ప్రధాన మెనూను తెరువు

రీబాక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది జర్మనీ క్రీడా వస్తువుల తయారీ దిగ్గజం అడిడాస్ యొక్క అనుబంధ సంస్థ. ఇది క్రీడా సంబంధ కాలిజోళ్లు, దుస్తులు మరియు ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. దక్షిణాఫ్రికా శ్వేతవర్ణ ప్రజలు ఉపయోగించే ర్హీబాక్ అనే ఉచ్ఛారణ నుంచి ఈ పేరు ఉద్భవించింది. ర్హీబాక్ అనేది ఒక రకమైన ఆఫ్రికా జింక లేదా దుప్పి. 1890లో ఇంగ్లాండ్‌లోని బోల్టన్‌ పట్టణానికి 6 మైళ్ల దూరంలో ఉన్న కుగ్రామం హోల్‌కోంబ్ బ్రూక్‌లో సాధారణ రన్నింగ్ కాలిజోళ్లను రూపొందించే జోసెఫ్ విలియం ఫోస్టర్‌కు శంకువు తరహాలో రన్నింగ్ కాలిజోళ్లను తయారు చేయాలనే వినూత్న ఆలోచన తట్టింది. అతని ఆలోచనలు సత్ఫలితాలివ్వడంతో అతను తన కుమారులతో జతకట్టి, J.W. ఫోస్టర్ అండ్ సన్స్ పేరుతో 1895లో సొంతంగా ఒక కాలిజోళ్ల తయారీ కంపెనీని ప్రారంభించాడు.[2]

Reebok International Limited
తరహాSubsidiary of Adidas AG[1]
స్థాపనBolton, England (1895)
ప్రధానకేంద్రముCanton, Massachusetts, U.S.[1]
Bolton, United Kingdom[1]
పరిశ్రమSportswear and Sports Goods
ఉత్పత్తులుFootwear
Accessories
Sportswear
నినాదముI Am What I Am
వెబ్ సైటుhttp://www.reebok.com
దస్త్రం:Reebokworldheadquarters.jpg
క్యాంటన్‌లోని రీబాక్ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్ (జూమ్ లెన్స్‌ను ఉపయోగించి ప్రభుత్వ రహదారి నుంచి వీక్షించబడింది)

1924 నాటి కల్లా ఫోస్టర్ అండ్ సన్స్ అత్యుత్తమ కాలిజోళ్ల తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. తద్వారా 1924 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు రన్నింగ్ కాలిజోళ్లను తయారు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఫోస్టర్ కాలిజోళ్లను వాడిన పరుగువీరుల్లో హరోల్డ్ అబ్రహమ్స్ మరియు ఎరిక్ లిడెల్ ఉన్నారు. వీరిద్దరూ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఛారియట్స్ ఆఫ్ ఫైర్ చిత్రంలో నటించారు.

అత్యుత్తమ నాణ్యతతో కాలిజోళ్ల తయారీని చేపట్టాలన్న విషయాన్ని ఫోస్టర్ నుంచి అందిపుచ్చుకున్న అతని మనవళ్లు జో మరియు జెఫ్ ఫోస్టర్‌లు మెర్క్యురీ స్పోర్ట్స్‌ను ఆవిష్కరించారు. 1960లో జో మరియు జెఫ్ ఫోస్టర్ ఇంగ్లాండ్‌లోని తమ కంపెనీ పేరును రీబాక్‌ గా మార్చారు. చిన్నతనంలో ఒక పరుగు పందెంలో నెగ్గిన జో ఫోస్టర్ నిఘంటువులోని పేరు ఆధారంగా తమ కంపెనీకి అలా నామకరణం చేశాడు. సదరు నిఘంటువు దక్షిణాఫ్రికా ముద్రణకు చెందినది కావడంతో పేరును ఆ విధంగా ఎంపిక చేయడం జరిగింది.[3]

1979లో అమెరికా సంయుక్తరాష్ట్రాలకు సంబంధించిన శిబిరాలకు సరంజామాను పంపిణీ చేసే పాల్ B. ఫైర్‌మన్ ఒక అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో జత రీబాక్ కాలిజోళ్లను చూశాడు. వాటిని ఉత్తర అమెరికాలో విక్రయించడానికి చర్చలు జరిపాడు. ఇతర పోటీదారులైన నైక్, అడిడాస్ మరియు పూమా కంపెనీల కంటే అవి ఎక్కువ ధర కలిగినప్పటికీ, అక్కడ అవి అధికంగా అమ్ముడయ్యాయి.

