బహుమతి (రివార్డ్)

(రివార్డ్ నుండి దారిమార్పు చెందింది)

ఒక పనిపై బాధ్యత లేని వారి యొక్క సహాయాన్ని తీసుకొని సంబంధిత పనిని పూర్తి చేయడానికి సంబంధిత పనిని పూర్తి చేసిన వారికి ముందుగానే ప్రకటించే నగదు బహుమతిని లేక బహుమానంను రివార్డ్ అంటారు.

Taliban bounty flyer

అవార్డ్, రివార్డ్ మార్చు

ప్రముఖ అవార్డ్ లను ఇచ్చే వారు అవార్డ్తో పాటు రివార్డ్ ను కూడా ఇస్తున్నారు. రివార్డ్ బ్రతకడానికి ఉపయోగపడితే అవార్డ్ చనిపోయిన తరువాత కూడా కీర్తి రూపంలో బ్రతికిస్తుందని ఎక్కువగా అవార్డ్ కోసం ప్రయత్నిస్తుంటారు. అందువలన అవార్డ్ సాధించిన వారికి మరింత అంకిత భావంతో పనిచేయడానికి మరికొన్ని అవార్డ్ లు పొందడానికి అవకాశాన్ని కల్పించే రివార్డ్ ను కూడా అందజేస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించే రివార్డులు మార్చు

వ్యక్తిగత రివార్డులు మార్చు

నల్లధనం పట్టించినందుకు మార్చు

అక్రమ రవాణా చేసేవారిని పట్టించినందుకు మార్చు

స్మగ్లింగ్ చేస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ ప్రభుత్వం పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికి దొరకక పోతే ప్రజల సహకారం తీసుకొని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నవారికి లేదా ఆచూకి ఇచ్చిన వారికి రివార్డ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఉదాహరణకు అడవులలో ప్రభుత్వానికి సంబంధించిన గంధం, ఎర్రచందనం వంటి చెట్లను అక్రమంగా నరికి అక్రమ రవాణా చేసి అమ్ముకుంటారు. ఇటువంటి వారిని పట్టుకోవడానికి అటవీశాఖకు సంబంధించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు రివార్డ్ ప్రకటించి ప్రజల సహకారం తీసుకుంటారు.

సమాజ ద్రోహులను పట్టించినందుకు మార్చు

కొందరు ఆరాచక శక్తులు సమాజంలో అలర్లు సృష్టిస్తూ ప్రభుత్వ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నప్పుడు వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం తరుపున పోలీసువారు ఈ ఆరాచకవాదులను పట్టించిన వారికి రివార్డ్ ప్రకటిస్తారు.

దేశ ద్రోహులను పట్టించినందుకు మార్చు

కంప్యూటర్ వైరస్ సృష్టించే వారిని పట్టించినందుకు మార్చు

కొందరు కంప్యూటర్ వైరస్ ను సృష్టించి దాని ద్వారా ఇతరుల కంప్యూటర్లు సరిగ్గా పనిచేయకుండా చేస్తూ అవతల వ్యక్తి కంప్యూటర్ లోని సమాచారాన్ని సేకరించి అవతల వారిని నష్టపరుస్తుంటారు. ఈ విధమైన నష్టానికి గురవున్న కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు కంప్యూటర్ వైరస్ సృష్టిస్తున్న వారిని పట్టించిన వారికి రివార్డ్ ఇస్తామని ప్రకటిస్తారు.

పైరస్ సి.డి లు పట్టించినందుకు మార్చు

భూగర్భంలో దొరికిన పురాతన నిధిని అందజేసినప్పుడు మార్చు

భూగర్భంలో ఎవరికి తెలియకుండా దాచి ఉంచిన పురాతన సంపద ప్రభుత్వ లేదా వ్యక్తిగత స్థలాలలో ఎక్కడ దొరికినను దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వ్యక్తిగత భూములలో దొరికిన పురాతన సంపదను ఆ దొరికిన వ్యక్తి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందజేసినప్పుడు పురాతన సంపదను అందజేసిన వ్యక్తికి ఆ పురాతన సంపద విలువలో కొంత శాతాన్ని ప్రభుత్వం అతని నిజాయితికి మెచ్చుకొని ఇస్తుంది.

ఇవి కూడా చూడండి మార్చు

అవార్డ్

బయటి లింకులు మార్చు