రావినూతల శ్రీరామమూర్తి

రావినూతల శ్రీరామమూర్తి రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు.

రావినూతల శ్రీరామమూర్తి
జననం1953
అంగలకుదురు గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా
ఇతర పేర్లురావినూతల శ్రీరామమూర్తి
వృత్తిరంగస్థల కళాకారులు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు

జననం మార్చు

శ్రీరామమూర్తి 1953లో గుంటూరు జిల్లా, తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం మార్చు

1976లో నాటకరంగంలోకి ప్రవేశించారు. పూలరంగడు నాటకంలో మొదటిసారిగా నటించారు. 1986లో స్వర్గీయ ఆలపాటి వెంకట్రామయ్య కళాపరిషత్ స్థాపించి అనేక నాటక పోటీలు నిర్వహించారు. ఎన్.టి. రామారావు మెమోరియల్ కళాపరిషత్, నన్నపనేని వెంకట్రావ్ స్మారక కళాపరిషత్, అంబేద్కర్ మెమోరియల్ కళాపరిషత్ లలో చురుగ్గా పొల్లొని నిర్వాహణలో సహకరించారు.

ప్రస్తుతం తెనాలి పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్నారు.24.12.2023 న గుండెపోటుతో మరణించారు.

నాటకాలు మార్చు

  • పెండ్లిపందిరి
  • జై ఆంధ్ర
  • స్త్రీ
  • పవిత్రబంధం
  • చీకటి వెలుగులు
  • సంఘం మెచ్చని సత్యం

వంటి నాటకాలు రచించి, దర్శకత్వం వహించారు.

మూలాలు మార్చు

  • రావినూతల శ్రీరామమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వరశర్మ, పుట. 141.