లివర్‌పూల్
బ్రిటన్‌లోని నాల్గవ పెద్ద నగరం అయిన లివర్‌పూల్ జనాభా 20 లక్షలు. 1207లో బరోగా (చిన్న గ్రామంగా) ఆరంభమైన ఇది 1880లో నగరంగా గుర్తించబడింది. బ్రిటన్‌లోని అతి పెద్ద నౌకాశ్రయం ఇక్కడే ఉంది. నౌకాశ్రయం అభివృద్ధి చెందింది. స్కౌస్ అనే స్ట్యూ (సూప్) ఇక్కడ కనిపెట్టటంతో లివర్‌పూల్ పౌరులని ‘స్కౌసర్స్’ అంటారు. బీటిల్స్ నలుగురు ఇక్కడికి చెందినవారే. దీన్ని ‘వరల్డ్ కేపిటల్ సిటీ ఆఫ్ పాప్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడి అనేక ప్రాంతాలకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్‌ని ఇచ్చారు.
లివర్‌పూల్ ఆంగ్లికన్ కేథడ్రిల్:సవరించు
1978లో పూర్తయిన ఇది యూరప్‌లోని అతి పెద్ద ఆంగ్లికన్ కేథడ్రిల్. బాగా ఎతె్తైన దీని మీదకి మెట్లు లేదా ఎవిలేటర్స్ ఉపయోగించి ఎక్కవచ్చు. దీని పైనించి చూస్తే లివర్‌పూల్ నగరం మొత్తం కనిపిస్తుంది. దీని టవర్ ఎత్తు 660 అడుగులు. వాకర్ ఆర్ట్ గ్యాలరీ: 13వ శతాబ్దం నించి నేటి దాకా గీయబడ్డ అనేక చిత్రాలని ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లండ్‌లో లండన్ బయట అత్యధిక చిత్రాలు ఇక్కడే ఉన్నాయి. 1819లో విలియమ్ రోస్కోరుూ అనే అతను తన సేకరించిన 37 చిత్రాలతో దీన్ని ఆరంభించాడు. 1851కల్లా చాలా చిత్రాలు సేకరించబడ్డాయి. బ్రిటిష్ పార్లమెంట్ 1852లో ఒక చట్టం ద్వారా దీన్ని నేషనల్ మ్యూజియంగా గుర్తించింది. ఆ తర్వాత ఇది బాగా అభివృద్ధి చెందింది. రెంబ్రాంట్, టర్నర్, రోసెటీ, మిలాయిస్, హోల్బైన్ లాంటి ప్రముఖ చిత్రకారుల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి.
ఫామ్బీ పాయింట్:సవరించు
లివర్‌పూల్‌కి ఉత్తరాన గల సముద్రతీరం చక్కటి పిక్నిక్ స్పాట్‌గా మారింది. ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసిన అడవిలో నడక దారిని ఏర్పాటు చేశారు. పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
ది కేవర్న్ క్లబ్:సవరించు
మేథ్యూ స్ట్రీట్‌లోని ఈ క్లబ్‌లోనే మొదటిసారి బీటిల్స్ గ్రూప్ కచేరీ చేసింది. 1957లో జాజ్ కచేరీతో ఆరంభించిన ఈ క్లబ్‌కి ఈనాటికీ సంగీత ప్రియులు వెళ్తూంటారు. 1961 నించి 1963 దాకా బీటిల్స్ ఇక్కడ 292 కచేరీలు చేసి క్రమేపీ ప్రపంచ ప్రసిద్ధి పొందారు. 1997లో కాల్చి చంపబడ్డ బీటిల్ జాన్లెనన్ విగ్రహాన్ని ఈ క్లబ్ బయట ప్రతిష్ఠించారు. డిసెంబర్ 14, 1999న జీవించి ఉన్న ఏకైక బీటిల్ మేక్ కార్ట్నీ, 20వ శతాబ్దపు తన ఆఖరి కచేరీని ఇక్కడ ఇచ్చాడు. బీటిల్స్ వల్ల డ్రెస్ కోడ్ మారి, జీన్స్, జాకెట్స్ వేసుకుని రావడాన్ని ఇప్పుడు ఇక్కడ అనుమతిస్తున్నారు. సెయింట్ జార్జెస్ హాల్: లైమ్ స్ట్రీట్‌లో, రైల్వేస్టేషన్ ఎదురుగా గల ఈ హాల్, 1854లో ప్రజల కోసం ప్రారంభించారు. పాలరాతి స్తంభాలలు, మొజాయిక్ నేల, పైన షాండ్లియర్స్ గల ఈ హాల్లో ఛార్లెస్ డికెన్స్ తను రాసింది చదివేవాడు. కచేరీలు చేయడానికి ఇది మంచి ప్రదేశం. సిటీ కోర్టులు కూడా ఇక్కడే ఉన్నాయి. జాక్ ది రిప్పర్‌గా భావించబడ్డ జేమ్స్ మేబ్రిక్ భార్య ఫ్లోరెన్స్ హత్యా నేరాన్ని ఇక్కడే విచారించారు. ఇది ప్రిన్స్ ఛార్లెస్‌కి ఇష్టమైన భవంతి. ఇక్కడ ట్రేడ్ షోలు, ఆభరణాల ఎగ్జిబిషన్స్ మొదలైనవి జరుగుతూంటాయి.
