రేవా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో రేవా జిల్లా ఒకటి. రేవా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రేవా తెల్లపులులకు కేంద్రంగా ఉంది. రేవా తెల్లపులకు కూడా గుర్తించబడుతుంది.

Rewa జిల్లా

रीवा जिला
Madhya Pradesh లో Rewa జిల్లా స్థానము
Madhya Pradesh లో Rewa జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముRewa
ముఖ్య పట్టణంRewa, India
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుRewa
విస్తీర్ణం
 • మొత్తం6 కి.మీ2 (2,410 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం23,63,744
 • సాంద్రత380/కి.మీ2 (980/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత73.42 per cent
 • లింగ నిష్పత్తి930
ప్రధాన రహదార్లుNH 7, NH 27, NH 75
జాలస్థలిఅధికారిక జాలస్థలి
The Keoti Fall in Rewa Madhya Pradesh

భౌగోళికంసవరించు

Rewa lies between 24-0- 18’ నుండి 25- 0 - 12’ డిగ్రీల ఉత్తర అక్షాంశం 81 - 0 - 2’ మరియు 82 - 0 - 18’. తూర్పు రేఖాంశంలోనూ ఉంది.[1] .

సరిహద్దులుసవరించు

జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, తూర్పు మరియు ఆగ్నేయ సరిహద్దులో సిద్ది జిల్లా, దక్షిణ సరిహద్దులో షాదోల్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో సత్నా జిల్లా ఉన్నాయి.[2]హుజూర్, సిర్మౌర్ మరియు ముగంజ్ తాలూకాలు కైమూర్ భూభాగంలో దక్షిణంలో ఉన్నాయి. వింద్యపర్వతాలు ఉత్తరం మరియు అక్కడి నుండి రేవా (అప్రిహా) ఉంది. ఉత్తరంలో ఉన్న తియోంతర్ తాలూకా భౌగోళికంగా పీఠభూమిలోని మిగిలిన తాలూకాలకంటే విభిన్నంగా ఉంటుంది. రేవా పీఠభుమి దక్షిణం ఉత్తరానికి ఏటావాలుగా ఉండి ఉత్తరంలో దిగుడు భూమి ఉంటుంది. ఉత్తరంలో ఎత్తు సముద్రమట్టానికి 450మీ ఎత్తున ఉంటుంది. తియోంతర్ మైదానంలోని సారవంతమైన భూమి సముద్రమట్టానికి 100 మీ. ఎత్తు మాత్రమే ఉంటుంది. జిల్లాలోని భూభాగాలు సారవంతమైన మైదానాలు, పర్వత ప్రాంతం, లోయలు, నిటారు పర్వతాలు, నదులు మరియు జలపాతాలు కలగలుపుగా ఉండి భౌగోళిక విభిన్నత కలిగి ఉన్నాయి. జిల్లాలో జన్మించిన తామసా మరియు సన్ నదులు గంగానదిలో సంగమిస్తున్నాయి.[1]

నదులూ జలపాతాలుసవరించు

రేవా నగరం నుండి బిచియా నది ప్రవహిస్తుంది. తామసా నది మరియు దాని ఉపనదీ జలపాతాల రేవా పీఠమూమి నుండి ప్రవహిస్తుంటాయి. చాచై జలపాతం (127) మీ. జలాలు తామసా ఉపనది బింద్ నదికి చేరుకుంటాయి. కెయోతీ జపాతం (98మీ) జలాలు మహానా నదికి చేరుకుంటాయి. బహుతీ జలపాతం (145మీ) జలం బెలాహ్ నది ఉపనది ఒడ్డా నదికి చేరుకుంటాయి. బెలాహ్ నది తామసానదికి ఉపనది. పూర్వా జలపాతం ( 70 మీ) జలాలు తామసా నదికి చేరుకుంటాయి.[3]

విభాగాలుసవరించు

రేవా జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి :- మంగవ, నైగర్హి, శ్రీమౌర్, జావా, తెఒంథర్, హనుమన, హుజుర్, రాయ్పూర్ కర్చులీన్ మరియు మౌగంజ్, సెమరియ.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,363,744,[4]
ఇది దాదాపు. లటివ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 191వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 374 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.79%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 73.42%.[4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 930:1000 [4]
జాతియ సరాసరి (72%) కంటే.


భాషలుసవరించు

రేవా జిల్లాలో హిందీ ప్రధాన మరియు అధికార భాషగా ఉంది.ఆస్ట్రోయాసియాటిక్ భాషాకుటుంబానికి చెందిన అగరియా భాషకు 72,000 వాడుకరులు ఉన్నారు.[7]రేవా జిల్లాలో బఘేలి భాష వాడుకలో ఉంది. ఇది హిందీ భాషను పోలి ఉంటుంది. ఈ భాష 72.91% ప్రజలకు వాడుక భాషగా ఉంది.[8] (జర్మన్ మరియు ఇంగ్లీష్ 60% పోల్చితే) [9] ఈ భాషకు 78,00,000 మంది వాడుకరులు ఉన్నారు.[8]

పర్యాటకంసవరించు

దియోర్కొర్తర్ (దెయూర్) లో ప్రసిద్ధ బుద్ధస్థూపం ఉంది. క్రీ.పూ 3 వ శతాబ్దంలో మౌర్యచక్రవర్తి అశోకుడు ఈ స్థూపాన్ని నిర్మించారని భావిస్తున్నారు. పురాతన కాలంలో ఈ ప్రాంతం దక్షుణాపథంలో భాగంగా ఉండేది. దక్షిణాపథం అంటే తూర్పు పడమరలుగా ఉన్న వ్యాపార మార్గం. పాటలీపుత్ర (పాట్నా) నుండి మహారాష్ట్రం లోని ప్రతిష్ఠానపురం వరకు ఉండేది.

