రేణుకా చౌదరి

రేణుకా చౌదరి మాజీ భారత పార్లమెంటు సభ్యురాలు, మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి..[1]

శ్రీమతి రేణుకా చౌదరి
రేణుకా చౌదరి


పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
29 జనవరి, 2006 - 2009
తరువాత నామ నాగేశ్వరరావు
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-13) 13 August 1954 (age 68)
విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఎస్.చౌదరి
సంతానం ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాదు
మతం హిందూ
మే 1, 2008నాటికి

రాజకీయ జీవితంసవరించు

రేణుక బెంగుళూరు లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పారిశ్రామిక మానసికశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందింది. రేణుకా చౌదరి 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచింది. ఈమె 1986 నుండి 1998 వరకు రెండు సార్లు రాజ్య సభ సభ్యురాలుగా పని చేసారు.[2]

ఆమె 1998లో భారత జాతీయ కాంగ్రెసులో చేరి 1999 మరియూ 2004 లోక్‌సభ ఎన్నికలలో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నిక అయ్యారు. హెచ్.డి.దేవగౌడ ప్రభుత్వంలొ ఈమె కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 1997-98 మధ్యకాలంలో పనిచేసారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసారూ.[1] 2009 ఎన్నికలలో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్ది నామా నాగేశ్వరరావు చేతిలొ సుమారు లక్షా యాభైవేల ఓట్లతొ ఓడిపోయారు.[3] ప్రస్తుతం వారు రాజ్యసభ సభ్యులు గా ఉన్నారు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Renuka Chowdhury's profile at the Lok Sabha website". Archived from the original on 2009-06-15. Retrieved 2008-08-01.
  2. The News Qube (21 November 2020). "కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన రాజకీయ నేతలు వీరే !! | The News Qube". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009