లెక్కించడానికి వీలు పడని లేదా లెక్కించ లేనని లేదా లెక్కించడానికి కష్టమైన వాటిని రాశి అని అంటారు.

జీవులుసవరించు

ఈ విశాల ప్రపంచంలో ఎన్ని రకాల జీవులున్నాయో లెక్కించ వీలుకాదు అందువలన ఈ జీవులను జీవరాశి అంటారు.

నక్షత్రాలుసవరించు

ఈ అనంత విశ్వంలో నక్షత్రాలు ఎన్నో లెక్కించడం సాధ్యం కాని పని అందువలన నక్షత్రాలను నక్షత్రరాశులు అంటారు.

ధాన్యంసవరించు

వరి ధాన్యం, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యాన్ని కుప్పగా పోసినప్పుడు వాటిని లెక్కించడం కష్టం వాటిని ధాన్యరాశులు అంటారు.

నీరుసవరించు

మహాసముద్రాలలో నీరు ఎంత ఉందో చెప్పడం కష్టం ఈ నీరును అంబురాశి అంటారు. అదే విధంగా సముద్రంలోని నీరును అంభోరాశి అంటారు.

అగ్నిసవరించు

అగ్ని ఎక్కువ ప్రాంతాన్ని అక్రమించినప్పుడు లేదా నక్షత్రాలలో మండే అగ్నిలో ఎన్ని జ్వాలలు ఉంటాయో లెక్కించలేము ఆందువలన వీటిని అగ్నిరాశులు అంటారు.


యువతిసవరించు

ఒక అవలక్షణం కూడా లేని అన్ని మంచి లక్షణాలు గల యువతిని సుగుణాలరాశి అని, అలాగే ఒక అవయవం కూడా వికారంగా లేని అంగాంగం సుందరంగా ఉండే యువతిని అందాలరాశి అని అంటారు.

ఇసుక కుప్పను ఇసుక రాశి అని, సున్నం కుప్పను సున్నపు రాశి అని, ఉప్పు కుప్పను ఉప్పురాశి అని ఇలా లెక్కించ వీలు పడని అనేక రకములను రాశులు అని అంటారు.

అన్నాదమ్ముల రాశి కథసవరించు

అన్నాదమ్ములు పక్కపక్కనే ఉన్న తమ పొలాలలో వరిని పండిస్తారు. పంట బాగా పండి ఇద్దరు ధాన్య రాశులను ఏర్పాటు చేసుకున్న తరువాత అన్న నాకు పిల్లలు లేరు నేను నా భార్యే కదా ఇంత ధాన్యం నాకెందుకులే అనుకుని కొంత ధాన్యాన్ని తమ్మునికి తెలియకుండా తమ్ముడి రాశిలో కలుపుతాడు. అలాగే తమ్ముడు అన్నకు పిల్లలు లేకపోయే నేను ఇబ్బంది పడితే సహకరించడానికి కొడుకులున్నారు అని అన్నకు తెలియకుండా కొంత ధాన్యాన్ని అన్న రాశిలో కలుపుతాడు. ఆ మరునాడు ఇద్దరు ధాన్యాన్ని ఇంటికి చేర్చడానికి ఎన్ని బస్తాలకు నింపినను ఆ ధాన్యరాశులు తరగలేదట. అప్పటినుంచి ఈ రాశులకథ అన్నాదమ్ముల రాశి కథగా చాలా ప్రాచుర్యం పొందింది.