లాహౌల్

హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లా

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 12 జిల్లాలలో లాహౌల్-స్పితి జిల్లా ఒకటి. ఇందులో లాహౌల్, స్పితి అనే రెండు ప్రత్యేక జిల్లాలు ఉన్నాయి. లాహౌల్ జిల్లాకు కేలాంగ్ కేంద్రంగా ఉంది.స్పితి జిల్లాకు ధన్‌కర్ పట్టణం కేంద్రగా ఉంది. ఈ జిల్లా 1960లో రుఇపొందించబడింది. " కుంజం లా " లేక " కుంజం పాస్ " (సముద్రమట్టానికి 4,551మీ ఎత్తులో ఉంది) లాహౌల్ నుండి స్పితి లోయకు ద్వారంగా ఉంది. ఇది చంద్రతాల్‌కు 21 కి.మీ దూరంలో ఉంది.[1] ఈ జిల్లా రోతంగ్ పాస్ ద్వారా మనాలితో అనుసంధానితమై ఉంది. స్పితి జిల్లా సరిహద్దులు 24 కి.మీ దూరంలో ఉన్న తబు వరకు విస్తరించి ఉన్నాయి. అక్కడి నుండి రహదారి మార్గం సుర్నాడు నుండి కిన్నౌర్లో ప్రవేశించి జాతీయరహదారి 22 తో కలుస్తుంది. సహజ గుణాలలో రెండు లోయలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. స్పితి లోయ వృక్షరహితంగా ఉండి దాటడానికి కఠినతరంగా ఉంటుంది. ఈ లోయ సరాసరి ఎత్తు సముద్రమట్టానికి 4, 270 మీ ఎత్తులో ఉంది. ఈ లోయ స్పితి నది వరకు విస్తరించి ఉంది. ఇక్కడి నుండి స్పితి ఆగ్నేయంగా ప్రవహించి సట్లైజ్ నదితో సంగమిస్తుంది. సరాసరిగా 170మి.మీ వర్షపాతం కలిగిన ఈ ప్రాంతం పర్వతప్రాంతం ఏడారి కోవకు చెందింది.[2] భారతదేశంలోని 640 జిల్లలలో లాహౌల్, స్పితి జిల్లా జనసాంధ్రతలో 3 వ స్థానంలో ఉంది.[3]

Lahaul and Spiti लाहौल एंड स्पीति لاهول اینڈ سپيت జిల్లా
Himachal Pradesh లో Lahaul and Spiti लाहौल एंड स्पीति لاهول اینڈ سپيت జిల్లా స్థానము
Himachal Pradesh లో Lahaul and Spiti लाहौल एंड स्पीति لاهول اینڈ سپيت జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంHimachal Pradesh
పరిపాలన విభాగముTwo
ముఖ్య పట్టణంKeylong
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు01
విస్తీర్ణం
 • మొత్తం13,833 కి.మీ2 (5,341 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం31,528
 • సాంద్రత2.3/కి.మీ2 (5.9/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత86.97%(male),66.5%(female)
 • లింగ నిష్పత్తి916
ప్రధాన రహదార్లుone(Manali-Leh National Highway)
సగటు వార్షిక వర్షపాతంScanty Rainfall మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

వృక్షజాలం , జంతుజాలంసవరించు

 
Lahaul valley in winter
 
Mountain peak in Lahaul and Spiti district

లాహౌల్ జిల్లాలో నెలకొని ఉన్న వాతావరణ కారణంగా జిల్లాలో సముద్రమట్టానికి 4,000 మీ ఎత్తువరకు ఉన్న భూభాగంలో చిన్నచిన్న పసరిక భూములు, పొదలతో కూడిన భూములు మాత్రమే ఉన్నాయి. జిల్లాలోని 5,000 మీ ఎత్తులో గ్లాసియర్లు ఏర్పడి ఉన్నాయి. జిల్లాలోని ఆటవిక ప్రాంతంలో యాక్, డాజ్ వంటి జంతువులు అరణ్యప్రాంత మైదానాలలో సంచరిస్తుంటాయి. అయినప్పటికీ అత్యధికంగా వేటాడడం, ఆహారం కొరత కారణంగా ఈ ప్రాంతంలో " టిబెట్ యాంటిలోప్ ", మంచు చిరుతలసంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇవి అంతరించిపోతున్న జీవజాలాల జాబితాలోకి చేర్చబడ్డాయి. లాహౌల్ లోయలో ఐబెక్స్, బ్రౌన్ బియర్, నక్క, మంచు చిరుతలు ఉన్నాయి.

