లగడపాటి రాజగోపాల్
లగడపాటి రాజగోపాల్ (జ: 16 ఫిబ్రవరి, 1964) పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇతనికి చెందిన లాంకో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో కృషిచేస్తుంది.[1]. ఇతను ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర అల్లుడు.
లగడపాటి రాజగోపాల్ | |||
నియోజకవర్గం | విజయవాడ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సంగం, నెల్లూరు జిల్లా. | 1964 ఫిబ్రవరి 16||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | లగడపాటి పద్మ & జానకి లగడపాటి | ||
సంతానం | ముగ్గురు కుమారులు & దత్త పుతిృక | ||
నివాసం | విజయవాడ | ||
మతం | హిందూ మతం | ||
వెబ్‌సైటు | http://www.rajagopal.in/ | ||
మూలం | biodata |
దర్మమార్గం
మార్చుహైదరాబాద్ యుటీగా వద్దంటే వద్దు అనే దర్మమార్గం అనుసరించారు.[2]
వివాదస్పదం
మార్చుపెప్పర్ స్ప్రే
మార్చుతెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని అలుపెరగని ఆంధ్రా సమైక్యాంధ్ర కోసం 13 ఫిబ్రవరి 2014 రోజున లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) ను ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన విషయం దేశంలో ఇది తీవ్ర దుమారం రేపింది.[3]
రాజకీయా సన్యాసం
మార్చుఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, ఫిబ్రవరి 2014లో భారత పార్లమెంట్లో ఉభయ సభల్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రంగా విడిపోతే రాజకీయా సన్యాసం చేస్తాను అని బహిరంగప్రకటన చేశాడు. అన్నట్టుగానే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి, తన ఎంపి పదవికి రాజీనామా చేసి, రాజకీయా సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించి రాజకీయాలలో మాటకు కట్టుబడి రాజీనామా చేసాడు. చిత్తశుద్ధితో చివరి వరకూ సమైక్యాంధ్ర కోసం పోరాడిన వ్యక్తి.