విషయ సూచిక

ఫ్రీస్టైల్ మరియు ఎక్స్-ఓ-ఫిట్ విజయంసవరించు

1982లో ఫ్రీస్టైల్ క్రీడా సంబంధ కాలిజోడు విడుదలతో రీబాక్ పేరు మరింత ఇనుమడించింది. ఏరోబిక్స్‌కు ఆదరణ పెరగడం ద్వారా, మహిళల కోసం తయారు చేసిన దానికి మరింత ప్రాచుర్యం లభించింది. ప్రీస్టైల్ క్రీడా సంబంధ కాలిజోడుగా మాత్రమే కాక సాధారణ కాలిజోడుగా కూడా ఆదరణ పొందింది. ఫలితంగా 1980 దశకాల్లో హై-టాప్ రకాల (పై భాగంలో రెండు వెల్క్రో (నైలాన్ వస్త్రం) పట్టీలు సహా) ఫ్యాషన్ దృశ్యానికి మరియు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు మరియు నీలం సహా రంగులకు ఫ్రీస్టైల్ ఒక ఐకాన్‌గా అవతరించింది. క్రీడా సంబరాల్లో చీర్‌లీడర్లకు, ఏరోబిక్ నృత్యానికి, జిమ్ మరియు వినియోగదారుల్లో విపరీతమైన ఆదరణ పొందడంతో ఫ్రీస్టైల్‌ ఉత్పత్తిని రీబాక్ కొనసాగించింది.

ఫ్రీస్టైల్ విజయం నేపథ్యంలో రీబాక్ పురుషులకు ఎక్స్-ఓ-ఫిట్ పేరుతో ఒక క్రీడా సంబంధ కాలిజోడును ఆవిష్కరించింది. ఫ్రీస్టైల్ మాదిరిగానే ఇది కూడా లో-టాప్ మరియు హై-టాప్ అనే రెండు రకాలుగా విడుదలయింది. అయితే మూసివేయడానికి వీలుగా రెండు వెల్క్రో పట్టీలను కలిగిన ఫ్రీస్టైల్ హై-టాప్ మాదిరిగా కాక ఎక్స్-ఓ-ఫిట్‌ ఒక్క పట్టీ మాత్రమే కలిగి ఉంది. దీని ఒకానొక ప్రప్రథమ రూపకర్తల్లో వ్యవస్థాపకుడి తనయుడు డేవిడ్ ఫోస్టర్ ఒకడు.[4]

మానవ హక్కులు మరియు ఉత్పత్తి వివరాలుసవరించు

 
రీబాక్ హెడ్‌క్వార్టర్స్ వద్ద సుస్వాగత చిహ్నం

రీబాక్ గతంలో స్వేద కర్మాగారాల ద్వారా అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాలు నిర్వహించేది. అయితే ఇప్పుడు మానవ హక్కులకు కట్టుబడి ఉన్నానని ఉద్ఘాటిస్తోంది. ఏప్రిల్, 2004లో రీబాక్ కాలిజోళ్ల విభాగం ఫెయిర్ లేబర్ అసోసియేషన్ చేత గుర్తింపు పొందిన తొలి కంపెనీగా అవతరించింది. అంతేకాక 2004లో వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మికుల స్థితిగతుల పురోభివృద్ధి కోసం పనిచేసే లాభాపేక్షరహిత సంస్థ ఫెయిర్ ఫ్యాక్టరీస్ క్లియరింగ్‌హౌస్ వ్యవస్థాపక సభ్య కంపెనీగా కూడా రీబాక్ అవతరించింది.

