లక్ష్మీబాయి షిండే

ఒకరోజు సాయంత్రం బాబా మసీదులో ఉన్నప్పుడు లక్ష్మీబాయి షిండే అను భక్తురాలు వచ్చి బాబాను దర్శించింది. బాబా ఆమెతో "అమ్మా నాకు ఆకలి వేస్తోంది" అన్నారు "బాబా ఇప్పుడే మీకు భోజనం తీసుకుని వస్తాను" అంటూ ఆమె ఇంటికి వెళ్లి త్వరత్వరగా నెయ్యి,పప్పుకూర,రొట్టె తయారు చేసి మసీదుకు తీసుకొని వచ్చి బాబాకు సమర్పించింది బాబా వెంటనే ఆ భోజనాన్ని ప్రక్కనే ఉన్న కుక్కకు పెట్టేశారు కారణమడిగితే బాబా "ఈ కుక్క ఎంతో ఆకలిగా ఉన్నది అదీ నేను వేరు కాదు" అన్నారు ఇక అప్పటినుంచి జీవితాంతమూ ఆమె ప్రతిరోజూ సాయంత్రం పాలల్లో నానబెట్టిన రొట్టె బాబాకు సమర్పించేది ఆమె సేవకు మెచ్చి బాబా తాము సమాధి చెందే కొద్ది నిమిషాల ముందు ఆమెకు తొమ్మిది రూపాయి నాణాలను ప్రసాదించారు. అంతేకాదు ఆడవారిని సాయంత్రం వేళ మసీదులోకి అనుమతించని బాబా ఆమెను మాత్రం స్వేచ్ఛగా రానిచ్చేవారు ఆమె తీసుకొచ్చిన భిక్షలోంచి నాలుగు ముద్దలు తీసుకుని మిగిలినది తమ స్వహస్తాలతో ఆమెకు రోజూ ప్రసాదంగా ఇచ్చేవారు అంతటి ధన్యురాలు లక్ష్మీబాయి.