ప్రజలుసవరించు

 
Mother and child in near Gandhola Monastery. 2004

లాహౌల్ భాష, సంస్కృతి, జసంఖ్య ఒకదానితో ఒకటి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. లాహౌల్ ప్రజలు ఆర్య సంతతికి చెందిన వారని స్పితి ప్రజలు టిబెట్ సంతతి వారని భావిస్తున్నారు. స్పితి భోటియా ప్రజలు అత్యధికంగా టిబెటన్ల వలె ఉంటారు. వారు అధికంగా టిబెటన్ల సంతతికి చెందినవారై ఉంటారని భావిస్తున్నారు. లాహౌల్ ప్రజలు తెల్లని శరీర వర్ణం, గోధుమ వర్ణం కనుపాలలు కలిగి ఉంటారు.

లాహౌలీలో కుటుంబవ్యవస్థసవరించు

ఈ జిల్లాల భాషలలో ప్రధానమైనవి లాహౌలీ, స్పితి భౌలియా (టిబెటన్ కుటుంబం). సంస్కృతికంగా వీరు లఢక్, టిబెటన్లను పోలిఉంటారు. వీరు గాజ్, లఢక్ రాజ్యాల పాలనలో ఉండే వారు. లాహౌలీలు కుటుంబ సభ్యుల మద్య బలమైన సంబంధాలుంటాయి. ఉమ్మడి కుటుంబాలు వీరిలో సాధారణం. గతంలో వీరికి బహుభతృత్వం ఆచారం ఉండేది. కుటుంబానికి పురుషసభ్యుడు పెద్దగా (యుండ) వ్యవహరిస్తాడు. కుటుంబపెద్ద భార్యను యుండమో అని పిలుస్తారు. లాహౌల మద్య రుహు (తెగ) విధానం కూడా సంఘంలో ప్రధానపాత్ర వహిస్తూ ఉంది.

స్పితిలో కుటుంబవ్యవస్థసవరించు

స్పితి ప్రజల కుటుంబ వ్యవస్థ టిబెటియన్లను పోలి ఉంటుంది. తండ్రి మరణం తరువాత ఇంటికి పెద్దకుమారునికి మాత్రమే వారసత్వంగా కుటుంబ సంపద మీద హక్కు సంక్రమిస్తుంది. పెద్ద కుమార్తెకు తల్లి ఆభరణాలు సంక్రమిస్తాయి. చిన్న వారికి వారసత్వంగా ఏమీ సంక్రమించదు. హిమాలయన్ గొంపాలలో పురుషులు సాంఘిక రక్షణ బాధ్యత వహిస్తారు.

జీవనసరళిసవరించు

లాహౌలీ, స్పితి ప్రజలు సంస్కృతి ఒకటిగా కనిపిస్తున్నప్పటికీ లాహౌల్ ప్రజలలో బహు భతృత్వం ఉండేది కానీ ప్రస్తుతం ఇది తగ్గుతూ వచ్చింది. స్పితి ప్రలలో బహు భతృత్వం లేనప్పటికీ ప్రత్యేక సందర్భాలలో ఏకాంత ప్రదేశాలలో ఇందుకు అనుమతి లభిస్తూ ఉండేది. గ్రామపెద్దల సమక్షంలో వివాహరద్దు నిరాడంబంరంగా నిర్వహించబడుతుంది. వివాహరద్దును దంపతులలో ఇద్దరికీ సమానంగా ఉంటుంది. భర్త భార్యకు వివాహరద్దు తరువాత భరణం ఇవ్వవలసి ఉంటుంది. భార్య పునర్వివాహం చేసుకోవడం ఆచారంగా లేదు. లాహౌలీలలో సాధారణంగా వివాహరద్దు లేదు. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. సాధారణంగా ఉర్లగడ్డలు పండించబడుతుంటాయి.ఇతర వృత్తులలో జతువుల పెంపకం, ప్రభుత్వకార్యక్రమాలు, ప్రభుత్వ సర్వీసులలో పనిచేయడం, ఇతర వ్యాపారాలు, నేత వంటి హస్థకళలు జీవనోపాధికి సహకరిస్తున్నాయి. లాహౌలీ, స్పితిలో నివాసగృహాలు టిబెటన్ శైలిలో నిర్మించబడుతుంటాయి. ఈ ప్రాంతంలో భూకంపం సభవించే అవకాశాలు అధికం.

ఆలయాలుసవరించు

 
Kunzum Pass between Lahul & Spiti

లాహైలీ ప్రజలలో అత్యధికులు టిబెటన్ బుద్ధిజం, హిందూయిజం కలిసిన ద్రుక్పా కగ్యూను ఆచరిస్తుండగా, స్పితి ప్రజలు మాత్రం టిబెట్ బుద్ధిజానికి చెందిన జెలుగ్పాను ఆచరిస్తున్నారు. లాహౌల్‌లో స్పితి సమీపప్రాంతంలో టోధ్/గర్ మతం బుద్ధిజం ప్రభావం అధికంగా ఉంది. లాహౌల్‌లో శివుడు ప్రధానదైవంగా త్రిలోకనాథ్ ఆలయం, అవలోకేశ్వర్ ఆలయం ఉంది. అవలోకేశ్వరాలయంలో బుద్ధుడు కూర్చున్న స్థితిలో ఉంటుంది. హిందువులు దీనిని నృత్యభంగిమలో కూర్చున్న శివుడిగా భావిస్తారు. ఈ శిల్పం 16వ శతాబ్ధపు శిల్పకళాకారులు చెక్కి ఉంటారని భావించబడుతుంది. కళావిధ్వశకుల చేత పురాతన నల్లరాతి శిల్పం విధ్వంసానికి గురికాగా తరువాత ఆస్థానంలో పాలరాతి శిల్పం స్థాపించబడింది. విధ్వంసానికి గురి అయిన పురాతన శిల్పం ఆలయ పునాదులలో ఉంచబడిందని భావిస్తున్నారు. ఇది 12వ శతాబ్దంలో కాశ్మీర్ భూభాగంలో రూపొందించబడింది.నిర్లక్ష్యానికి గురైన దూరప్రాంతపు గొంపా ఆలయాలు, ఇతర ఆలయాలను గురిచేసుకుని 12వ శతాబ్దంలో అత్యధికంగా కళాఖండాలు తస్కరణకు గురైయ్యాయి.

లంగ్ పీ చోయీసవరించు

టిబెటియన్ తరవాడ, హినూయిజం వ్యాపించక మునుపు ఈ ప్రాంతంలోని ప్రజలు టిబెటన్ మతం బాన్ మతానికి సమీపంలో ఉన్న లంగ్ పీ చోయీ (బలహీనమైన మతాలలో ఒకటి ) ఆచరణలో ఉంది. ఈ మతం అనుయాయులు ఇహ దైవానికి జంతువులను, మనుష్యులను బలి ఇవ్వడం ఆచారంగా ఉండేది. ఇహ అంటే దయ్యాలని అవి పెన్సిల్- సెడార్ వృక్షాలు, శిలలు, గుహలను ఆశ్రయించి ఉంటాయని అవి బలికోతురుంటాయని వాటికి బలి ఇచ్చి సంతృప్తి పతచాలని ప్రజలు విశ్వసించేవారు. లంగ్ పీ చోయీ మత ఆచారాలు లామాల ఆచారాలను పోలి ఉంటాయి. లామాలు ఇలాంటి అతీంద్రియ శక్తులను విశ్వసిస్తారు.

లోసర్సవరించు

జిల్లాలో జనవరి-ఫిబ్రవరి మాసాలలో లోసర్ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవ సమయాన్ని లామాలు నిర్ణయిస్తారు. దీపావళి పండుగను తలపించే ఈ ఉత్సవం టిబెటన్ శైలిలో జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో ప్రతికుంటుంబం నుండి 3 మంది సభ్యులు చేతితో దివీటీలను పట్టుకుని వచ్చి " బోన్ ఫైర్ "లో వెయ్యాలి. తరువాత భక్తులు సంపదలిచ్చే దేవిని ప్రార్థనలతో (సిస్కర్ అపా) సంతృప్తి పరుస్తారు.