మే, 2007 నాటికి రీబాక్ వెబ్‍‌సైటు ప్రకారం పంపిణీదారు సమాచారం:

"కాలిజోడు రీబాక్‌కు 14 దేశాల్లో కాలిజోళ్ల తయారీ ఫ్యాక్టరీలున్నాయి. రీబాక్ కాలిజోళ్లను తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు ఎక్కువగా ఆసియాలోనే ఉన్నాయి. వాటిలో ప్రాథమికంగా చైనా (మొత్తం కాలిజోళ్ల ఉత్పత్తిలో 51%), ఇండోనేషియా (21%), వియత్నా (17%) మరియు థాయ్‌లాండ్ (7%). 75,000 మంది కార్మికులతో 11 ఫ్యాక్టరీలు 88% రీబాక్ కాలిజోళ్లను తయారు చేస్తున్నాయి.

"దుస్తులు రీబాక్ కంపెనీకి 45 దేశాల్లో ఫ్యాక్టరీలున్నాయి. పంపిణీదారుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రాంతం వారీగా నిర్వహించబడుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువగా విక్రయించబడుతున్న దుస్తుల్లో ఎక్కువగా (52%) ఆసియాలో ఉత్పత్తవుతున్నవే. మిగిలింది కరీబియన్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా మరియు మధ్య ప్రాశ్చ దేశాల నుంచి వస్తోంది. ఐరోపాలో విక్రయించబడుతున్న దుస్తులు ఆసియా మరియు ఐరోపా నుంచి సమకూరుతున్నవేనని ఆనవాలుగా తెలుస్తోంది. ఇక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమ్ముడవుతున్న దుస్తులు ఆసియా ప్రాంతానికి చెందిన తయారీదారులు ఉత్పత్తి చేస్తున్నవిగా చెప్పబడుతోంది.

రీబాక్ ప్రచారోద్యమాల జాబితాసవరించు

రీబాక్ వాణిజ్య ప్రచారాలు

 • "ప్లానెట్ రీబాక్"
 • "అయామ్, వాట్ అయామ్"
 • "రన్ ఈజీ"
 • "బికాజ్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్పెక్టేటర్ స్పోర్ట్"
 • "హూడన్‌ఇట్?"
 • "పంప్ అప్, ఎయిర్ అవుట్" '''
 • "యువర్ మూవ్"
 • "టెర్రీ టేట్ : ఆఫీస్ లైన్‌బ్యాకర్"
 • "ఈజీటోన్"

వాణిజ్య ప్రకటనలుసవరించు

ఉత్తర అమెరికాసవరించు

2002 నుంచి నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) (NFL ఎక్విప్‌మెంట్‌‌గా ముద్రించబడింది), 2004 నుంచి కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్ (CFL) జట్ల ప్రామాణిక మరియు ప్రతిరూప యూనిఫాం జెర్సీలు మరియు సైడ్‌లైన్ దుస్తుల తయారీ మరియు మార్కెటింగ్‌కు సంబంధించిన ప్రత్యేక హక్కులను రీబాక్ కంపెనీ దక్కించుకుంది. అంతేకాక NFL మరియు మేజర్ లీగ్ బేస్‌బాల్ (MLB)కు కూడా ఈ కంపెనీ అధికారిక కాలిజోళ్ల పంపిణీదారు.

2008–09 సీజన్‌లో మెక్సికో క్లబ్ చివాస్ గ్వాడలజరా; బ్రెజిల్ క్లబ్‌లు క్రూజీరో, ఇంటర్నేసనల్ మరియు సెయింట్ పాల్ FCలతో రీబాక్ స్పాన్సర్‌షిప్‌లను కూడా కలిగి ఉంది.

CCMసవరించు

దస్త్రం:Reebok SC87 logo.svg
రీబాక్‌చే సిడ్నీ క్రాస్బీ Rbk SC87 లైన్ లోగో

అంతేకాక 2004లో నేషనల్ హాకీ లీగ్ (NHL) అధికారిక పోషక సంస్థ CCMను కైవసం చేసుకున్న రీబాక్ ప్రస్తుతం CCM మరియు రీబాక్ బ్రాండ్లతో ఐస్ హాకీ ఎక్విప్‌మెంట్‌ను రూపొందిస్తోంది. వాణిజ్య ప్రకటనల ప్రచారానికి ప్రముఖ యువ తారలు సిడ్నీ క్రాస్బీ (రీబాక్) మరియు అలెగ్జాండర్ ఓపెచ్‌కిన్ (CCM)లతో ఒప్పందాలు చేసుకుంది. ఇటీవల కాలంలో NHL ప్రామాణిక మరియు ప్రతిరూప జెర్సీలపై CCM పేరును రీబాక్ తొలగించింది. 2005 నుంచి రీబాక్ లోగో మాత్రమే వాడబడుతోంది.

