రామచంద్రపురం పురపాలక సంఘం

(రామచంద్రాపురం పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)

రామచంద్రపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, రామచంద్రాపురం పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం పరిధిలోనిది.

రామచంద్రాపురం పురపాలక సంఘం
రామచంద్రపురం
స్థాపన1959
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

రామచంద్రపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా లోని మునిసిపాలిటీ.1959 సంవత్సరంలో III వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 13.985.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.27 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 43,657 జనాభా ఉండగా అందులో పురుషులు 21,544,మహిళలు 23,113 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 82.25% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 85.23% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 79.35%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3994 ఉన్నారు.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా నాగేశ్వరరావు,[2] వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు మార్చు

కాకర్లపూడి వంశానికి చెందిన కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు.ఈ కోటలో ఇప్పటికీ వారి వంశస్థులు నివసిస్తున్నారు.

పరిశ్రమలు, వ్యాపారం మార్చు

100 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ శీతలపానీయాల పరిశ్రమ అభివృద్ధి చెందింది. పట్టణంలో ఇంకా వున్న చిన్నతరహా పరిశ్రమలతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.[3]

మూలాలు మార్చు

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 29 August 2014.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.
  3. "ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ". www.msn.com. Retrieved 2020-03-29.

వెలుపలి లంకెలు మార్చు