ్చిరోట్టో, అండ్ హౌ హి వర్కెడ్ ఇన్ దిస్తేమ్పెర్ బ్రౌనింగ్ విమర్శకులను, అందునా ప్రత్యేకించి కవి శేఖరుడు అయిన అల్ఫ్రెడ్ ఆస్టినును తీవ్రముగా గాయపరచినవి.

కొన్ని సాక్ష్యముల మూలముగా బ్రౌనింగ్ లేడి అష్-బర్టన్ తో ప్రణయకలాపాలు నడిపాడని కాని పునఃవివాహము చేసుకోలేదని తెలియుచున్నది. ఎలిజెబత్ మరణము తరువాత 17 సంవత్సరములకు 1878లో ఆయన ఇటలీ మొదటిసారి తిరిగివచ్చారు, ఆ తర్వాత చాలా సార్లు వేర్వేరు పనుల నిమిత్తము ఇటలీ వచ్చి వెళ్ళేవాడు.

 
బ్రౌనింగ్ గారి మరణాంతరము.

అతని సేవలకు గుర్తుగా 1881లో బ్రౌనింగ్ సొసైటీ ఏర్పాటైంది.

1887 లో, బ్రౌనింగ్ తన చివరి రోజులలో అద్భుతమైన పద్యరచన, పార్లీయింగ్స్ విత్ సర్టైన్ ప్యుపిల్ ఆఫ్ ఇంపార్ట్ న్స్ ఇన్ థైర్ డే రచించాడు. ఇది అతనిలోని కవి యొక్క సొంత స్వరము, పొడుగాటి సాహిత్య సంభాషణలు కళాత్మకముగా, తత్వపూరితముగా వర్ణించుటకు అవకాశము కల్పించింది. ఇంకొక పర్యాయము, విక్టోరియన్ సమాజముచేత భంగపడుట వలన బ్రౌనింగ్ తిరిగి తన చివరి రచన అసోలాండో (1889)కొరకు చిన్నవి, క్లుప్తమైన పద్యములు మాత్రమే రచించాడు.

ఆయన వెనీస్ లోని తన కుమారుని నివాసము కె రేజ్జోనికోలో 1889 డిసెంబరు 12 న కాలము చేసారు. అదే రోజున అసోలాండో ప్రచురించబడెను. పోఎట్స్ కార్నెర్ వద్ద వెస్ట్ మినిస్టర్ అబేలో ఆయన సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన సమాధి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ సమాధికి పక్కన ఉంటుంది.

బ్రౌనింగ్ యొక్క పద్య రీతిసవరించు

బ్రౌనింగ్ గారి కీర్తి ఆయన రచించిన నాటకీయమైన ఏకపాత్రాభినయముల ద్వారా తెలుస్తుంది. వీటిలో పదాలు సంఘటనలను, నటనలను మాత్రమే కాకుండా పాత్ర యొక్క శీలము, లక్షణముల వర్ణన కూడా ఉంటుంది. బ్రౌనింగ్ ఏకపాత్రభినయములలో స్వగత సంభాషణలా కాకుండా పాత్ర తన గురించి సహజముగానే చెప్పుకొంటూ పోతూ, గత చర్యలు గురించి కారణాలు చెబుతూ, ఈ విధముగా తన గురించి పద్యములోని నిశ్శబ్ద ప్రేక్షకుడికి "ప్రత్యేకించి మనవి చేసుకొంటూ" పోతుంది. చవకబారు ప్రసంగములు లేకుండా పాత్రధారి తన సంభాషణల ద్వారా ఆత్మరక్షణ చేసుకొంటూ ప్రేక్షకుడిని "న్యాయ నిర్ణేతగా" నిలబెడతాడు. ముఖ్యముగా బ్రౌనింగ్ అవినీతిపరుని, మనస్థిమితములేని నేరగాడిని, అసాంఘికమైన హత్యలు చేసిన వాడిని పాత్రలుగా ఎంపిక చేసుకొని, ప్రేక్షకుడిని తన సంభాషణల ద్వారా మైమరపించుచూ, చదివేవారి మదిలో జాలి రగిల్చి ఆ పాత్రను నిర్దోషి అనిపించేలా చేస్తాడు. పోర్ఫిరియా'స్ లవర్ అనే రచన ఆయన వ్రాసిన ఏకపాత్రాభినయములలో గొప్ప విప్లవమాత్మక విజయము సాధించింది.

