రెహనా సుల్తాన్
హిందీ సినిమా నటి.
రెహనా సుల్తాన్ (జననం 19 నవంబరు 1950) హిందీ సినిమా నటి. 1970లో వచ్చిన దస్తక్ సినిమాలో తొలిసారిగా నటించి గుర్తింపు పొందడమేకాకుండా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) లో గ్రాడ్యుయేట్ చేసిన రెహనా, చేత్నా (1970) సినిమాలో చేసిన పాత్రతో కూడా గుర్తింపు పొందింది.[1][2][3] "నా సినిమాల్లోని శృంగార సన్నివేశాలు బలవంతంగా చేసినవి కాదు, కథనంలో భాగంగానే వాటిని చేశాను. కానీ, ప్రస్తుతం అటువంటి దృశ్యాలు వాణిజ్య కారణాల కోసమే ఉపయోగించబడుతున్నాయని నేను భావిస్తున్నాను" అని ఆమె పేర్కొంది.[4]
రెహనా సుల్తాన్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1970-1992 |
జీవిత భాగస్వామి | బి.ఆర్. ఇషారా |
పురస్కారాలు | ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం, 1971 |
జీవిత విషయాలు
మార్చురెహనా 1950, నవంబరు 19న అలహాబాదులో జన్మించింది.[5]
అవార్డులు
మార్చు- 1970 - దస్తక్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం[6]
- 1972 - చేత్న సినిమాకు ఉత్తమ నటిగా బి.ఎఫ్.జె.ఎ అవార్డు
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1970 | చేత్నా | సీమ | |
దస్తక్ | సల్మా అహ్మద్ | ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారం | |
1971 | పడోసి | ||
మ్యాన్ తేరా టాన్ మేరా | |||
1972 | తన్హై | ||
సవేరా | |||
మన్ జైయే | సుమన్ | ||
హర్ జీత్ | కమల్ | ||
1973 | ప్రేమ్ పర్బాట్ | ||
దిల్ కి రహెన్ | |||
బడా కబూతర్ | రీటా | ||
1974 | అల్బెలి | ||
ఖోట్టే సిక్కే | రాణి/పరో రామ్‌దిన్ | ||
ఏక్ లడ్కి బద్నాం సి | |||
1975 | యే సచ్ హై | ||
జిందగి ఔర్ తూఫాన్ | |||
1976 | సజ్జో రాణి | ||
1977 | ఏజెంట్ వినోద్ | జరీనా | |
ఓపర్‌వాలా జానే | |||
1978 | నవాబ్ సాహిబ్ | ||
అసైన్మెంట్ బొంబాయి | |||
1979 | దీన్ ఔర్ ఇమాన్ | ||
ఆజ్ కి ధారా | |||
1980 | సిస్టర్ | ||
ఏజెంట్ 009 | |||
1981 | జ్వాలా డాకు | రంభబాయి | |
1982 | బెడార్డ్ | ||
1983 | పుట్ జట్టన్ దే | జగత్ సింగ్ భార్య | పంజాబీ |
బంధన్ కుచ్చే ధాగన్ కా | న్యాయవాది ఠాకూర్ | ||
1984 | హమ్ రహే నా హమ్ | కల్యాణి ఎం. శర్మ/మేడమ్ | |
1985 | ఆఖ్రీ చాల్ | టీవీ చిత్రం | |
1992 | సూరజ్ముఖి | ||
2013 | ఇంకార్ [7] | మాయ తల్లి |
మూలాలు
మార్చు- ↑ Rehana Sultan who was a trailblazing 'sexy actress' The Telegraph, 25 November 2005.
- ↑ Anupama Chopra (28 September 2011). "Why Silk Smitha is Bollywood's favourite bad girl". NDTV Movies. Archived from the original on 29 September 2011.
- ↑ "Rehana Sultan: The trail-blazing actress Bollywood forgot". BBC News. 20 March 2017.
- ↑ Dubey, Bharati (August 6, 2012). "Rehana Sultan: Bollywood's first 'bold actress' wants to act again". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 July 2021.
- ↑ "Happy Birthday to Rehana Sultan". ILuvCinema. Archived from the original on 24 September 2015. Retrieved 28 July 2021.
- ↑ "The Illustrated Weekly of India". 92. 1971: 57. Retrieved 28 July 2021.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Inkaar (2013) - IMDb".
బయటి లింకులు
మార్చు- రెహనా సుల్తాన్ బాలీవుడ్ హంగామా లో రెహనా సుల్తాన్ వివరాలు