ఐరోపాసవరించు

బోల్టన్ వాండరర్స్ అనే ఒక ప్రముఖ ఫుట్‌బాల్ (సాకర్) క్లబ్‌తో సుదీర్ఘ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ద్వారా రీబాక్ కంపెనీ ఇంగ్లాండ్‌లోని తమ ఆరంభ సంస్థలతో సంబంధాలను కొనసాగిస్తోంది. 1990 దశకాల అంతిమంలో జట్టు బదిలీయైన సరికొత్త క్రీడా మైదానానికి రీబాక్ స్టేడియంగా నామకరణం చేయబడింది. అడిడాస్ కొనుగోలు చేసేంత వరకు వివిధ ఇతర ఇంగ్లీష్ క్లబ్‌లు రీబాక్ స్పాన్సర్‌షిప్‌ను కలిగి ఉండేవి. ఆ తర్వాత పలు క్లబ్‌లు ప్రధాన బ్రాండ్ (ఫుట్‌బాల్‌లో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది)కి మారడం గానీ లేదా మరో కంపెనీతో పూర్తిగా కలిసిపోవడం గానీ జరిగింది.

2008లో సిక్స్ నేషన్స్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్‌శ్లామ్‌ను నెగ్గిన రగ్బీ యూనియన్‌లోని వేల్స్ నేషనల్ టీమ్ మరియు న్యూజిలాండ్ దేశవాళీ పోటీ ఎయిర్ న్యూజిలాండ్ కప్‌లో పాల్గొన్న తస్మాన్ మాకోస్ జట్టుకు రీబాక్ పోషణ సంస్థగా వ్యవహరించింది.

2006లో FC బార్సిలోనా మరియు ఫ్రాన్స్ స్ట్రయికర్ థియర్రీ హెన్రీ (అప్పట్లో ఆర్సెనల్ తరపున ఆడాడు) "అయామ్ వాట్ అయామ్" ప్రచారంలో పాల్గొనడానికి 1 ఆగస్టు 2006న ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. రియాన్ గిగ్స్ కూడా "అయామ్ వాట్ అయామ్" వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నాడు. అలాగే ఆగస్టు 1న ఆండ్రీ షెవ్‌చెంకో కంపెనీతో వాణిజ్య ప్రకటన ఒప్పందం కుదుర్చుకున్నాడు.[5]

ఆస్ట్రేలియాసవరించు

2005లో మొత్తం ఎనిమిది దేశవాళీ జట్ల యొక్క దుస్తుల రూపకల్పన మరియు పంపిణీ అలాగే ఆస్ట్రేలియా A-లీగ్ పోటీ దుస్తులకు సంబంధించి రీబాక్ ఒక ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఒక ఖరీదైన ఒప్పందం కానప్పటికీ, ఫుట్‌బాల్‌కు మరియు ఆ ప్రాంతంలోని లీగ్‌కు నానాటికి పెరుగుతున్న ఆదరణ కారణంగా ఈ భాగస్వామ్యం ద్వారా రీబాక్ డివిడెండ్లను పొందుతోంది. ఆస్ట్రేలియాలో 125,000 జెర్సీలను విక్రయించినట్లు అంచనా. ఒక క్రీడా వస్తువుల తయారీ కంపెనీకి ఒక ఏడాదిలో ఒక్క లీగ్ అమ్మకాల పరంగా ఇదొక రికార్డు.[6]

ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్‌లోని ఫ్రిమేంటిల్ ఫుట్‌బాల్ క్లబ్, మెల్బోర్న్ ఫుట్‌బాల్ క్లబ్, పోర్ట్ అడిలైడ్ ఫుట్‌బాల్ క్లబ్ మరియు రిచ్‌మండ్ ఫుట్‌బాల్ క్లబ్ అనే నాలుగు జట్లకు రీబాక్ పోషక సంస్థగా వ్యవహరించింది. చివరి రెండు క్లబ్‌ల సంబంధం 2007 సీజన్ నుంచి ప్రారంభమైంది. అంతేకాక ప్రస్తుతం TAC కప్లో తలపడుతున్న గోల్డ్ కోస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ను కూడా రీబాక్ స్పాన్సర్ చేస్తోంది. అది 2011లో AFLలో ప్రవేశించనుంది. మెల్బోర్న్ స్టార్మ్, మ్యాన్లీ సీ ఈగిల్స్ మరియు గోల్డ్ కోస్ట్ టైటాన్స్ అనే రగ్బీ లీగ్ జట్లకు క్లబ్ యొక్క క్రీడా సామగ్రి మరియు ఇతర వస్తువులను రీబాక్ పంపిణీ చేస్తోంది.

 
బేసెల్‌లో రీబాక్ ప్రకటన

భారతదేశంసవరించు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్,రాజస్తాన్ రాయల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ మరియు దెక్కన్ చార్జర్స్ జట్లకు 2008లో జరిగిన తొలి ఎడిషన్‌కు రీబాక్ క్రీడా సామగ్రిని అందించింది. అయితే 2009లో నిర్వహించిన రెండో ఎడిషన్‌కు వచ్చేసరికి రీబాక్ స్పాన్సర్‌షిప్ 4 జట్లకు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్,కింగ్స్ XI పంజాబ్) మాత్రమే పరిమితమైంది.

అంతర్జాతీయ క్రికెట్సవరించు

అంతర్జాతీయ క్రికెట్ మండలికి రీబాక్ అధికారిక స్పాన్సర్ (సమర్పక సంస్థ). ICC అంపైర్లు మరియు రిఫరీల అంతర్జాతీయ ప్యానెల్ యూనిఫామ్‌లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. అంతేకాక వికెట్లు వంటి ICC ఈవెంట్లుకు వాడే అన్ని క్రీడా వస్తువులను రీబాక్ అందిస్తోంది. 2007లో ICC అధికారిక స్పాన్సర్‌గా రీబాక్ అవతరించింది.

శ్రీలంక జట్టు కెప్టెన్ మహేల జయవర్థనే, శ్రీలంక క్రికెటర్లు సనత్ జయసూర్య, అజంతా మెండిస్, భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ మరియు రాహుల్ ద్రావిడ్, బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మద్ అష్రాఫుల్, బంగ్లాదేశ్ క్రికెటర్లు మహ్మద్ రఫిఖ్ మరియు హబీబుల్ బషర్ వంటి అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లు రీబాక్‌కు ప్రచారం చేస్తున్నారు. రీబాక్ కంపెనీ వారికి క్రికెట్ షూలను అందిస్తోంది. ధోనీ విషయానికొస్తే, రీబాక్ బ్రాండ్‌ను ముద్రించిన క్రికెట్ బ్యాట్‌లు అందించబడుతున్నాయి.ఆ జాబితాలో ఇటీవల చేరిన క్రికెటర్లు యువరాజ్ సింగ్ మరియు యూసఫ్ పఠాన్.

క్రీడేతరాలుసవరించు

ర్యాపర్ జయ్-Z రీబాక్ నుంచి సిగ్నేచర్ షూను అందుకున్న మొట్టమొదటి క్రీడేతరుడు. "S. కార్టర్ కలెక్షన్ బై Rbk" 21 నవంబరు 2003న ప్రారంభమయింది. S. కార్టర్ స్నీకర్ (జిమ్ షూ) కంపెనీ చరిత్రలోనే శరవేగంగా విక్రయించబడిన కాలిజోడుగా అవతరించింది.[7] తర్వాత G-యూనిట్ స్నీకర్ల సముదాయాన్ని విడుదల చేయడానికి ర్యాపర్ 50 సెంట్తో రీబాక్ ఒప్పందం కుదుర్చుకుంది. నెల్లీ మరియు మిరి బెన్-ఆరి వంటి ఆర్టిస్టులు కంపెనీ యొక్క ప్రతినిధులయ్యారు. స్కార్లెట్ జోహన్సన్తోనూ రీబాక్ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా Rbk లైఫ్‌స్టైల్ కలెక్షన్గా పేర్కొనే స్కార్లెట్ హార్ట్స్ పేరుతో ఆమె సొంత దుస్తులు మరియు కాలిజోళ్లు విడుదలయ్యాయి.

