రావిపూడి వెంకటాద్రి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హేతువాది, పత్రికా సంపాదకుడు

రావిపూడి వెంకటాద్రి (1922 ఫిబ్రవరి 9 -2023 జనవరి 21) హేతువాది మాసపత్రిక సంపాదకుడు, మానవవాది.

రావిపూడి వెంకటాద్రి
రావిపూడి వెంకటాద్రి
జననం (1922-02-09) 1922 ఫిబ్రవరి 9 (వయసు 102)
మరణం2023 జనవరి 21(2023-01-21) (వయసు 100)
వృత్తిసంపాదకుడు, హేతువాది పత్రిక
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హేతువాది, మానవతావాది
గుర్తించదగిన సేవలు
ర్యాడికల్ హ్యూమనిజం,
హేతువాదం -మానవవాదం,
నాస్తికత్వం- నాస్తితత్వం
రాజకీయ పార్టీర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీ
ఉద్యమంర్యాడికల్ హ్యూమనిస్టు
పురస్కారాలుకవిరాజు త్రిపురనేని అవార్డు(1988, 1996)
తాపీ ధర్మారావు అవార్డు (1992)

ఫిబ్రవరి 9, 1922 లో ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం నాగండ్ల లో జన్మించారు. 1956 నుండి 1995 వరకు 40సంవత్సరాలు నాగండ్ల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. నాగండ్లలో 5.4.1943 న కవిరాజాశ్రమం స్థాపించారు. మానవతా విలువలు గుర్తించండి, గౌరవించండి, నిర్భయంగా జీవించండి, సాటి మానవుడిని మానవుడిగా గుర్తించండి అంటూ ఇతను 100 ఏళ్లలో 100 పుస్తకాలు[1] రాసిన మానవతావాది, హేతువాది. హేతువాదానికి నమ్మకాలుండవు. సమ్మతాలు (కన్విక్షన్స్) ఉంటాయి అంటారు రావిపూడి వెంకటాద్రి. మానవవాదంతో సమాజాన్ని మానవ సంబంధాలైన ప్రేమ, ఆదరణ వైపు మళ్లించడానికి నిరంతరకృషి చేస్తున్నారు.

మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూతనిస్తోందనీ, మూఢనమ్మకాలతో సతమతమవుతోన్నవారికి వెలుగు చూపుతోన్నదని వెంకటాద్రి నమ్మకం. హేతువాదం కూడా ఎక్కడో గాల్లోంచి పుట్టలేదు. వైజ్ఞానిక పద్ధతిలోనే పుట్టింది. ఎప్పటికప్పుడూ పరిణమిస్తూ ఉంటుంది. ప్రశ్నించే వారంతా హేతువులను కోరుతున్నట్లే లెక్క. హేతువాదానికి ఒక మతం ఉండదు. అది అన్ని మతాల్ని పరిశీలిస్తుంది. వాటి పరిణామం, పుట్టు పూర్వోత్తరాలు అన్వేషిస్తుంది.

ఎం.ఎన్. రాయ్ భావాలకు ఆకర్షితులై ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి ర్యాడికల్ హ్యూమనిస్టు ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. 1949లో భారత హేతువాద సంఘం ఏర్పాటైంది. ఆ సంఘం స్థాపన నుంచి వెంకటాద్రి అందులో సభ్యులయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం లో 1989 వరకు ఆ సంస్థ అధ్యక్షులుగా పనిచేశారు.1982నుంచీ 'హేతువాది' అనే మాసపత్రిక నడిపారు. 1988,1996ల్లో కవిరాజు త్రిపురనేని అవార్డు పొందారు. 1992లో తాపీ ధర్మారావు అవార్డును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకొన్నారు.

తెలుగు రచనలు

మార్చు
  • 1946లో ఆయన రాసిన తొలి పుస్తకం విశ్వాన్వేషణ,
  • 1949 జీవమంటే ఏమిటి?
  • 1960 హ్యూమనిస్టు ఆర్థికవిధానం,
  • 1964 భారతదేశం- గోపూజ,
  • 1976 ర్యాడికల్ హ్యూమనిజం,
  • 1977 నాస్తికత్వం- నాస్తితత్వం,
  • 1977 నాస్తికులున్నారు జాగ్రత్త,
  • 1978 హేతువాదం,
  • 1978 హేతుత్వం- మతతత్వం,
  • 1979 ఇస్లాం- ఒక అంచనా.
  • 1991 హేతువాదం -మానవవాదం
  • 2004 మనస్మృతి మైనస్ అశుద్ధం
  • 2008 ఔనా! వేదంలో అన్నీ ఉన్నాయా?
  • 2010 నాగండ్ల గ్రామ చరిత్ర ... వరకు ఎనభై పుస్తకాలు రాశారు.

ఆంగ్ల రచనలు

మార్చు
  1. Life and soul 1979
  2. Reason and unreason 1988
  3. Why rationalism? 1990
  4. Why dialectical materialism unscientific? 1991

తన 101వ యేట రావిపూడి వెంకట్రాది చీరాలలో 2023 జనవరి 21న తుదిశ్వాస విడిచాడు.[2]

లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "రావిపూడి వెంకటాద్రి: 100 ఏళ్లలో 100 పుస్తకాలు రచించిన హేతువాది". BBC News తెలుగు. 2021-02-09. Retrieved 2022-02-09.
  2. "భారత హేతువాద సంఘం ఛైర్మన్‌ వెంకటాద్రి కన్నుమూత". web.archive.org. 2023-01-22. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)