రేవారీ జిల్లా

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో రెవారీ జిల్లా ఒకటి. గుర్‌గావ్ జిల్లా న్ండీ ఈ జిల్లాను ఏరపరచారు. రెవారీ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా వైశాల్యం 1,268 చ.కి.మీ.

రెవారీ జిల్లా
रेवाड़ी जिला
హర్యానాలో జిల్లా స్థానం
హర్యానాలో జిల్లా స్థానం
Coordinates (రెవారీ): 27°57′N 76°17′E / 27.95°N 76.28°E / 27.95; 76.28 - 28°28′N 76°51′E / 28.47°N 76.85°E / 28.47; 76.85
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనుగురుగ్రామ్
స్థాపన1989 నవంబరు 1
ముఖ్య పట్టణంరెవారీ
విస్తీర్ణం
 • Total1,594 కి.మీ2 (615 చ. మై)
జనాభా
 (2011)
 • Total9,00,332
 • జనసాంద్రత560/కి.మీ2 (1,500/చ. మై.)
 • Urban
25.93%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత80.99%
 • లింగనిష్పత్తి898
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationHR-36
Websitehttp://rewari.gov.in/

చరిత్ర

మార్చు

మహాభారతం లోని బలరాముడి భార్య రేవతి పేరిట ఆమె తండ్రి ఈ పట్టణాన్ని రేవా వాడీ అనే పేరుతో నిర్మించాడని ఐతిహ్యం. కూతురిని బలరామునికి ఇచ్చి పెళ్ళి చేసేటపుడు ఈ పట్టణాన్ని కట్నంగా చదివించాడు.[1]

1962 రెజాంగ్ లా యుద్ధం

మార్చు

1962 భారత చైనా యుద్ధంలో రెజాంగ్ లా వద్ద 13 కుమావో దళం చైనా సైన్యంతో తలపడింది.[2] నవంబరు 18 న రెజాంగ్ లా వద్ద జరిగిన పోరులో భారత దళం లోని 13 మందిలో 114 మంది మరణించారు. వీళ్ళలో దాదాపుగా అందరూ రెవారీకి చెందినవారే. ఈ దళ నాయకుడు సైతాన్ సింగ్‌కు మరణానంతర పరమ వీర చక్ర పతకం లభించింది. వీరి స్మారకార్థం పట్టణంలో ఒక స్మారకాన్ని నిర్మించారు. ఈ దళం 1300 మంది సినికులను చంపిందని ఆ స్మారకంపై రాసారు.[3] ఏటా ఇక్కడ స్మారక ఉత్సవం జరుపుతారు.

జనాభా వివరాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19512,59,847—    
19613,14,793+1.94%
19713,90,351+2.17%
19814,86,084+2.22%
19916,10,611+2.31%
20017,65,351+2.28%
20119,00,332+1.64%
source:[4]

2011 జనాభా లెక్కల ప్రకారం, రేవారి జిల్లాలో 9,00,332 జనాభా ఉంది, జనాభా పరంగా ఇది భారతదేశ జిల్లాల్లో 466 వ స్థానంలో ఉంది. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 565 మంది. 2001-2011 దశాబ్దంలో జిలా జనాభా వృద్ధి రేటు 17.09%. రేవారిలో ప్రతి 1000 మంది పురుషులకు 898 మంది స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత 80.99%. మగవారిలో అక్షరాస్యత 91.44% కాగా, ఆడవారిలో ఇది 69.57%. జనాభాలో హిందువులు అధికం (98.76%).మిగతావారిలో ఇస్లాం (0.63%), సిక్కు మతం (0.20%), జైన మతం (0.17%), ఇతర మతాలనూ (0.24%) ఆచరిస్తారు.

ఆర్థిక వ్యవస్థ

మార్చు

ఢిల్లీకి దగ్గరగా ఉండడం వలన, ఖనిజాల లభ్యత వలనా జిల్లాలో ఆర్థిక వ్యవస్థ పరిశ్రమల దిశగా పురోగమించింది. 1989 లో జిల్లా ఏర్పాటైన తరువాత, రెవారీ జిల్లాలో వ్యవసాయం ఉపాధిగా కలిగిన వారి సంఖ్య 54.7% నుండ్ 2011 నాటికి 33.8% కి పడిపోయింది.ద్వితీయ తృతీయ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించాయి.[5]

జిల్లాలో వ్యవసాయం ప్రధానంగా బోరుబావుల ద్వారా జరుగుతుంది. ఎత్తిపోతలపథకం ద్వారా జవహర్ లాల్ నెహ్రూ కాలువ ద్వారా కూడా సాగునీరు అందిస్తున్నారు.మొత్తం 1,59,400 హెక్టార్ల భూమిలో 1,20,897 హెక్టార్లలో (83.79%) సాగు చేస్తున్నారు.

చారిత్రికంగా రెవారీ, ఇత్తడి సమానుల తయారీకి ప్రసిద్ధి. 1989 లో జిల్లా ఏర్పడిన సమయంలోనే ఆర్థిక సరళీకరణ మొదలవడం ఢిల్లీ నుండి పరిశ్రమలను దూరంగా జాతీయ రాజధాని ప్రాంతం లోకి తరలించడంతో రెవారీలో పారిశ్రమల స్థాపన పెరిగిపోయింది. కేవలం 2 మధ్య తరహా పరిశ్రమలున్న స్థాయి నుండి కొద్ది సంవత్సరాల లోనే 168 పరిశ్రమల స్థాయికి అభువృద్ధి చెందింది. ఇత్తడి సామాను, కాగితం, బీరు, విద్యుత్ కేబుళ్ళు, సింథటిక్ నూలు వగైరాలు ఇక్కడి పరిశ్రమల్లో ప్రధానమైనవి

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "History | District Rewari, Government of Haryana | Veer Bhoomi | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-03-04.
  2. Guruswamy, Mohan (20 November 2012). "Don't forget the heroes of Rezang La". The Hindu. Retrieved 7 July 2018.
  3. Gupta, Shekhar (30 October 2012). "Nobody believed we had killed so many Chinese at Rezang La. Our commander called me crazy and warned that I could be court-martialled". The Indian Express. Retrieved 7 July 2012.
  4. Decadal Variation In Population Since 1901
  5. District Census Handbook 2011 (Part A) (PDF). Office of the Registrar General & Census Commissioner, India. 2011.