కవిగారి ఏకపాత్రాభినయములలో తరుచుగా చెప్పుకోబడే మై లాస్ట్ డచేస్లో చదువరికి పైపై మెరుగుల పూతలతో మాట్లాడే మాటకారైన ఆ ఊరి మోతుబరి పాత్ర ద్వారా అతని లోపల దాగి ఉన్న భయానకమైన మనస్సును బయటపెట్టాడు. ఆ మోతుబరి భార్య నమ్మకద్రోహమునకుగాని, కృతజ్ఞత లేకపోవుట వలనగాని, దైనందిక జీవితములో సాధారణమైన సుఖములు కోరుకోవటము వలనగాని హత్య గావింపబడలేదు. ఆ మోతుబరి మానసిక రోగి అగుట చేత, ఆమె నుండి అతడు ఉహించిన రీతిలో ఆమె వంగి వంగి నమస్కారములు చేయకపోవుట వలన, ఆయన చిత్రములకు, శిల్పములకు ఒక కపట నటనతో ఆమె మోడల్ గా ఉండక పోవుటవలన హత్య చేశాడు. బ్రౌనింగ్ ఫ్రా లిప్పో లిప్పి వంటి ఇతర ఏకపాత్రభినయములలో, నీతిలేని, ప్రతీకారస్వభావముతో రగిలిపోయే పాత్రను తీసుకోని, అతడు అలా మారుటకు కారణమైన పరిస్టితుల ద్వారా అతనిలోని మంచితనమును వెలుగులోకి తీసుకువస్తూ, అతడికి సమకాలీనులైన న్యాయనిర్ణేతలు సిగ్గుపడేటట్లు సవాళ్ళు విసురుతాడు. ది రింగ్ అండ్ ది బుక్ అనే రచనలో బ్రౌనింగ్ పురాణములంత పొడవైన పద్యములతో పన్నెండు ఏకపాత్రభినయముల ద్వారా దేవుని మానవత్వమునకు సహేతుకమైన వివరణలు ఇస్తూ, ఒక హత్య కేసుశోధన గురించి వ్రాస్తాడు. ఈ ఏకపాత్రభినయముల రచనలు తరువాతి తరము పద్యకారులైన టి. ఎస్. ఎలియట్ మరియు ఎజ్రా పౌండ్ మొదలైనవారిని ఎంతగానో ప్రభావితము చేశాయి. ఎజ్రా పౌండ్ తన కాంటోస్ రచనలో 13వ శతాబ్దపు అణగారిపోయిన జానపద గాయకుని గురించి వర్ణిస్తున్న పద్యములో, బ్రౌనింగ్ సోర్డేల్లో రచన ఎంతగానో ప్రభావితము చేసిందని తెలుస్తోంది.

బ్రౌనింగ్ రచనాశైలి ఆనాటి విక్టోరియన్ పాఠకులకు చాలా అధునాతనమైనదిగా, ప్రయోగాత్మకముగా కనిపించుటయేకాక, ఆయన రచనలలో 17వ శతాబ్దపు జాన్ డాని శైలి వంటి తీవ్రమైన మలుపులు, వాడుక భాషలో సంప్రదాయేతర పద్యములు ఉన్నట్లుగా గుర్తించారు. కానీ ఆయన, పద్యకవుల్లో ప్రవక్త వంటి పెర్సి షెల్లీ కి, అహంకారములోను, శ్లేషలోను, పదముల గారడిలోను అభౌతికమైన కవిగా, కవితా వారసునిగా 17వ శతాబ్దపు కవులలో ఒకరిగా నిలిచిపోయారు. ఆయన ఆధునికమైన సూక్ష్మదృష్టితో, తన రచనలోని అసురక్షితమైన సాధారణ పాత్రను కూడా కాపాడుతూ, తర్కమైన వాదనల ద్వారా ఈ విధముగా చెప్పించేవారు: "భగవంతుడు తన స్వర్గములో ఉన్నాడు; ప్రపంచములో సర్వమును నియమానుసారముగానే ఉన్నది." బ్రౌనింగ్ అటువంటి పాత్రలో సర్వవ్యాపి అయిన దైవమును చూస్తూ, అతడు చేసిన పని అవిభాజ్యమైన లౌకిక ప్రక్రియలో భాగమని సమర్దిస్తూ, ఆ పాత్ర తన జీవితమును సరిదిద్దుకొనుటకు చాలా సమయము ఉన్నదని నిరూపిస్తాడు.