తెల్లపులిసవరించు

రేవాలో మహారాజా మార్తాండ సింఘ్ దాదాపు 2 సంవత్సరాల పులిపిల్లను ఈ ప్రాంతంలో పట్టుకున్నాడు. పులి మహారాజ వేసవి శిబిరంలో 5 జీవించిన తరువాత మరణించింది. తరువాత దీనిని స్టఫ్ చేసి రాజా జార్జ్‌కు విశ్వాశచిహ్నంగా పంపాడు. ఇప్పటి వరకు తెల్లపులి మహారాజా వేసవి నిడిది (గోవిందగర్) లో బధ్రపరచబడి ఉంది.

మోహన్సవరించు

1951లో మహారాజా మార్తాండ సింగ్ పట్టుకున్న తెల్ల పులిపిల్ల పేరు మోహన్. మహారాజా మార్తాండ సింగ్ బంధవ్‌గర్ వద్ద వేటాడుతున్న సమయంలో మే 25న ఈ పులిపిల్ల పట్టుబడిన 4 పులి పిల్లాలలో ఇది తెల్లపులి పిల్ల ఒకటని రికార్డులో ఉంది. పులి కాల్చబడింది. తరువాత తెల్లపులి పిల్ల తప్పించుకున్నది. తరువాత తెల్ల పులిపిల్లను పట్టుకుని 150 గదులున్న మహారాజా వేసవి నిడిదిలో ఒక పెద్ద ఆవరణలో సంరక్షించబడింది. (ఆరోజులలో రాజులు పులులను వాటి పిల్లలతో వేటాడడానికి అనుమతి ఉంది). పట్టుబడిన 3 రోజులలో తెల్లపులిపిల్ల తప్పించుకున్నది. తరువాత తీవ్రంగా శోధించిన తరువాత తిరిగి పట్టుబడింది. తరువాత పులిపిల్లను బంధించిన ఆవరణను సరిచేసి పులిపిల్లను అక్కడ బంధించారు. తరువాత అది మోహన్ అన్నపేరుతో తనజీవితకాలం అక్కడే గడిపుంది.

ఆర్ధికంసవరించు

రేవా జిల్లా గుండా లైమ్‌స్టోన్ బెల్ట్ ఉంది. జిల్లాలో సమీపంలోని షాడోల్, సిధి, ఉమరియా మరియు సింగ్రౌలి జిల్లాలో బొగ్గునిక్షేపాలు లభించాయి. సమీపంలోని నౌబస్తా, సత్నా (బెలా) మరియు సిధి (భగ్వర్) జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. జయపీ గ్రూప్ జయపీ నగర్ పేరుతో రేవాలో టౌన్ షిప్ నిర్మించింది. ఆసియాలోని అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ " ప్రిసం సెమెంట్ " (గతంలో రాశి సెమెంట్), రేవా సమీపంలో ఉంది. జిల్లాలో వింద్యా టెలె లింక్స్ మరియు బిర్లా ఎరిక్షన్ లిమిటెడ్ కూడా ఉన్నాయి.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రేవా జిల్లా ఒకటి అని గుర్తించింది.[10] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[10]

పర్యాటకంసవరించు

రైలుమార్గంసవరించు

రేవా జిల్లా రైలుమార్గాలతో అనుసంధానించబడి ఉంది. ఇక్కడి నుండి సత్నాకు 50 కి.మీ రైలుప్రయాణంతో చేరుకోవచ్చు. సత్నా రైల్వే స్టేషను ముబై - హౌరా మార్గంలో ఉంది.

రోడ్డుసవరించు

  • జాతీయరహదారి -7, వారణాశి- కన్యాకుమారి మార్గం రేవా మీదుగా పయనిస్తుంది. ఈ మార్గం రేవాను మిర్జాపూర్, కత్ని, జబల్పూర్, నాగ్పూర్, హైదరాబాదు మరియు బెంగుళూరులతో కలుపుతుంది.
  • జాతీయరహదారి -27 రేవా- అలహాబాద్
  • జాతీయరహదారి - 75 రేవా- రాంచి.

వాయుమార్గంసవరించు

  • సమీపంలో ఉన్న విమానాశ్రయం :- ఖజూరహో.
  • రేవాలోని చుర్హత్ ఎయిర్ స్ట్రిప్ ఉంది.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Rewa district". Rewa district administration. Retrieved 2010-08-18. Cite web requires |website= (help)
  2. "Rewa". mponline. మూలం నుండి 2010-07-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-18. Cite web requires |website= (help)
  3. K. Bharatdwaj. Physical Geography: Hydrosphere. p. 154. Google books. Retrieved 2010-07-11.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179 Cite web requires |website= (help)
  7. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  8. 8.0 8.1 M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  9. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  10. 10.0 10.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. మూలం (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చేసారు. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రేవా&oldid=2811911" నుండి వెలికితీశారు