లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, మోహన్ బాబు, జయచిత్ర, లత ముఖ్య తారాగణంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్.ఆర్. అనురాధాదేవి నిర్మించిన చిత్రం రాముడే రావణుడైతే.

రాముడే రావణుడైతే
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం ఎన్.ఆర్. అనురాధాదేవి
కథ దాసరి నారాయణరావు
చిత్రానువాదం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
మురళీమోహన్,
మోహన్ బాబు,
ప్రభాకర్ రెడ్డి,
మాడా,
కె.వి. చలం,
జయచిత్ర,
లత,
జయమాలిని,
ఉషాచౌదరి,
స్వర్ణ,
పుష్ప,
షావుకారు జానకి,
అల్లు రామలింగయ్య,
త్యాగరాజు,
ముక్కామల.
సంగీతం జి.కె. వెంకటేష్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
పి.సుశీల
గీతరచన సి.నారాయణ రెడ్డి, వేటూరి
సంభాషణలు దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణం కె.ఎస్. మణి
కళ వాలి
కూర్పు కె. బాలు
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

ఇందులో హీరో పాత్ర పేరు నాగులు. మొదట్లో మొరటుగా ఉండి రౌడి పనులు చేస్తుండేవాడు. అందుకు అంతా ఆయన్ని రౌడీనాగులు అని పిలుస్తుంటారు. అలా కొన్నిరోజుల తరువాత క్రమంగా మారి మంచివాడు అవువాడు.

నిర్మాణంసవరించు

జయా ఫిలింస్, శోభనాచల ఫిలింస్ పతాకాలపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రారంభదశలో చిత్రాలను, శోభనాచల స్టూడియోను నిర్మించి నిర్మించిన 'మీర్జాపూర్ రాజు' రాజా వెంకట్రామ అప్పారావు బహద్దుర్ కుమార్తె నుంగునూరి రాజ్యలక్ష్మీ అనురాధాదేవి. ఈవిడ 1976లో చక్రధారి సినిమాతో నిర్మాతగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనురాధాదేవి అక్కినేనితో తీసిన రెండో చిత్రం, దాసరితో తీసిన మొదటి సినిమా 'రావణడే రాముడైతే'.

అభివృద్ధిసవరించు

1977లో శోభన్ బాబు హీరోగా తీసిన నిండు మనిషి పరాజయం పొందడంతో చిన్న బడ్జెట్ లో ఒక మంచి సందేశాత్మక సినిమా తీయాలి అని అనురాధాదేవి అనుకున్నారు. దాంతో దాసరి గారిని సంప్రదించగా ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. అయితే చిన్న సినిమాగా వద్దు అక్కినేని గారితో ఒక డిఫరెంట్ గా చేద్దాం అని చెప్పారు.

నటీనటుల ఎంపికసవరించు

అక్కినేని హీరో కాబట్టి ఇతర తారాగణం కోసం వెదకడం జరిగింది. హీరోయిన్ పాత్రకోసం నిండు మనిషి సినిమాలో చేసిన జయచిత్ర ను ఎంపికచేశారు. మరో హీరోయిన్ పాత్రకోసం లత అనే అమ్మాయిని ఎంపికచేశారు. తను తమిళంలో బిజీగా ఉన్నా కూడా దాసరికి తెలిసినవారు కావడంతో తన డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ సినిమా చేసింది. ఇతర పాత్రల్లో మురళీమోహన్, మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, మాడా, త్యాగరాజు కె.వి. చలం చేశారు.

చిత్రీకరణసవరించు

చిత్ర షూటింగ్ జూలై 31, 1978లో అన్నపూర్ణ స్టూడియోలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతులమీదుగా ప్రారంభమైంది.

'రవివర్మకే అందని' అనే పాట చిత్రీకరణకు డ్రై ఐస్ కావాలసివచ్చింది. అది హైదరాబాద్ లో దొరక్కపోవడంతో బెంగళూర్ నుండి ఫ్లయిట్ లో తెప్పించేవారు. చిత్ర యూనిట్ మొత్తం అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ బయట కుర్చీలపై కూర్చోనేవారు. ఆకాశంలో విమానాన్ని చూసి షూటింగ్ ప్రారంభించేవారు.

'ఉస్కో ఉస్కో పిల్లా... చూస్కో చూస్కో మళ్లా' అనే పాట చిత్రీకరణ సమయంలో పాటలోని పదాలను విన్న అక్కినేనిగారు పిల్లని ఉస్కో ఉస్కో అని కుక్కపిల్లలా పిలవడం ఏమిటి నాన్సెన్స్. పాట మార్చండి అని కోపంగా బయటికి వెళ్లిపోయారు. అప్పుడు దాసరి గారు తన వెళ్లి తన సమయస్ఫూర్తి, తెలివితేటలను ఉపయోగించి అడవి రాముడులో రామారావుగారితో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట తీశారుకదా.. దానికి మనం ఈ పాటతో కౌంటర్ ఇస్తున్నాం' అని చెప్పి నాగేశ్వరరావు గారిని ఒప్పించారు.

పాటలుసవరించు

  1. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో [1]
  2. కనులలో నీరూపం [2]
  3. ప్రేమంటే తెలుసా నీకు [3]
  4. ఉస్కో ఉస్కో పిల్లా... చూస్కో చూస్కో మళ్లా

విడుదలసవరించు

మార్కెటింగ్సవరించు

విడుదలసవరించు

ఫిబ్రవరి 16, 1979 ఈ చిత్రం విడుదల అయింది.

స్పందనసవరించు

నాగేశ్వరరావు గారి గెటప్ కి, పాటల్లో ఆయన వేసిన స్టెప్స్ కి మంచి స్పందన వచ్చింది.

ఇతర విశేషాలుసవరించు

ఈ చిత్ర షూటింగ్ ప్రారంబోత్సవానికి ముఖ్యతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు సిని పరిశ్రమ హైదరాబాద్ కి రావాలి అని అన్నారు. వెంటనే దాసరి గారు మీరు స్థలం ఇస్తే అందరం వచ్చేస్తాం అన్నారు. దానికి చెన్నారెడ్డి గారు తప్పకుండా ఇస్తాను. మీరు అర్జీ పెట్టండి అనడంతో దాసరిగారు 13 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుచేసి, తలో 200 రూపాయల చొప్పున డబ్బు చెల్లించి ప్రభుత్వానికి లెటర్ రాశారు. అలా ఆరోజు ఫిలింనగర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది.

థీమ్స్ ప్రభావాలుసవరించు

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  • విశ్వవిజేత విజయగాధ, యు.వినాయకరావు, జయా పబ్లికేషన్స్, హైదరాబాద్, 2013.

బయటి లింకులుసవరించు