ధ్వని రికార్డింగ్ యొక్క చరిత్రసవరించు

ఏప్రియల్ 7, 1889 న బ్రౌనింగ్ స్నేహితుడైన రుడాల్ఫ్ లేమన్ అనే చిత్రకారుని నివాసమందు ఏర్పాటు చేసిన విందులో ఎడిసన్ గారి సిలిండరు ఫోనోగ్రాఫ్ ఫై బ్రౌనింగ్ పద్యములు రికార్డు చేశారు. ఈ సిలిండరు ఫోనోగ్రాఫ్ ను ఎడిసన్ ప్రతినిధి జార్జ్ గౌరాడ్ తెల్లని మైనపు సిలిండరుపై తయారు చేశాడు. ఈ రికార్డింగులో బ్రౌనింగ్ "హౌ దె బ్రాట్ ది గుడ్ న్యూస్ ఫ్రం ఘెంట్ టు ఐక్ష్" అనే తన రచనలోని కొంత భాగము పాడాడు. ఈ రికార్డింగు ఇప్పటికీ లభ్యమవుతుంది (ఇందు పదములు మరచిపోయినప్పుడు ఆయన చెప్పిన క్షమాపణలు కూడా వినిపిస్తాయి).[5] 1890లో ఆయన వర్ధంతి సభలో, ఆయన అబిమానుల గుంపులో ఈ రికార్డింగు వినిపింపచేసినప్పుడు, వారు మొట్ట మొదటగా "సమాధినుండి బ్రౌనింగ్ గారు మాట్లాడుతున్నారా" అన్న అనుభూతి కలిగినదని వాపోయారు.[6][7]

రచనల యొక్క పూర్తి జాబితాసవరించు

 • పాలిన్: ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎ కన్ఫెషన్ (1833)
 • పారాసెల్సస్ (1835)
 • స్ట్రాఫోర్డ్ (నాటకం) (1837)
 • సార్డెల్లో (1840)
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ No. I: పిప్ప పాసెస్ (నాటకం) (1841)
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ No. II: కింగ్ విక్టర్ అండ్ కింగ్ చార్లెస్ (నాటకం) (1842)
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ No. III: డ్రమాటిక్ లిరిక్స్ (1842)
  • "పోర్ఫిరియా'స్ లవర్"
  • "సోలిలోక్వీ ఆఫ్ ది స్పానిష్ క్లాయిస్టర్"
  • "మై లాస్ట్ డచేస్"
  • ది పఎడ్ పైపర్ ఆఫ్ హామెలిన్
  • "జోహాన్స్ అగ్రికోలా ఇన్ మెడిటేషన్"
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ నం. IV: ది రిటర్న్ ఆఫ్ ది డ్రుస్సేస్ (నాటకం) (1843)
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ నం. V: ఎ బ్లోట్ ఇన్ ది 'స్కాట్చియన్ (నాటకం) (1843)
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ నం. VI: కొలంబెస్ బర్త్ డే (నాటకం) (1844)
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ నం. VII: డ్రమెటిక్ రొమాన్సెస్ అండ్ లిరిక్స్ (1845)
  • "ది లాబొరేటరీ"
  • "హౌ దె బ్రాట్ ది గుడ్ న్యూస్ ఫ్రం ఘెంట్ టు ఐక్ష్"
  • "ది బిషప్ ఆర్డర్స్ హిజ్ టోంబ్ ఎట్ సెయింట్ ప్రాక్స్డ్'స్ చర్చ్"
 • బెల్స్ అండ్ పోంగ్రానేట్స్ నం. VIII: లురియ అండ్ ఎ సౌల్ ట్రాజెడీ (నాటకములు) (1846)
 • క్రిస్మస్-ఈవ్ అండ్ ఈస్టర్-డే (1850)
 • మెన్ అండ్ ఉమెన్ (1855)
  • "లవ్ అమాంగ్ ది రూయిన్స్"
  • "ది లాస్ట్ రైడ్ టుగెదర్"
  • "ఎ టొకాటా ఆఫ్ గాలుప్పి'స్"
  • "చైల్డ్ రోలాండ్ టు ది డార్క్ టవర్ కేమ్"
  • "ఫ్రా లిప్పో లిప్పి"
  • "ఆండ్రియా డెల్ సార్టో"
  • "ది పాట్రియాట్/ ఆన్ ఓల్డ్ స్టోరీ"
  • "ఎ గ్రామేరియన్'స్ ఫ్యునేరల్"
  • "ఎన్ ఎపిస్లె కంటైనింగ్ ది స్ట్రేంజ్ మెడికల్ ఎక్స్-పీరిఎన్స్ ఆఫ్ కార్షిష్, ది అరబ్ ఫిజిషియన్"
 • డ్రమాటిస్ పర్సోనే (1864)
  • "కాలిబాన్ అపాన్ సేటేబోస్"
  • "రబ్బీ బెన్ ఎజ్రా"
 • ది రింగ్ అండ్ ది బుక్ (1868-9)
 • బాలాషన్'స్ ఎడ్వెంచర్ (1871)
 • ప్రిన్స్ హోహెన్ స్టీల్ -స్క్వాన్ గౌ, సావిఅర్ ఆఫ్ సొసైటీ (1871)
 • ఫిఫైన్ ఎట్ ది ఫెయిర్ (1872)
 • రెడ్ కాటన్ నైట్-కేప్ కంట్రి, ఆర్, టర్ఫ్ అండ్ టవర్స్ (1873)
 • అరిస్టో ఫేన్స్' ఎపాలజి (1875)
 • ది ఇన్ ఆల్బం (1875)
 • పచ్చిరోట్టో, అండ్ హౌ హి వర్కెడ్ ఇన్ దిస్తేమ్పెర్ (1876)
 • ది అగ్మేంనన్ ఆఫ్ ఎస్చిలస్ (1877)
 • ల సాయిసియజ్ అండ్ ది టు పోఎట్స్ ఆఫ్ క్రోయిసిక్ (1878)
 • డ్రమాటిక్ ఐడిల్స్ (1879)
 • డ్రమాటిక్ ఐడిల్స్: సెకండ్ సిరీస్ (1880)
 • జోకో సిరియా (1883)
 • ఫేరిష్ట'స్ ఫాన్సీస్ (1884)
 • పార్లీయింగ్స్ విత్ సర్టైన్ ప్యుపిల్ ఆఫ్ ఇంపార్ట్ న్స్ ఇన్ థైర్ డే (1887)
 • అసోలాండో (1889)
  • ప్రోస్పైస్