స్పాన్సర్ చేయబడిన క్రీడాకారులుసవరించు

గతంలో స్పాన్సర్ చేయబడిన క్రీడాకారులుసవరించు

ఆస్ట్రేలియా ఫుట్‌బాల్సవరించు

రీబాక్ తయారీ క్రీడాసామగ్రి వాడుతున్న క్రికెట్ జట్లు/క్లబ్‌లుసవరించు

2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్సవరించు

 • [19] రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
 • [21] చెన్నయ్ సూపర్ కింగ్స్
 • [24] కోల్‌కతా నైట్‌రైడర్స్
 • [25] రాజస్తాన్ రాయల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2009సవరించు

 • [19] రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
 • [23] కింగ్స్ XI పంజాబ్
 • [21] చెన్నయ్ సూపర్ కింగ్స్
 • [24] కోల్‌కతా నైట్‌రైడర్స్

రీబాక్ క్రీడాసామగ్రి ఉపయోగిస్తున్న అనుబంధ ఫుట్‌బాల్ క్లబ్‌లు/లీగ్‌లుసవరించు

ఐరోపాసవరించు
ఆఫ్రికాసవరించు
ఆసియా/ఓషనియాసవరించు
ఉత్తర అమెరికాసవరించు
సెంట్రల్ అమెరికాసవరించు
దక్షిణ అమెరికాసవరించు

నేషనల్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్లుసవరించు

రగ్బీ లీగ్సవరించు

రగ్బీ యూనియన్సవరించు

కళాశాలలుసవరించు

 •   బోస్టన్ కాలేజ్ - 2010-2011 అథ్లెటిక్ సీజన్లలో అండర్ ఆర్మర్ కంపెనీ క్రీడా దుస్తులను వాడబోతున్నట్లు బోస్టన్ కాలేజ్ 1 డిసెంబరు 2009న ప్రకటించింది.

గతంలో స్పాన్సర్ చేయబడిన U.S. కళాశాలలుసవరించు

గతంలో స్పాన్సర్ చేయబడిన మేజర్ లీగ్ సాకర్ క్లబ్‌లుసవరించు

గతంలో స్పాన్సర్ చేయబడిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్‌లుసవరించు

