లాతూర్ జిల్లా
మహారాష్ట్ర రాష్ట్ర 38 జిల్లాలలో లాతూర్ జిల్లా (హిందీ:) ఒకటి. లాతూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
లాతూర్ జిల్లా
लातूर जिल्हा | |
---|---|
![]() మహారాష్ట్ర పటంలో లాతూర్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | ఔరంగాబాద్ |
ముఖ్య పట్టణం | Latur |
మండలాలు | 1. Latur, 2. Udgir, 3. Ahmedpur, 4. Ausa, 5. Nilanga, 6. Renapur, 7. Chakur, 8. Deoni, 9. Shirur Anantpal, 10. Jalkot. |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 2 (partial) Latur & Osmanabad |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
Area | |
• మొత్తం | 7,157 km2 (2,763 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 24,55,543 |
• Density | 340/km2 (890/sq mi) |
• Urban | 25.47% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 79.03% |
• లింగ నిష్పత్తి | 924 |
Website | అధికారిక జాలస్థలి |

[1] జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితమై ఉంది. జిల్లాలోని గ్రామీణ జనసంఖ్యా శాతం 25.47%.[2]
చరిత్ర సవరించు
లాతూర్ ప్రాంతానికి రాస్ఃత్రకూటుల కాలంనాటి పూరాతనకాల చరిత్ర ఉంది. రాష్ట్రకూటుల రెండు రాజ్యశాఖలలో ఒకదానికి లాతూర్ రాజధానిగా ఉంది. దక్కన్ భూభాగాన్ని సా.శ. 753-973 రాష్ట్రకూటులు పాలించారు. మొదటి రాష్ట్రకూటుల రాజు దంతిదుర్గా లాతూర్ (కన్నడం: ಲಟ್ಟಲೂರು) లో జన్మించాడు. పూరాతన కథనాలను అనుసరించి రత్నపూర్‌కు లాతూర్ అనే పేరు ఉండేదని భావిస్తున్నారు.
అవినాష్ రాజ్యానికి చెందిన రాజా అమోఘవర్షా లాయూర్ నగరాన్ని స్థాపించాడు. ఇది రాష్టకూటుల కేంద్రంగా ఉండేది. రాష్ట్రకూటుల తరువాత సా.శ. 753లో చాళుఖ్యులు ఈ ప్రాంతానికి పాలకులయ్యారు.
లాతూర్ భుభాగాన్ని కొన్ని శతాబ్ధాలకాలం శాతవాహనులు, శాకాలు, చాళుఖ్యులు, యాదవులు (దౌలతాబాదు, దేవగిరి), ఢిల్లీ సుల్తానులు, బహమానీ సుల్తానులు (దక్షిణ భారతదేశం), అదిలాష్, మొగల్ చక్రవర్తులు పాలించారు.
లాతూర్ భూభాగం 17వ శతాబ్దంలో హైదరాబాదు స్వంతంత్ర రాజ్యంగా అయింది. హైదరాబాదు పాలకులు కాలంలో పన్ను విధానంలో మార్పులు చేయబడ్డాయి. హైదరాబాదు పాలకుల కాలంలో దోపిడీయుతమైన పన్ను విధానం ముగింపుకు వచ్చింది.[3] 1905 నాటికి ఈ భూభాగం సమీప ప్రాంతాలను కలుపుకుని లాతూర్ తాలూకాగా రూపొందించబడి ఉస్మానాబదు జిల్లాలో భాగంగా మారింది. ఈ ప్రాంతంలో నిజాం పాలన 1948 వరకు కొనసాగింది. నిజాం సైన్యాధ్యక్షుడు కాసిం రిజ్వి జన్మస్థం లాతూర్. స్వాతంత్ర్యం తరువాత హైదరాబాదు రాజాస్థానం ఇండియన్ యూనియన్‌లో భాగం అయింది. 1960 వరకు ఉస్మానాబాదు బొబాయి ప్రొవింస్‌లో భాగంగా ఉండేది. 1960లో మహారష్ట్ర రాష్ట్రం రపొందించిన తతువాత ఉస్మానాబాదు జిల్లా మహారష్ట్ర రాష్ట్రంలో భాగం అయింది. 1982 ఆగస్టు 15న ఉస్మానాబాదు జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి లాతూర్ ప్రత్యేక జిల్లా రూపొందించబడింది.