జనరంజక సంస్కృతిసవరించు

 • బ్రౌనింగ్ మరియు ఆయన శ్రీమతి ఎలిజెబత్ జీవితముపై ఒక నాటకము "ది బర్రేట్స్ ఆఫ్ విమ్పోల్ స్ట్రీట్" రచించబడింది. ఈ నాటకమునకు కాథరిన్ కార్నెల్ అనే ఆమె నిర్మాత మరియు నటిగా వ్యవహరించారు. శ్రీమతి ఎలిజెబత్ పాత్ర కాథరిన్ కార్నెల్ కు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ నాటకము పెద్ద విజయము సాధించడమే కాక ఆ జంటకు యునైటెడ్ స్టేట్స్ లో గొప్ప కీర్తి సంపాదించి పెట్టింది. ఈ నాటకము ఆధారంగా రెండు సినిమాలు కూడా వచ్చాయి.
 • ది వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆర్కెస్ట్రా వారి ద్వితీయ ఆల్బమ్ ప్రొస్పైస్ రాబర్ట్ బ్రౌనింగ్ పద్యముల ద్వారా వచ్చాయి.
 • స్టిఫెన్ కింగ్ యొక్క ది డార్క్ టవర్ అనే సీరియల్ నవలలు బ్రౌనింగ్ పద్యకావ్యము చైల్డ్ రోలాండ్ టు ది డార్క్ టవర్ కేమ్ యొక్క ప్రేరణతో వచ్చినవే.
 • రాక్ బ్యాండ్ క్వీన్ గారి "మై ఫైరీ కింగ్" (1973) పాటలలోని లైన్లు "అండ్ థైర్ డాగ్స్ అవుట్రేన్ అవర్ ఫాలో డీర్, అండ్ హనీ-బీస్ హేడ్ లాస్ట్ థైర్ స్టింగ్స్, అండ్ హార్సెస్ వెర్ బార్న్ విత్ ఈగల్స్' వింగ్స్", బ్రౌనింగ్ గారి రచన ది పఎడ్ పైపర్ ఆఫ్ హామెలిన్ నుండి తీసుకొనబడ్డాయి.
 • రాబర్ట్ ఎఫ్. యంగ్ గారి సమర్ధకులు 1957లో నిర్మించిన సైన్సు కల్పిత కథ యువర్ గోస్ట్ విల్ వాక్...లో రెండు మర మనుష్యుల వ్యక్తిత్వాలు రాబర్ట్ బ్రౌనింగ్ మరియు ఎలిజబెత్ బర్రేట్ బ్రౌనింగ్ ను పోలి ఉంటాయి.
 • నియాన్ జెనిసిస్ ఇవంజెలియన్ ఫ్రాంచైజీలో, నెర్వ్ సంస్థ యొక్క లోగో అంజీర్ వృక్షపు ఆకు సగభాగముపై సంస్థ పేరు, క్రింది పావు భాగమున స్లోగనుతో ఉంటుంది. "భగవంతుడు తన స్వర్గములో ఉన్నాడు.... ప్రపంచములో సర్వమును నియమానుసారముగానే ఉన్నది." ఈ స్లోగను రాబర్ట్ బ్రౌనింగ్ గారి పద్యము పిప్పా పాసెస్ నుండి తీసుకొనబడింది.
 • టేర్రెంస్ రాటిగన్ అనే నాటకములోని ఉపకథావస్తువు ది బ్రౌనింగ్ వెర్షను (తదుపరి కాలములో ఆల్బర్ట్ ఫిన్ని నటించిన 1994 సినిమా) లోనిది. ఇది ఒక సున్నితమైన స్కూలు విద్యార్థి తన గురువుగారికి బహుమతిగా ఇచ్చినటివంటి బ్రౌనింగ్ 1877వ సంవత్సరపు రచన అయిన ది అగ్మేంనన్ ఆఫ్ ఎస్చిలస్ యొక్క అనువాదపు ప్రతి.