ప్రొఫెషనల్ స్పోర్టింగ్ లీగ్స్ గత స్పాన్సర్‌షిప్‌లుసవరించు

రీబాక్ స్పాన్సర్ చేసిన గత జాతీయ జట్లుసవరించు

రీబాక్ ఇతర స్పాన్సర్‌షిప్‌లుసవరించు

ఇటీవలి సమాచారంసవరించు

 • 2009లో మహిళల ఫిట్‌నెస్‌‌ను దృష్టిలో పెట్టుకుని రీబాక్ కంపెనీ జిమ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించిన JUKARI ఫిట్ టు ఫ్లైను విడుదల చేసింది. రీబాక్‌ మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ సర్క్యూ డు సోలిల్ మధ్య సుదీర్ఘ సంబంధాల ఫలితంగా JUKARI అవతరించింది. ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లైసెట్ అని పిలవబడే జిమ్ సాధనం హృదయ, పటుత్వ, తుల్య మరియు మూలాంశ శిక్షణ ద్వారా దేహాన్ని పటిష్ఠంగా మరియు విశాలంగా చేయడం ద్వారా ఎగురుతున్న అనుభూతిని ఇస్తుంది. హాంకాంగ్, మెక్సికో నగరం, మ్యాడ్రిడ్, లండన్, క్రాకో, మ్యూనిచ్, సియోల్, కౌలాలంపూర్, బ్యూనస్ ఎయిర్స్, శాంటియాగో, మాంట్రియల్, లాస్‌ఏంజిల్స్, బోస్టన్ మరియు న్యూయార్క్ సహా ప్రపంచంలోని పద్నాలుగు నగరాల్లో ఉన్న ప్రధాన జిమ్ సాధనా కేంద్రాల్లో JUKARI విడుదలయింది. JUKARI ఫిట్ టు ఫ్లైకి లభించిన అనూహ్య ఆదరణ నేపథ్యంలో మూవ్ మరియు రీబాక్-సర్క్యూ డు సోలిల్ కలెక్షన్ పేర్లతో మహిళల ఫిట్‌నెస్ దుస్తులు మరియు కాలిజోళ్లను రీబాక్ విడుదల చేసింది. JUKARI ఫిట్ టు ఫ్లైని యోగా సాధన మొదలుకుని టెన్నిస్ క్రీడను ఆడేవారు కూడా ధరించవచ్చు. ఇఅన్నీ కూడా మహిళల శరీర కదలికలపై అత్యంత అవగాహన మరియు అనుభవంతో రూపొందిచబడ్డాయి.
 • రీబాక్ 2009లో ఈజీటోన్ పేరుతో కాలిజోళ్లను విడుదల చేసింది. వినియోగదారులు వాటిని "జిమ్‌కు వెళ్లేటప్పుడు తమ వెంట తీసుకెళ్లొచ్చు." ఈజీటోన్‌లో మడమ మరియు ముందరికాలు భాగంలో రెండు బ్యాలెన్స్ పాడ్స్ ఉంటాయి. అవి ప్రతి అడుగుకు ఒక సహజమైన అస్థిరతను కలుగజేస్తాయి. ఇది కండరాలు తరంగాన్ని అనుసరించడం మరియు అభివృద్ధి చేసుకునే విధంగా చేస్తుందని రీబాక్ పేర్కొంటోంది.
 • ఏప్రిల్, 2008లో UK మరియు ఫ్రాన్స్‌ దేశాల్లో రీబాక్ తన ఆన్‌లైన్ స్టోర్‌ను ఆవిష్కరించింది.[1] జనవరి, 2009లో ఈ స్టోర్‌ను జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం మరియు ఐర్లాండ్‌లకు రీబాక్ విస్తరించింది. అంతేకాక సొంతంగా రీబాక్‌ల రూపకల్పనకు యువర్‌రీబాక్‌ను ఆవిష్కరించింది.[2]
 • 2008-09 సీజన్‌కు నేషనల్ హాకీ లీగ్ ఆటగాళ్ల కోసం రీబాక్ ఎడ్జ్ 2 యూనిఫామ్ సిస్టమ్‌ను రీబాక్ రూపొందించింది. ఈ జెర్సీని లీగ్ అంగీకరించడంతో అన్ని జట్లు తమ హోమ్ అండ్ అవే జెర్సీలు కొత్త జెర్సీ స్టైల్‌నే అనుసరిస్తున్నాయి.
 • జూలై, 2007లో డాడీ యాంకీ యొక్క కొత్త ఆల్బమ్‌తో కలిసి రీబాక్ తన లైఫ్‌స్టైల్ ఫుట్‌వేర్ కలెక్షన్‌ను ప్రారంభించింది. డిసెంబరు, 2007లో భారతీయ ఫుట్‌బాల్ చిత్రం ధన్ ధనా ధన్ గోల్ విడుదల సందర్భంగా గోల్ కలెక్షన్‌ను రీబాక్ ఆవిష్కరించింది.
 • జూన్, 2007లో తమ ప్రచారకర్తల్లో ఒకరుగా స్కార్లెట్ జోహన్సన్‌ను రీబాక్ ప్రకటించింది. భారత విఫణిని లక్ష్యంగా చేసుకుని రీబాక్ విడుదల చేసిన ఫ్యాషన్-పురోగామి మరియు అథ్లెటిక్-ప్రేరేపిత కాలిజోళ్ల కలెక్షన్ స్కార్లెట్ 'హార్ట్స్' Rbk"కు జోహన్సన్ ప్రచారం చేసింది.