భౌగోళికం సవరించు
లాతూర్ జిల్లా మరత్వాడా భూభాగంలో ఉంది. 17°52' నుండి 18°50' ఉత్తర అక్షాంశం, 76°18' నుండి 79°12' తూర్పు రేఖామ్శంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 631 మీ ఎత్తున ఉంది. జిల్లా రెండు భూభాగాలుగా విభజించబడింది. బాలాఘాట్ పీఠభూమి, ఈశాన్య భూభాగం (అహమ్మద్‌పూర్, ఉద్గిర్). బాలాఘాట్ పీఠభూమి సముద్రమట్టానికి 530-638 మీ ఎత్తు ఉంటుంది.
సరిహద్దులు సవరించు
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఈశాన్య సరిహద్దు | నాందేడ్ |
తూర్పు సరిహద్దు | కర్నాటక రాష్ట్రం |
దక్షిణ సరిహద్దు | ఉస్మానాబాద్ |
పశ్చిమ సరిహద్దు | బీడ్ |
వాయవ్య సరిహద్దు | పర్భణీ |
- 1993 సెప్టెంబరు న లాతూర్ జిల్లాలో భూకంపం సంభవించింది.
- లాతూర్ జిల్లా మారాష్ట్ర రాష్ట్రంలో వైశాల్యపరంగా 16వ స్థానంలో ఉంది. 2013 గణాంకాలను అనుసరించి లాతూర్ జిల్లా ఆసియాలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటిగా
గుర్తింపును పొందింది.
వాతావరణం సవరించు
విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
గరిష్ఠ ఉష్ణోగ్రత | 24-39 - 41 ° సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణోగ్రత | 13-21-11 ° సెల్షియస్ |
వర్షాకాలం | జూలై - అక్టోబరు |
వేసవి కాలం | మార్చి- జూలై (వేడి - పొడి) |
శీతాకాలం | నవంబరు - ఫిబ్రవరి |
వర్షపాతం | 600-800 మి.మీ |
నదులు, సరసులు సవరించు
జిల్లాలోని ప్రధాన నదులు మంజ్ర, తెర్నా, మనార్, తవర్జ, తిరు, ఘర్ని. గోదావరి పలు శాఖలుగా చీలి ప్రవహించడం వలన అక్కడక్కడా ఆనకట్టలు నిర్మించడానికి వసతి కలుగుతుంది. జిల్లాలో పలు ఉపనదులు ప్రవహిస్తూ ఉన్నాయి.
గంణాంకాలు సవరించు
2011 లో గణాంకాలు సవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,455,543,[2] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 181 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 343 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.04%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 924:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 79.03%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
2011 గణాంకాలు సవరించు
విషయాలు | వివరణలు |
---|---|
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య | 2,080,285.[6] |
నగరీకరణ శాతం | |
ఇందులో పురుషుల సంఖ్య | 52% |
స్త్రీలసంఖ్య | 48% |
స్త్రీ పురుష నిష్పత్తి | 935:1000[6] |
జాతీయ సరాసరి 928 కంటే | అధికం |
అక్షరాస్యతా శాతం | 72% |
జాతీయదరాసరి 59.5%, కంటే | అధికం |
పురుషుల అక్షరాస్యత | 77% |
స్త్రీల అక్షరాస్యత | 63% |
6 సం.లోపు పిల్లలు | 14% |
ప్రధాన భాషలు | కన్నడ, తెలుగు, హిందీ, మరాఠీ, రాజస్థానీ, ఉర్ధూ, బెంగాలీ [7] |
సంస్కృతి సవరించు
- సంతలు - ఉత్సవాలు :- లాతూర్‌లో ప్రతిసంవత్సరం శ్రీ సిద్ధేశ్వర్ సంత నిర్వహించబడుతుంది.
- ఉద్గిరి తాలూకాలోని హత్తిబెట్ వద్ద ఉన్న " గంగారాం మహరాజ్ సమాధి " సందర్శించడానికి వేలాది భక్తులు వస్తుంటారు.
- 2011లో అమిత్జీ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో జనవరి 10-11-12 న లాతూర్ ఉత్సవం నిర్వహించబడింది. తరువాత ప్రతిసంవత్సరం అదేరోజున ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఉత్సవ నిర్వహణా బాధ్యతను లాతుర్ క్లబ్, ఇండియన్ మేజిక్ ఐ వహించాయి.
విద్య సవరించు
ఉన్నత విద్య సవరించు
జిల్లా రాష్ట్రంలోని ప్రధాన విద్యాకేంద్రాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లా మాధ్యమిక, జూనియర్ కాలే విద్యకు రాష్ట్రంలో ప్రత్యేకత సంతరించుకుంది. ఉన్నత పాఠశాల, జీనియర్ ఫలితాలలో జిల్లా నుండి పలువురు ఉన్నత ర్యాంకులు సాధించారు. జొల్లాలో కామర్స్, కంప్యూటర్ విజ్ఞాన శాస్త్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సి.ఒ.సి.ఎస్.ఐ.టి ), రాజర్షి షాహు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ దయానంద్ కాలేజ్, దయానంద్ విజ్ఞాన శాస్త్రం కాలేజ్, లా దయానంద్ కాలేజ్, కేషర్బాయి కాలేజ్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ విజ్ఞాన శాస్త్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సి.ఒ.సి.ఎస్.ఐ.టి ), రాజర్షి షాహు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ దయానంద్ కాలేజ్, దయానంద్ విజ్ఞాన శాస్త్రం కాలేజ్, లా దయానంద్ కాలేజ్, కేషర్బాయి కాలే గర్ల్స్ కాలేజ్, మహాత్మా బసవేశ్వర్ కాలేజ్, ఉదయగిరి కాలేజ్, హవాగి స్వామి కాలేజ్, కాలేజ్ ఆఫ్ దయానంద్ కాలేజ్ 'మహాత్మాగాంధీ కాలేజ్, అహ్మద్పూర్' , ఎం.ఎస్. బిడ్వె ఇంజినీరింగ్ కాలేజ్, ఎం.ఎం.ఎస్.ఆర్. మెడికల్ కాలేజ్, గవర్నమెంట్. మెడికల్ కాలేజ్, మంజర ఆయుర్వేద కళాశాల, దయానంద్ లా కాలేజ్, మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, సందీపని టెక్నాలజీ & మేనేజ్మెంట్, మైత్రి ఇన్స్టిట్యూట్ ఒక డాక్ట్జర్. చంద్రభాను సొనవనె, జూనియర్ సైన్సు కాలేజ్ మొదలైన పలు విద్యాసంస్థలు ఉన్నాయి. సీ.బీ.ఎస్.సి బోర్డు విద్యార్థుల గణితం శిక్షణ కొరకు నగరం నంది స్టాప్ వద్ద ఔసా రోడ్డు లాతూర్ మధ్యలో కస్యపా అకాడమీ ఉంది.
ప్రాథమిక, మాధ్యమిక విద్య సవరించు
జిల్లాలో జిల్లాపరిషద్ స్కూల్ ఉంది. జిల్లాలోని ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి:-
- 'శ్రీ ఖెషవ్రజ్ విద్యలయ్ షాం నగర్ లాతూర్.
- 'శ్రీ డెషికేంద్ర విద్యలయ్ లాతూర్.
- 'శ్రీ వెంక్తెష్ విదయలయ్, ప్రధాన బస్ వెనుక, లాతూర్ స్టాండ్
- 'శ్రీ గణేష్ విద్యలయ్' , కోపం చూపించేందుకు మాత్రం ఒకే గాలీ లాతూర్
లాతూర్‌లో ప్రసిద్ధి చెందిన ఎస్.ఎస్.చి, హెచ్.ఎస్.చి కళాశాలలు: 1.శ్రీ రాజర్షి షాహు విజ్ఞాన శాస్త్రం కళాశాల లాతూర్. 2.శ్రీ దయానంద్ విజ్ఞాన శాస్త్రం కాలేజ్ లాతూర్. 3.డాక్టర్ చంద్రభాను సొన్వనే కళాశాల లాతూర్
జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, రెండు మెడికల్ కాలేజులు, రెసీడెంషియల్ గరల్స్ ప్రభుత్వ కాలేజులు జూన్నాయి. కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సు మరొయు ఇంఫర్మేషన్ టెక్నాలజీ (లాతూర్) మోదలైన కాలేజీలు ఉన్నాయి.
షివ్లింగేశ్వర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (అల్మల), విశ్వవిద్యాలయ అభియంత్రికి పద్విక మహావిద్యాలయ (పాలిటెక్నిక్), దగదోజీరావ్, దేష్ముఖ్ డాక్టర్ ఫార్మసీ కాలేజ్ (దిలప్ నదర్),అల్మల మరొయు రామనాథ్ అధ్యాక్ విద్యాకయ (అల్మల) కాలేజీలు జిల్లా కేంద్రానికి 19కి.మీ దూరంలో ఉన్నాయి. ఈ రెండు విద్యాసంస్థలు లాతూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి చేయబడ్డాయి.
విభాగాల వివరణ సవరించు
విషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | లాతూర్,ఉద్గిర్,అహ్మద్పుర్,ఔస,నిలంగ,రెనపుర్, చకుర్, దెఒని,షిరూర్ అనంత్పల్, జల్కొత్ . |
గ్రామపమచాయితీలు | 786 |
గ్రామాలు | 945 |
అసెంబ్లీ నియోజక వర్గం | లాతూర్ సిటీ (విధాన సభ నియోజకవర్గం), లాతూర్ రూరల్ (విధాన సభ నియోజకవర్గం),ఉద్గిర్ (విధాన సభ నియోజకవర్గం) ఔస (విధాన సభ నియోజకవర్గం ),నిలంగ (విధాన సభ నియోజకవర్గం), అహ్మద్పూర్ (విధాన సభ నియోజకవర్గం) |
పార్లమెంటు నియోజక వర్గం | ఉస్మానాబాద్ లోక్ సభ నియోజకవర్గం ఔస (విధాన సభ నియోజకవర్గం), లాతూర్ (లోక్ సభ నియోజకవర్గం) మిగిలిన అయిదు. |
నగరాలు, పట్టణాలు సవరించు
జిల్లాలో లాతూర్ నగరం ఒక్కటే మునిసిపల్ కార్పొరేషన్‌గా ఉంది. జిల్లాలో ఉద్గిరి, అహ్మద్‌పూర్, ఔస, నిలంగ వంటి ముంసిపల్ కౌంసిల్స్ ఉన్నాయి.
జిల్లాలోని 28 ప్రధాన గ్రామాలు సవరించు
- భద 10000
- మురుద్ (లాతూర్) 20.552
- చకుర్ 16.122
- కిల్లరి 15.259
- నలెగఒన్ 14.983
- ఔరద్ షహజని 12.894
- రెనపుర్ 11.596
- డెఒని 11.276
- పంగఒన్ 10,521
- కింగఒన్ 9.665
- షిరూర్ తజ్బంద్ 9.191
- షిరూర్ అనంత్పల్ 8.682
- కసర్షిర్షి (కసర్సిర్సి) 8,139
- వధవన 8,132
- జల్కొత్ 7.912
- వద్వల్ నాగనాధ్ 7,289
- సకొల్ 7.018
- హదొల్తి 7.013
- ఉజని 6.434
- మతొల 6.393
- ఖరొల 6.260
- బభల్గావ్లో 6.013
- హల్గర 5,844
- హందర్గులి 5,801
- చపొలి 5.778
- నితూర్ (నితుర్) 5,751
- లోహార, లాతూర్ 5,682
- చించొలి రఔఅది 5.678
- అషివ్ 6549
}}
ఆకర్షణలు సవరించు
లాతూర్ నగరం పర్యాటక కేంద్రంగా ఉంది. నగరంలో ఖరోసా గుహలు చారిత్రక చిహ్నాలు మరుయు సత్యసాయిబాబా ఆలయం వంటి ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి.
యాత్రీకప్రదేశాలు సవరించు
- లాథూర్
- రెనాపూర్
- వధోనా
- భద
కోటలు సవరించు
జిల్లా సమీపంలో పలు పురాతన కోటలు ఉన్నాయి :-
- ఉద్గిర్
- లోహ్రా (లాథూర్)
- ఔస
- ఔరద్
పర్యాటక ఆకర్షణలు సవరించు
- వద్వాల్ - నాగబాథ్ :- ఇది చాకూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న కొండగుట్ట వందలాది జాతుల మొక్కలకు పుట్టిల్లుగా ఉంది. వీటిలో అత్యధికం ఆయుర్వేద ఔషదీయ మొక్కలు. వద్వాల్ సమీపంలో నిర్వహించబడుతున్న వార్షిక ఉత్సవానికి వేలాది భక్తులు వస్తుంటారు.
- సాయి నందనవన్ - చాకూర్ సమీపంలో ఉన్న సాయి నందనవన్ మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. 400 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ నందనవనంలో మామిడి చెట్లు, వాటర్ పార్క్, అమ్యూజిమెంటు పార్క్ ఉన్నాయి. పార్క్ మధ్యలో సత్యసాయిబాబా మందిరం ఉంది.
- దేవరాజన్ :- ఉదర్గిరి తాలూకాలో ఉన్న మరొక పర్యాటక ఆకర్షణ దేవరాజన్ ఆలయం. ఇది ఒక చిన్న గుట్ట మీద ఉంది.
- ఖరోస :-ఇవి లాటరైట్ రాళ్ళతో ఏర్పడిన గుహలు. ఇవి సా.శ. 8వశతాబ్ధానికి చెందినవని విశ్వసిస్తున్నారు.
- లాతూర్ నగరంలో ఉన్న సిద్దేశ్వర్ ఆలయం, విరాట్ హనుమాన్ ఆలయం, నానానాని పార్క్ మొదలైన ఇతర ఆకర్షణలు ఉన్నాయి.
- లోహర (లాతూర్) గ్రామం ఉద్గిరి తాలూకాలో ఉంది. ఇక్కడ మహదేవ్ బెట్ (కొండ్), గబేయిసాహెబ్ బెట్ ఆలయం ఉన్నాయి. ఇక్కడ ప్రముఖ బెనినాథ్ మహరాజ్ మఠం (ట్రస్ట్) ఉంది.
ఇది నిజాం షాహి కాలానికి చెందిన పురాతన ట్రస్ట్‌గా గుర్తినచబడుతుంది.
ఆర్ధికం సవరించు
హైదరాబాదు నవాబు నిజాం కాలంలో లాతూర్ వ్యాపార కేంద్రాలలో ఒకటిగా ఉండేది. జిల్లా ఆర్థికంగా పారిశ్రామిక, వ్యవసాయ ఆధారిత జిల్లాగా గుర్తించబడుతుంది. మాహారాష్ట్రలో లాతూర్ జిల్లా త్వరితగతిలో పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా గుర్తించబడుతుంది.
లాతూర్ జిల్లాలో నాణ్యమైన పప్పు దినుసులు అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. ప్రత్యేకంగా కందులు (అర్హర్ పప్పు, పీజియన్ పప్పు) అధికంగా పండించబడుతున్నాయి. మినుములు, పెసలు, చనగలకు కూడా లాతూర్ కేంద్రంగా ఉంది. జిల్లా నూనెగింజల వ్యాపారానికి (ప్రత్యేకంగా పొద్దుతిరుగుడు గింజలు) కేంద్రంగా ఉంది. జిల్లా సోయా బిన్, కర్ది, సాఫ్లవర్, నట్‌క్రేకర్లు, తాళాలు, ఇత్తడి పాత్రలు, పాలపొడి, జిన్నింగ్, ప్రింటింగ్ లకు కేంద్రంగా ఉంది. జిల్లాలో మంజర, సాకర్ ఖర్ఖానా, వికాస్, జాగ్రితిచక్కెర మిల్లులు ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలు సవరించు
వాయుమార్గం సవరించు
లాతూర్ నగరానికి ఈశాన్యంలో చించోలీరావ్‌వాడి " లాతూర్ విమానాశ్రయం " ఉంది. విమానాశ్రయం పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంటు చేత 1991లో నిర్మించబడి తరువాత ఎం.ఐ.డి.సికి స్వాధీనం చేయబడింది. 140 కోట్ల ఖర్చుతో నిర్మించబడిన ఈ విమానాశ్రయం రిలయన్ ఇంఫ్రాస్ట్రక్చరల్ ఎయిర్ పోర్ట్ డెవెలెపర్లకు 99 సంవత్సరాల లీజుకు ఇవ్వబడింది. [9] ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో విమానసేవలు లభించనప్పటికీ విమానాశ్రయం నుండి మాదానికి 14 నుండి 16 విమానాలు నడుపబడుతున్నాయి.[10]
రహదారి సవరించు
జిల్లాలోని మొత్తం రహదారి పొడవు 13,642 కి.మీ.
- జిల్లాలోని రహదార్ల జాబితా :-
- రత్నగిరి-కొల్హాపూర్-షోలాపూర్-లాతూర్-నాందేడ్-యావత్మల్-వార్ధా-నాగ్పూర్ (ఎన్.హెచ్ 204)
- నాగ్పూర్-బోరి-అథంపూర్ స్టేట్ హైవే (ఎస్.హెచ్)
- దావండ్-బరసి-ఉస్మానాబాద్-బంతల్-ఔస స్టేట్ హైవే (ఎస్.హెచ్ 77)
- మిరాజ్-పండరపుర-బర్షి-లాతూర్ స్టేట్ హైవే (ఎస్.హెచ్ 02)
- మంజర్సుంబ-కైజ్-లోఖంది-సవర్గఒన్ స్టేట్ హైవే.
- జిల్లాకేంద్రం నుండి జిల్లాలోని 96% గ్రామాలకు బసు సౌకర్యాలు ఉన్నాయి.
- మినిసిపల్ బస్ విధానంద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలను జిల్లాకేంద్రం లాతూర్ నగరంతో అనుసంధానిస్తున్నాయి. ఎం.ఆర్.టి.సి జిల్లాలోని అన్ని జిల్లాలకు బసు సౌకర్యం కల్పిస్తుంది.
రైలుమార్గాలు సవరించు
లాతూర్ జిల్లాలోని రైలు మార్గాలు అన్నీ బ్రాడ్ గేజ్ మార్గాలే అన్నది జిల్లా ప్రత్యేకత. ఇవి సెంట్రల్ రైల్వే సంస్థకు చెందినవి.
లాతూర్ రైల్వే స్టేషను సవరించు
బర్షి రైల్వే మార్గం నేరోగేజ్ నుండి బ్రాడ్‌గేజ్ మార్గంగా మార్చిన సమయంలో లాతూర్ రైల్వే స్టేషను పునర్నిర్మించబడింది. 2007లో లాతూర్ - ఉస్మానాబాద్, 2008 అక్టోబరున ఉస్మానాబాద్ - కుర్దువాడి మార్గం బ్రాడ్‌గేజ్‌గా మార్చబడింది. ఇది ఉస్మానాబాద్- హైదరాబాదు నగరాల మద్య రైలు నడుపబడుతుంది.[11]
- ప్రధాన రైలు స్టేషన్లు :- లాతూర్, లాతూర్ రోడ్, ఉగిరి. జిల్లాలో రైలుమార్గాల మొత్తం పొడవు 148 కి.మీ ఉంటుంది. ఇందులో 83 కి.మీ పొడవున బ్రాడ్‌గేజ్ మార్గంగా మార్చబడింది.
65కి.మీ రైలు మార్గం నేరోగేజ్ మార్గంగా ఉంది.
లాతూర్, కుర్దువాది సవరించు
లాతూర్ నుండి కురుద్వాడికి నేరో గేజ్ రైలుమార్గం ఉంది. 2002లో కురుద్వాడి - పంధర్‌పూర్ సెక్షన్ మీరజ్ వైపుగా బ్రాడ్‌గేజ్‌గా మార్గంగా మార్చబడింది. లాతూర్ నుండి ఉస్మానాబాద్ రైలు మార్గం 2007లో బ్రాడ్‌గేజ్‌గా మార్చబడింది. ఉస్మానాబాద్ - కురుద్వాది సెక్షన్ బ్రాడ్‌గేజ్ మార్గంలో 2008 అక్టోబరు నుండి రైళ్ళు నడుపబడుతున్నాయి. పంధర్‌పూర్ - మీరజ్ సెక్షన్ ఇప్పటికీ నేరోగేజ్‌గా ఉంది. గోవా మార్గంలో ఉన్న పంధర్‌పూర్ - మీరజ్ బ్రాడ్‌గేజ్ మార్చబడింది. జిల్లాలో ఇక్కడ వ్యసాయదారులకు అనుకూలమైన మార్కెట్ వసతి లేదు. రైలు మార్గాలు వ్యవసాయ ఉత్పత్తులను కొంకణ్, గోవా మార్కెట్లకు చేర్చడానికి ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి సహకరిస్తున్నాయి.
క్రీడలు సవరించు
మాహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వారి హోం గ్రౌండును లాతూరు నగరంలో నిర్మించాలని ప్రయత్నిస్తుంది. ఉస్మానాబాద్ - నాందేడ్ క్రీడాకారుల అభ్యర్ధన మీద లాతూర్ నగరంలో డివిషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థాపించడానికి మంజూరు చేయబడింది. లాతూర్ నగరంలో నేషనల్ లెవెల్ కబడ్డి, బాస్కెట్ బాల్ క్రీడలు నిర్వహించబడ్డాయి. క్రీడాప్రబోధినిని పొందడానికి లాతూర్ భూభాగం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.
ఆరోగ్యరక్షణ సవరించు
లాతూర్ జిల్లా 12 ప్రభుత్వ ఆసుపత్రులు, 46 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 19 డిస్పెన్సరీలు, 234 ప్రాథమిక ఆరోగ్య సహకార బృందాలు ఉన్నాయి. జిల్లాలోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలోని 11 జిల్లాలోని ప్రజలకు వైద్యసహాయం అందిస్తుంది,
అదనంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో, జతల్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, గుగుల్ మెమోరియల్ హాస్పిటల్, యశ్వంతరావ్ చవన్ రూరల్ హాస్పిటల్, లాతూర్ కేన్సర్ హాస్పిటల్ వంటి ప్రధాన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి.
- లాతూర్‌లో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ & హాపిటల్స్ 2, ఎం.ఐ.ఎం.ఎస్.ఆర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ ఉన్నాయి.
సమాచార వ్యవస్థ సవరించు
పోస్ట్, ట్ర్లిగ్రాఫ్ సేవలు : 1991 గణాంకాలను అనుసరించి జిల్లాలోని మొత్తం 914 గ్ర్రామలలో 250 గ్రామాలలో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 52.27% గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ సేవలు లభిస్తున్నాయి.
మాధ్యమం సవరించు
వార్తా పత్రికలు :- Ekamt|ఏకాంత్] మాహారాస్ట్ర జిల్లా వార్తాపత్రికలలో మొదటిదిగా గుర్తించబడుతుంది. దీనికి అంతర్జాల ప్రచురణ కూడా నిర్వహించబడింది. . Marathwada Neta- జిల్లాలో ప్రధాన వార్తా పత్రికగా గుర్తించబడింది. జిల్లాలో అదనంగా యశ్వంత్, లోక్‌మాత్, భూకంప్, సకాల్, పుణ్యనగరి, ఇతర ప్రాంతీయ భాష పత్రికలకు కూడా తగినంత ఆదరణ లభిస్తుంది. which are the leading newspaper of the region, while Yeshwant, Lokmat, Bhukamp,- Sakaal & Punyanagri and are other daily newspapers published in the regional language.
1993 లాథూర్ భూకంపం సవరించు
1993 సెప్టెంబరు 30న లాతూర్ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ భూకంపంలో ప్రాణానష్టం కూడా అధికంగా జరిగింది. రిక్టర్ స్కేల్‌లో ఈ భూకంపం 6.3 గా నమోదు అయింది. ప్రజలు నిద్రలో మునిగి ఉన్న సమయంలో బలహీనమైన గృహనిర్మాణం కలిగిఉన్న నివాసాలలో ఉన్న ప్రజలు, రాళ్ళను పేర్చి నిర్మించబడిన గ్రామీణ గృహాలలో నివసుస్తున్న ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఈ భూకంపంలో దాదాపు 30,000 మంది ప్రాణాలను కోల్పోయారు. భూకంపం దక్షిణ మరాత్వాడా ప్రాంతాన్ని ఘోరంగా దెబ్బతీసింది. లాతూర్, బీడ్, ఉస్మానాబాద్, జిల్లాలు భూకంపానికి గురైయ్యాయి. ముంబయికి ఆగ్నేయంగా 400 చ.కి.మీ భూభాగంలో భూకంపం ప్రభావం చూపింది. ఇది ఇంట్రా ప్లేట్ భూకంపంగా గుర్తించబడుతుంది. లాతూర్ నగరం దాదాపు ధ్వంసం అయింది. భూకంప అలలు 12 కి.మీ లోతు వరకు వ్యాపించాయని భావిస్తున్నారు. భూకంపం తెల్లవారుఝామున 3.56 సంభవించినందున ప్రజలు ఘాఢనిద్రలో ఉన్న కారణంగా ప్రాణనష్టం అధికంగా సంభవించింది. భూకంపం తరువాత భారతదేశం అంతటా సిసిమిక్ జోంస్, బిల్డింగ్ కోడ్స్ తిరిగి వర్గీకరించబడ్డాయి.
వెలుపలి లింకులు సవరించు
మూలాలు సవరించు
- ↑ In the 2011 census, Latur City had a population of 382,754."Provisional Population Totals, Census of India 2011: Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). p. 6. Archived (PDF) from the original on 2 April 2013. Retrieved 27 November 2014.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Registrar General & Census Commissioner, India. 2011. Archived from the original on 2012-05-05. Retrieved 2011-09-30.
- ↑ "Vision 2032: Chapter 25 Revenue Administration, Land Record and Implementaion of Land Laws: Latur District" (PDF). Latur District. Archived from the original (PDF) on 2013-04-29. Retrieved 2014-11-27.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Kuwait 2,595,62
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nevada 2,700,551
- ↑ 6.0 6.1 "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-04-01. Retrieved 2014-11-27.
- ↑ "Election Commission website" (PDF). Archived from the original (PDF) on 2009-03-06. Retrieved 2014-11-27.
- ↑ "Reliance Airport gets five projects on lease". Times of India. 6 Aug 2009. Archived from the original on 27 సెప్టెంబరు 2012. Retrieved 19 September 2011.
- ↑ "Vilasrao Deshmukh's demise: VVIP flow congests airports". DNA. 15 Aug 2012. Retrieved 18 Aug 2012.
- ↑ "Train Timetable Latur". Archived from the original on 2010-10-09. Retrieved 2014-11-27.