 • జాన్ లెనన్ గారి మరణాంతరము వెలుగులోనికి వచ్చిన ఆల్బం మిల్క్ అండ్ హనీ లోని "గ్రో ఓల్డ్ విత్ మి" అనే పద్యరచన, రాబర్ట్ బ్రౌనింగ్ ఉటంకించిన "గ్రో ఓల్డ్ విత్ మి, ది బెస్ట్ ఈజ్ ఎట్ టు బి.అనే సూక్తి పై ఆధారపడిఉన్నది. ఇది తరువాతి కాలములో సంగ్రహ పరచిన ది పోస్టల్ సర్వీస్ అనే ఆల్బంలో చేర్చబడినది.Instant Karma: The Amnesty International Campaign to Save Darfur
 • "గుడ్ గ్రీఫ్" ఆరవ సీజను ఎపిసోడులో ఫ్రాజిఎర్ క్రేన్, రాబర్ట్ మరియు ఎలిజెబత్ బ్రౌనింగ్ ల జీవితముల గురించి ఒక చిన్న సంగీత నాటకము స్వరపరిచాడు.
 • ది ఎక్స్-ఫైల్స్ యొక్క నాల్గవ సీజను ఎపిసోడు, "ది ఫీల్డ్ వేర్ ఐ డైడ్,"లో ఏజెంటు ఫాక్స్ ముల్డర్, పారాసెల్సస్ నుండి ప్రారంబము మరియు అంతములో ఇట్లు ఉదహరించెను.

సూచనలుసవరించు

 1. జాన్ మేనార్డ్, బ్రౌనింగ్ గారి యవ్వనము
 2. బారెట్ బ్రౌనింగ్ ఇటలీలోని ఆస్లో వద్ద పరమపదించినారు; రాబర్ట్ బ్రౌనింగ్ మరియు ఎలిజెబత్ ల తనయుడు ద్వారా ఇవ్వబడిన శ్రద్దాంజలి ప్రకటన, ది న్యూ యార్క్ టైమ్స్, 9 జూన్ 1912
 3. పీటర్సన్, విలియం ఎస్. సోనేట్స్: పోర్చుగీసు. మెసాచ్యుట్స్: బేర్ ప్రుచురణలు, 1977.
 4. పొలాక్, మేరీ సాండర్స్ ఎలిజెబత్ బారెట్ మరియు రాబర్ట్ బ్రౌనింగ్: ఒక సృజనాత్మకమైన భాగస్వామ్యము. ఇంగ్లండు: ఏష్-గేటు ప్రచురణల సంస్థ, 2003.
 5. [1] Archived 2005-12-31 at the Wayback Machine. 2 మే 2009న పునః ప్రాప్తీకరించుకోబడిన కవిత్వముల భాండాగారము
 6. క్రిల్ కేంప్, ఇవాన్, "వాయిస్ అండ్ ది విక్టోరియన్ స్టొరీటెల్లెర్." కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ, 2005, పేజీ 190. ఐ.ఎస్.బి.ఎన్. 0-521-85193-9, 9780521851930. సేకరణ తేదీ మే 2, 2009.
 7. [2]"ది ఆథర్," వాల్యుం 3, జనవరి -డిసెంబర్ 1891. బోస్టన్: ది రైటర్ ప్రచురణల సంస్థ. "రచయితల గురించి వ్యక్తిగత గాసిపులు-బ్రౌనింగ్." పేజీ 8 సేకరణ తేదీ మే 2, 2009.

