రామచంద్ర దత్తాత్రేయ లెలె

రామచంద్ర దత్తాత్రేయ లెలె (మరాఠీ: डॉ. रामचंद्र दत्तात्रय लेले) (జననం. 16 జనవరి 1928) భారతీయ వైద్య శాస్త్రవేత్త. [1] ఆయన జస్‌లోక్ ఆసుపత్రిలో నూక్లియర్ మెడిసన్ విభాగాన్ని స్థాపించారు. [2] ఆయన భారత అత్యున్నత పద్మభూషణ 1992లో భారత రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు.[3]

రామచంద్ర దత్తాత్రేయ లెలె
ఎల్. రామచంద్ర దత్తాత్రేయ
జననం (1928-01-16) 1928 జనవరి 16 (వయసు 96)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నూక్లియర్ మెడిసన్

జీవిత విశేషాలు మార్చు

ఆయన హైదరాబాదులో జనవరి 16 1928 న జన్మించారు. ఆయన తండ్రిపేరు దత్తాత్రేయ. ఎం.బి.బి.ఎస్ చదివి ఇంగ్లండ్ వెళ్ళి డి.టి.ఎం. అండ్ హెచ్ పట్టాఅను పొందారు. తొలుత ఔరంగాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పటల్ యొక్క మెడిసన్ విభాగంలో ప్రొఫెసర్ గా, హెడ్ గా 1960-63 మధ్య కాలంలో పనిచేసారు. ఆ తరువాత నాగపూర్ లోని గవర్నమెంటు మెడికల్ కళాశాల ప్రొఫెసరుగా 1963 నుండి 1968 మధ్య పనిచేసారు. బొంబాయిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఫొపెసరుగా 1972 నుండి 1978 వరకు పనిచేసారు. బొంబాయిలోని గ్రాంట్ మెడికల్ కాలేజీకి, సర్ జె.జె.గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ కు అధిపతి (డీన్) గా 1972-73 లో వ్యవహరించారు. 1973 నుండి 1978 వరకు జస్లోక్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (బొంబాయి) లో ఛీఫ్ ఫిజీషియన్ గా, నూక్లియర్ మెడిసర్ ఛీఫ్ గా వ్యవహరించుతూ, అనేక పరిశోధనలు చేసారు. గ్రాంట్ మెడికల్ కళాశాల ప్రొఫెసరుగా ఉన్నారు. దేశాధ్యక్షునికి గౌరవ వైద్యులుగా కీర్తి గడించారు.[4]

ఆయన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ వైద్య పత్రికలలో పలు పరిశోధనా పత్రాలను, అసంఖ్యాక రచనలను వెలువరించారు. అనేక గ్రంథరచనలు చేసారు. ప్రసిద్ధి పొందిన వాటిలో కొన్ని: ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆప్ నూక్లియర్ మెడిసన్, ఆయుర్వేద అండ్ మోడెర్న్ మొదలగునవి.

పరమాణు సంబంధిత వైద్య రంగంలొ గణనీయమైన పరిశోధన చేసి, అంతర్జాతీయ ఖ్యాతిని కూడా అందుకున్న ఆయన 1990లో గిప్టెడ్ టీచర్స్ అవార్డును, 1992 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ముంబైలోని జస్లోక్ హాస్పటల్ లో గౌరవ స్థానాన్ని పొంది జీవిత పర్యంతం పరిశోధనలకే అంకితమయ్యారు.

మూలాలు మార్చు

  1. Association of Adolescent and child care in India. "Core Faculty". Archived from the original on 16 నవంబరు 2014. Retrieved 14 ఫిబ్రవరి 2016.
  2. Jaslok Hospital. "Nuclear Medicine". Retrieved 29 August 2014.[permanent dead link]
  3. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 29 August 2014.
  4. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). విజయవాడ: శ్రీ వాసవ్య. 2011. p. 156.