రాయ్‌పూర్ రైల్వే డివిజను
రాయ్‌పూర్ రైల్వే డివిజను భారతీయ రైల్వేల యొక్క ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలోని మూడు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజన్ 2003 ఏప్రిల్ 1న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశం లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఉంది.[1] నాగ్‌పూర్ (ఆగ్నేయ మధ్య) రైల్వే డివిజను, బిలాస్‌పూర్ రైల్వే డివిజను, బిలాస్‌పూర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ లోని ఇతర రెండు రైల్వే డివిజన్‌లు.[2][3]
రాయ్‌పూర్ Raipur | |
---|---|
రైల్వే డివిజను | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | రాయ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 21°15′23″N 81°37′47″E / 21.2564°N 81.6298°E |
ఎత్తు | 314.350 మీటర్లు (1,031.33 అ.) |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించేవారు | ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-నాగ్‌పూర్-ముంబై లైన్ |
ఇతర సమాచారం | |
స్థితి | పని చేస్తోంది |
జోన్(లు) | ఎస్.ఇ.సి.ఆర్ |
చరిత్ర | |
ప్రారంభం | 2003 |
విద్యుద్దీకరించబడింది | అవును |
రాయ్‌పూర్ స్టేషను
మార్చురాయ్పూర్ డివిజను, రాయ్‌పూర్ నగరానికి సేవలందించే ప్రధాన రైల్వే స్టేషను, డివిజను. భారతదేశంలోని రైల్వే డివిజన్లలో కొన్నింటికి మాత్రమే భారతీయ రైల్వేలు 'A-1' స్థాయిని ఇచ్చాయి, అందులో ఇది ఒకటి. భారతదేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే స్టేషన్లలో రాయ్‌పూర్ ఒకటి. ఈ స్టేషను హౌరా-నాగ్‌పూర్-ముంబై లైన్‌లోని ప్రధాన స్టేషన్లలో ఒకటి. రాయ్‌పూర్-విజయనగరం బ్రాంచ్ లైన్ మార్గం యొక్క మొదటి ఉద్దేశ్యం కూడా ఇదే. రాయ్‌పూర్ రైల్వే స్టేషను భారతీయ రైల్వేలోని అతిపెద్ద వంద బుకింగ్ స్టేషన్లలో ఒకటి. వేసవిలో వేడి నుండి ప్రయాణికులకు కొంత సహాయం పొందడానికి రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికుల కోసం క్లౌడింగ్ సిస్టమ్ ఉంది. ఈ టెక్నాలజీని కలిగి ఉన్న భారతదేశంలో రాయ్‌పూర్ రైల్వే స్టేషను ప్రధాన స్టేషను. 2013 సం. నుండి మిస్టింగ్ సిస్టమ్ పనిచేస్తోంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Railway Zones and Divisions in The Country". Press Information Bureau. Ministry of Railways (Government of India). 21 July 2017. Retrieved 1 January 2025.
- ↑ "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 13 January 2016.
- ↑ "Raipur Railway Division". Railway Board. North Eastern Railway zone. Retrieved 13 January 2016.