సూచికలుసవరించు

 • డివేన్,విలియం క్లైడ్ . ఏ బ్రౌనింగ్ హ్యాండ్ బుక్ . 2 వ. ప్రచురణం. (అప్ప్లేటన్-సెంచురి-క్రాఫ్ట్స్, 1955)
 • డ్రూ,ఫిలిప్. ది పొయట్రి ఆఫ్ రాబర్ట్ బ్రౌనింగ్: ఏ క్రిటికల్ ఇంట్రోడక్షన్. (మెతుయెన్, 1970)
 • ఫిన్లేసన్, ఐయైన్. బ్రౌనింగ్: ఏ ప్రైవేట్ లైఫ్. హర్పర్ కాలిన్స్, 1996.
 • హడ్సన్, గేర్ట్రుడ్ రీస్. రాబర్ట్ బ్రౌనింగ్'స్ లిటరరీ లైఫ్ ఫ్రమ్ ఫస్ట్ వర్క్ టు మాస్టర్-పీస్. (టెక్సాస్, 1992)
 • కార్లిన్, డానియెల్. ది కోర్ట్ షిప్ ఆఫ్ రాబర్ట్ బ్రౌనింగ్ అండ్ ఎలిజబెత్ బారెట్. ఆక్స్‌ఫోర్డ్, 1952.
 • కెల్లీ, ఫిలిప్ ఎట్ ఎల్. (ఎడ్స్.) ది బ్రౌనింగ్'స్ కరెస్పాండెన్స్. 15 వాల్యుముస్. టు డేట్. (వేడ్జ్ స్టోన్, 1984-) (కంప్లీట్ లెటర్స్ ఆఫ్ ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ అండ్ రాబర్ట్ బ్రౌనింగ్, సో ఫార్ టు 1849.)
 • మేనార్డ్, జాన్. బ్రౌనింగ్'స్ యూత్. (హార్వర్డ్ యునివర్సిటీ . ప్రచురుణ, 1977)
 • చెస్టర్టన్, జి.కే. రాబర్ట్ బ్రౌనింగ్ (మక్మిలన్, 1903)
 • రయల్స్, క్లైడ్ డె ఎల్. ది లైఫ్ ఆఫ్ రాబర్ట్ బ్రౌనింగ్: ఎ క్రిటికల్ బయోగ్రఫీ . (బ్లాక్ వెల్, 1993)
 • మార్కుస్, జులియా. డేర్డ్ అండ్ డన్: ది మ్యారేజ్ ఆఫ్ ఎలిజబెత్ బారెట్ అండ్ రాబర్ట్ బ్రౌనింగ్ (బ్లూంస్ బరి, 1995)
 • జాన్ ఉల్ఫోర్డ్ మరియు డానియల్ కార్లిన్. రాబర్ట్ బ్రౌనింగ్' (లాంగ్మాన్, 1996) (లాంగ్మన్, 1996)
 • మార్టిన్ గారెట్, సం., ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ మరియు రాబర్ట్ బ్రౌనింగ్: ఇంటర్వ్యూ మరియు రి కలెక్షన్స్ . (మక్మిలన్, 2000)
 • మార్టిన్ గారెట్, ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ అండ్ రాబర్ట్ బ్రౌనింగ్ . (బ్రిటిష్ లైబ్రరీ రచయితల జీవితాలు).(బ్రిటిష్ లైబ్రరీ, 2001)
 • బాయ్ లిట్-జింగేర్ అండ్ డోనాల్డ్ స్మాలీ, ఎడ్స్. రాబర్ట్ బ్రౌనింగ్: ది క్రిటికల్ హెరిటేజ్ . రౌట్లెడ్జ్ 2006

బాహ్య లింకులుసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.