రాహుల్ సిద్ధవినాయక్ బోంద్రే
రాహుల్ సిద్ధవినాయక్ బోంద్రే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు చిఖాలీ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాహుల్ సిద్ధవినాయక్ బోంద్రే | |||
| |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | రేఖా ఖేడేకర్ | ||
---|---|---|---|
తరువాత | శ్వేతా మహాలే | ||
నియోజకవర్గం | చిఖాలీ | ||
బుల్దానా భారత జాతీయ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
| |||
జయస్తంభ్ చౌక్ చిఖిలీ సమీపంలో జనసేవ కార్యాలయం
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాహుల్ సిద్ధవినాయక్ బోంద్రే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో చిఖాలీ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రకాష్ రుస్తుమ్‌రావ్ జవాంజల్ పై 27916 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఖబుతారే సురేశాప్ప వామనప్పాపై 14061 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాహుల్ సిద్ధవినాయక్ బోంద్రే 2019 ఎన్నికలలో చిఖాలీ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్వేతా మహాలే చేతిలో 6810 ఓట్ల తేడాతో,[3] 2024 ఎన్నికలలో 3182 ఓట్ల తేడాతో వరుసగా ఓటమి చెందాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Chikhli Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Chikhli". Election Commision of India. 23 November 2024. Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.