మతంసవరించు

లాహౌల్ జిల్లాలో పఠాన్ బెల్ట్‌లో అత్యధికంగా హిందూయిజం అనుయాయులు ఉన్నారు. వీరిలో 14% ప్రజలను స్వంగల్స్ అంటారు. ఫిబ్రవరి- మార్చి మాసాలలో ఫగ్లి ఉత్సవం నిర్వహించబడుతుంది. దీనిని దాదాపు లోయ అంతటా జరుపుకుంటారు. చైనా , టిబెట్ క్యాండర్ ఆధారంగా జరిగే ఈ పండుగ కొత్తసంవత్సర ఆరంభపండుగ. పఠాన్ ప్రజలు ఈ లోయలో ఆలస్యంగా (క్రీ.శ1500 ) వచ్చి స్థిరపడిన వారని భావిస్తున్నారు. వీరి భాష ఆసియన్, చంబా, పంగి, పాష్టోంస్ , ఉఘరస్ భాషలను పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఈ బెల్ట్ వద్ద చంద్రా , భాగా నదులు సంగమించి చీనాబ్ నది ఆవిర్భావానికి నాంది పలికాయి. లాహౌల్ జిల్లాలో కిన్నౌర్ లోయ (కొక్సర్- డలాంగ్), పఠాన్ లోయ (మూలింగ్-ఉదయపూర్ భూభాగం), పునాన్ లేక తోడ్/గర్ (కేలాంగ్- జంస్కర్) ఉన్నాయి. పఠాన్ లోయ ప్రజలు అత్యధికంగా హిందువులు. ఒక్కో గ్రామానికి ఒక్కో గ్రామదేవత ఉంది. తినన్ లోయలోని ప్రజలు హిందూయిజం - బుద్ధిజం అనుయాయులు. పునాన్ (తోడ్-గర్) లోయ ప్రజలు అధికంగా బుద్ధిజం అనుయాయులు.

పర్యాటకంసవరించు

సహజ సౌందర్యం ,కీ గోంపా, ధంకర్ గోంపా, షషుర్, గురు ఘంతల్, కుంగ్రీ స్థూపం, బౌద్ధ స్థూపాలు కోమిక్‌లో సక్య సెక్టర్ వద్ద ఉన్న తన్యుద్ గోంపా, పిన్ లోయ, లాహ్లంగ్ షెర్ఖాంగ్ గోంపా (ఇది తబో స్థూపం కంటే పురాతనమైనదిగా భావించబడుతుంది), 550 సంవత్సరాల నాటి బౌద్ధ సన్యాసి ఘ్యూన్ మమ్మీ (ఏకైక బుద్ధిస్ట్ మమ్మీ) , చంద్రతాల్ మొదలైనవి ప్రబల పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.

తబో స్థూపంసవరించు

కాజో; హిమాచల్ ప్రదేశ్‌కు 45 కి.మీ దూరంలో ఉన్న ఆసక్తికరమైన తబో స్థూపం ఆసక్తికరమైన హిమాచల్ ప్రదేశ్ ప్రదేశాలలోఒకటి. 1960లో ఈ స్థూపం తన వెయ్యిసంవత్సరాల ఉత్సవం తీసుకున్న సమయంలో ఇది చాలా ప్రాబల్యం సంతరించుకుంది. ఇందులో బౌద్ధశిల్పాలు, బౌద్ధ శిలాఫలకాలు , తంగ్కాలు ఉన్నాయి. మట్టి పూత పూయబడిన పురాతనకాల గోంపా , పలు వ్రాతప్రతులు , దస్తావేజులు బధ్రపరచబడి ఉన్నాయి. పర్యాటకులకు ఇక్కడ భోజనశాలతో కూడిన ఆధునిక అతిథి గృహం అందుబాటులో ఉంది.

కర్డాంగ్ స్థూపంసవరించు

సముద్రమట్టానికి 3,500 మీ ఎత్తులో ఉన్న " కర్ధాంగ్ స్థూపం " కెలాంగ్‌కు 8 కి.మీ దూరంలో ఉంది. కర్ధాంగ్ తండి వంతెన ద్వారా రహదారితో 14 కి.మీ దూరంలో ఉన్న కెలాంగ్‌తో అనుసంధానమై ఉంది. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ స్థూపంలో పెద్ద ఎత్తున బౌద్ధ గ్రంథాలు (కంగ్యూర్ , తంగ్యూర్ వంటి అపురూప గ్రంథాలు) ఉన్నాయి.

పర్యాటకులుసవరించు

అత్యంత కఠినమైన వాతావరణం కారణంగా లాహౌల్ , స్పితిలో పర్యటించడానికి జూన్ - అక్టోబర్ మాసం వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో రహదార్లు హిమరహితంగా ఉంటాయి. ఎత్తైన పాసెస్ (రోతాంగ్ లా , కుంజుం లా ) స్పష్టంగా కనిపిస్తుంటాయి. స్పితి నుండి కిన్నౌర్ వరకు సంవత్సరమంతా ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. అయినప్పటికీ ఒక్కోసారి కొండచరియలు విరిగిపడడం , హిమపాతం వలన రహదార్లు మూసివేయబడతాయి.

స్పితిలో భౌద్ధ స్థూపాలుసవరించు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ భౌద్ధ కృంద్రాలలో స్పితి ఒకటి. ఇది ప్రముఖంగా " లామాల భూమిగా " వర్ణించబడుతుంది. ఈ లోయ అనేక బౌద్ధ స్తూపాలు , గోంపాలకు నిలయమై లామాలకు అభిమాన ప్రదేశంగా ఉంది. ప్రపంచ పసిద్ధి చెందిన స్పితి దలైలామాకు అభిమాన ప్రదేశంగా ఉంది.

కే స్థూపంసవరించు

స్పితిలోని కే స్థూపం భరతదేశంలో బుద్ధిస్టులకు ప్రధాన పరిశోధనా కేంద్రంగా ఉంది. ఇక్కడ 300 మంది లామాలు మతసంబంధిత శిక్షణ తీసుకున్నారు. స్పితిలో ఉన్న అతిపురాతన , అతిపెద్ద స్థూపంగా ఇది గుర్తించబడుతుంది. ఇక్కడ బుద్ధ , ఇతర దేవుళ్ళు , దేవతల అరుదైన చిత్రాలు , సుందర శిలాకాలు ఉన్నాయి. అంతే కాక అరుదైన తంగ్క చిత్రాలు , పురాతన సంగీత సాధనాలు (ఢంకా, సింబాల్స్ , డ్రంస్) ఉన్నాయి.

టాబూ స్థూపంసవరించు

టాబూ స్థూపం సముద్రమట్టానికి 3,050 మీ. ఎత్తున ఉంది. స్పితిలో ఉన్న టాబూ స్థూపం " అజంతా ఆఫ్ హిమాలయాలు "గా ప్రదిద్ధి చెందింది. 10వ శతాబ్దంలో భౌద్ధ సన్యాసి రిచన్ జంగ్పో చేత ఈ స్థూపం నిర్మించబడింది. ఈ స్థూపం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఈ స్థూపం 6 గురు లామాలకు ఆశ్రయం ఇచ్చింది. ఇందులో గొప్ప నైపుణ్యం కలిగిన శిల్పాలు, కళాఖండాలు, కుడ్యచిత్రాలు, తంఖాలు , స్తుక్కో ఉన్నాయి.

స్పితిలోని వృక్షజాలం , జంతుజాలంసవరించు

స్పితి జిల్లాలో మంచు చిరుతలు, ఐబెక్స్, హిమాలయ గోధుమవర్ణ ఎలుగుబంటి, మస్క్ జింక, హిమాలయ నీలి గొర్రె మొదలైన జంతువులు అధికంగా ఉన్నాయి. జంతుప్రేమికులకు ఇది అభిమాన ప్రదేశమని చెప్పవచ్చు. జిల్లాలో " పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, కిబ్బర్ వన్యప్రాణి అభయారణ్యం " అనే 2 అభయారణ్యంలు ఉన్నాయి. వీటిలో మంచు చిరుతలు వాటి ఆహార జంతువులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన మతవిశ్వాసాల కారణంగా స్పితి ప్రజలు జంతులను వేటాడరు.

అద్భుతమైన వన్యమృగాలతో స్పితి లోయలో వృజాలం , అడవి పుష్పాలకు కూడా నిలయంగా ఉంది. సాధారణంగా కనిపించని అరుదైన కాదినియా తాంసోనీ, సెసిలి ట్రిల్‌బం, క్రెపిస్ ఫ్లెక్సూస, కరగన బ్రెవిఫోలియ , క్రస్చెనినికొవియా సెరెటాయిడ్స్ వంటి మొక్కలు ఉన్నాయి. అంటే కాక ఈ ప్రాంతంలో 62 ఔషధ మొక్కలు ఉన్నాయి.

సాహస కృత్యాలుసవరించు

స్పితిలోని " టు డూ ట్రైల్స్ (పర్వతారోహణ) " పర్వతచోదకులకు సవాలుచేసే పర్వతారోహణ కార్యక్రమాలను అందిస్తూ చోదకులకు సరికొత్త హిమాలయ శిఖరాలను అధిరోహించే అవకాశం ఇస్తుంది. పర్వతారోహకులు పర్యాటకులను శిలాసదృశ్యమైన గ్రామాలు , పురాతన గోంపాలు, సుందర అరణ్యాలను దర్శింపజేస్తారు. ఈ ప్రాంతంలో కాజా-లగ్జ-హికిం-కోమిక్- కాజా, కజా-కీ - కిబ్బర్-గెటె- కాజా, కాజా-లోసర్-కుంజం లా , కాజా-తబో-సుంబో-నాకో వంటి పర్వతారోహణా మార్గాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ఎత్తైన పరంగలా పాస్ ( లడక్‌ను స్పితితో కలుపుతుంది), పిన్ పార్వతి పాస్, బాబా పాస్, హంప్త పాస్ వంటి పర్వతారోహణా మార్గాలు ఉన్నాయి. స్పితి పర్వతారోహణ కొరకు పర్వతారోహకులు టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, వంట సామగ్రి, ఉన్ని వస్త్రాలు, సన్‌స్క్రీన్ , సన్‌గ్లాసులు తప్పక తూసుకువెళ్ళాలి.

స్కీయింగ్సవరించు

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రాబల్యం సంతరించుకున్న స్కీయింగ్ చేసే అవకాశం స్పితిలో కూడా లభిస్తుంది. మచుదుప్పటి కప్పుకున్న పర్వతసానువులు మంచు స్కీయింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ స్కీయింగ్ చేసి ఆనందించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు.

యాక్ సఫారీసవరించు

స్పితిలో పర్యాటకులకు ఉత్తేజం కలిగించే సాహసాలలో యాక్ సఫారి ఒకటి. పర్యాటకులు యాకులను అద్దెకు తీసుకుని హిమాలయ సానువులలోని వృక్షజాలం , జంతుజాలాన్ని చూడవచ్చు. ఇలాంటి సఫారి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇది పర్యాటకులకు అపురూప అవకాశమని భావిస్తున్నారు. యాక్ సవారీతో పాటు గుర్రం స్వారీచేయడానికి అవకాశం లభిస్తుంది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 31,528, [3]
ఇది దాదాపు శాన్‌మారినో దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 638వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత 2 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం -5.1 %.[3]
స్త్రీ పురుష నిష్పత్తి 916:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 77.24%.[3]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వసతి గృహాలుసవరించు

కజా మద్యలో పలు విలాసవంతమైన వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో హెవెన్ ఇన్ స్పితి, డేలిక్ హౌస్, స్పితి హోటెల్ ముఖ్యమైనవి.

==సవరించు

ఫూట్‌నోట్స్సవరించు

 1. [1]
 2. Kapadia (1999), pp. 26-27.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. San Marino 31,817 July 2011 est. line feed character in |quote= at position 11 (help)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 • Ciliberto, Jonathan. (2013). "Six Weeks in the Spiti Valley". Circle B Press. 2013. Atlanta. ISBN 978-0-9659336-6-7
 • Handa, O. C. (1987). Buddhist Monasteries in Himachal Pradesh. Indus Publishing Company, New Delhi. ISBN 81-85182-03-5.
 • Kapadia, Harish. (1999). Spiti: Adventures in the Trans-Himalaya. 2nd Edition. Indus Publishing Company, New Delhi. ISBN 81-7387-093-4.
 • Janet Rizvi. (1996). Ladakh: Crossroads of High Asia. Second Edition. Oxford University Press, Delhi. ISBN 0-19-564546-4.
 • Cunningham, Alexander. (1854). LADĀK: Physical, Statistical, and Historical with Notices of the Surrounding Countries. London. Reprint: Sagar Publications (1977).
 • Francke, A. H. (1977). A History of Ladakh. (Originally published as, A History of Western Tibet, (1907). 1977 Edition with critical introduction and annotations by S. S. Gergan & F. M. Hassnain. Sterling Publishers, New Delhi.
 • Francke, A. H. (1914). Antiquities of Indian Tibet. Two Volumes. Calcutta. 1972 reprint: S. Chand, New Delhi.

అదనపు పఠనంసవరించు

 • Hutchinson, J. & J. PH Vogel (1933). History of the Panjab Hill States, Vol. II. 1st edition: Govt. Printing, Pujab, Lahore, 1933. Reprint 2000. Department of Language and Culture, Himachal Pradesh. Chapter X Lahaul, pp. 474–483; Spiti, pp. 484–488.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=లాహౌల్&oldid=2992238" నుండి వెలికితీశారు