 • 2007/08 సీజన్‌కు రీబాక్ ఎడ్జ్ పేరుతో రీబాక్ కంపెనీ రూపకల్పన చేసి, తయారు చేసిన ఒక సరికొత్త యూనిఫామ్ సిస్టమ్‌ను నేషనల్ హాకీ లీగ్ లీగ్ వారీగా ప్రవేశపెట్టింది. కొత్త దుస్తులు సహా ఈ కొత్త యూనిఫామ్‌లు నీరు మరియు స్వేదాన్ని సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా దూరం చేస్తాయి. దీనిపై పలువురు క్రీడాకారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే కొందరు మాత్రం ఎడ్జ్ సిస్టమ్ మెరుగుపరిచిన నీటిని వికర్షించే సమర్థతల వల్ల చేతి తొడుగులు మరియు స్కోట్‌లు తడిసిపోయి ఆడేటప్పుడు అసౌకర్యానికి గురవుతున్నామని తెలిపారు.
 • 2006 ఆఖర్లో రీబాక్ దుస్తులు ధరించిన 2005 UEFA చాంపియన్స్ లీగ్ విజేత లివర్‌పూల్ FC మరియు రీబాక్ మధ్య కోర్టు కేసు మొదలయింది. కార్ల్స్‌బర్గ్ స్పాన్సర్‌షిప్ ఒప్పంద పునరుద్ధరణ విషయంలో కాలయాపన చేయడం ద్వారా లివర్‌పూల్ తమకు £7 మిలియన్ నష్టం కలిగించిందని రీబాక్ ఆరోపించింది. అంటే 2005/06 సీజన్‌కు అవే షర్ట్ (దానికి రీబాక్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఆఖరి దుస్తులు) విడుదలలో జాప్యం జరిగిందని దానర్థం. అది ఎట్టకేలకు విడుదలయింది. అయితే అది చూడటానికి 2003/04 సీజన్‌ అవే షర్ట్ మాదిరిగానే ఉంది. రీబాక్‌ను అడిడాస్ హస్తగతం చేసుకున్న నేపథ్యంలో లివర్‌పూల్ తమ అధికారిక దుస్తుల కోసం అడిడాస్ను సంప్రతించడం జరిగింది.
 • నవంబరు, 2006లో జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం మరియు మహిళల జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం తమ ప్రామాణిక మరియు ప్రతిరూప జెర్సీల కోసం రీబాక్ నుంచి అడిడాస్‌కు మళ్లాయి. ఎందుకంటే ఉత్తర అమెరికా మరియు UK వెలుపల దానికి విశేష గుర్తింపు ఉండటమే.
 • అక్టోబరు, 2006లో అయామ్ వాట్ అయామ్ పేరుతో స్పెయిన్ అధికారిక భాష స్పానిష్‌లో రీబాక్ తన తొలి బ్లాగును ప్రారంభించింది.
 • 23 మార్చి 2006న అధిక ప్రమాణంలో సీసంను కలిగిన 300,000 బ్రాస్లెట్లను రీబాక్ వెనక్కు తీసుకుంది. ఈ బ్రాస్లెట్ చివర భాగాన వేలాడే హృదయం గురుతు ఒకటి ఉంటుంది. అది కూడా "రీబాక్" పేరుతోనే రూపొందించబడింది. దానిని మింగిన 4 ఏళ్ల శిశువు అందులోని సీసపు విషప్రయోగం వల్ల మరణించింది.
 • ఆగస్టు, 2005లో కంపెనీ అతిపెద్ద పోటీదారుల్లో ఒకటైన అడిడాస్ $3.8 బిలియన్లకు రీబాక్‌ను హస్తగతం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద తంతు జనవరి, 2006లో పూర్తయింది.[8]

సూచనలుసవరించు

 1. 1.0 1.1 1.2 Our Brands - adidas group
 2. రీబాక్ కాలిజోళ్లు
 3. రీబాక్ గురించి
 4. "About Reebok". Reebok International Limited is a British producer of athletic footwear, apparel, and accessories and is currently a subsidiary of Adidas!. The name comes from Afrikaans/Dutch spelling of rhebok, a type of African antelope or gazelle. The company, founded in 1895, was originally called Mercury Sports but was renamed Reebok in 1960. The company's founders, Joe and Jeff Foster, found the name in a dictionary won in a race by Joe Foster as a boy; the dictionary was a South African edition, hence the spelling. Cite web requires |website= (help)
 5. "Announcement of Shevchenko signs a deal with Rbk". Cite web requires |website= (help)
 6. "Reebok signs a deal with A-League". Cite web requires |website= (help)
 7. "S.Carter the fastest selling Reebok shoe". Cite web requires |website= (help)
 8. http://www.dw-world.de/dw/article/0,,1870303,00.html

బాహ్య వలయాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రీబాక్&oldid=2210252" నుండి వెలికితీశారు