ది బీటిల్స్ స్టోరీ:సవరించు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంగీతకారులు బీటిల్స్ లివర్‌పూల్‌లో ఓ చిన్న క్లబ్లో సంగీతాన్ని మొదలుపెట్టి, ప్రపంచ ఖ్యాతి పొందిన వివరాలని ఇక్కడి ఎగ్జిబిషన్లో చూడొచ్చు. వారి ఫొటోలు, ఉపయోగించిన వస్తువులు, వారి రికార్డులు, నటించిన రెండు చిత్రాలు మొదలైనవి ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. స్పెకీ హాల్: 1530లో ఓక్ చెక్కలతో స్పెకే అనే చోట నిర్మించబడ్డ పెద్ద హాల్ ఇది. ఒకప్పుడు ప్రీస్ట్లు ఇక్కడ బస చేసేవారు. వారి బెడ్రూమ్స్కి గల రంధ్రాలలోంచి చూసి గూఢచర్యం చేసేవారు. దీని యజమాని వారసులెవరూ లేకుండా మరణించడంతో ఇది నేషనల్ ట్రస్ట్ భవనంగా మారింది. రాయల్ లివర్ బిల్డింగ్: లివర్‌పూల్ మధ్యలో గల ఇది 1907లో నిర్మించబడింది. ఓ ఇన్సూరెన్స్ కంపెనీ తన ఆఫీస్ కోసం నిర్మించిన ఈ బిల్డింగ్ ఎత్తు 300 అడుగులు. ఒకప్పుడు ఇది యూరప్‌లోని అత్యంత ఎతె్తైన భవంతిగా ఉండేది. 25 అడుగుల చుట్టుకొలత గల రెండు గడియారాలు దీని టవర్‌కి అమర్చడంతో నావికులకు దూరం నించే టైం కనిపించేది. కింగ్ జార్జి ఐదుకి పట్ట్భాషేకం జరిగే సమయంలో, జూన్ 22, 1911న ఈ గడియారాలను ఆరంభించటం విశేషం.
జాన్లెనన్ హోమ్:సవరించు
1945-1963 మధ్య బీటిల్స్‌లో ఒకరైన జాన్ లెనన్ నివసించిన ఇల్లు ఇది. దీన్ని సందర్శించడానికి గైడెడ్ టూర్ ఉంది. తన ఆంటీ విన్నీతో ఐదవ ఏట నించి, ఇరవై మూడో ఏడు దాకా జాన్ ఈ ఇంట్లోనే నివసించాడు. అతను ఆ బెడ్రూంలోనే గంటల తరబడి సంగీతాన్ని వింటూ ప్రభావితం అయ్యాడు. ఈ ఇంటిని నేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఇంకా ఇక్కడ కస్బా కాఫీ క్లబ్, ఫార్ద్లిన్ రోడ్డులోని మరో బీటిల్ మేక్ కార్డినీ 1950 లలో, బాల్యంలో నివసించిన ఇల్లు (దీన్ని కూడా నేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది) లివర్‌పూల్ నౌకాశ్రయం. ఫ్రెష్ ఫీల్డ్ స్క్విరల్ ప్రిజర్వ్, ఇంటర్నేషనల్ స్లేవరీ మ్యూజియం, స్ట్ఫెటాన్ పార్క్ మొదలైనవి చూడొచ్చు.
ఎలా వెళ్ళాలిసవరించు
లండన్ నించి రైల్లో, రోడ్డు మార్గం, విమాన మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మే నించి సెప్టెంబర్ దాకా సీజన్. *
మూలాలుసవరించు
- ↑ "Is Liverpool still the world in one city?". Retrieved 1 May 2010.
- ↑ nomis – official labour market statistics. Nomisweb.co.uk. Retrieved on 17 July 2013.
- ↑ [1] Archived 2015-09-24 at the Wayback Machine. British Urban Pattern: Population Data (Epson).
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;ethnicity
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు