లేఖా వాషింగ్టన్

ఫ్ఫ్ఫ్లేఖా వాషింగ్టన్, భారతీయ సినీ నటి, ప్రొడక్ట్ డిజైనర్. ఆమె ఎక్కువగా తమిళహిందీ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. 2002లో శిల్పిగా మొదట ప్రసిద్ధి చెందిన లేఖ, ఆ తరువాత చెన్నైలో నాటక కళాకారిణిగా ప్రఖ్యాతి పొందింది. ఎస్.ఎస్.మ్యూజిక్ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పని చేసింది ఆమె. 2008లో జయమకొండాన్ అనే తమిళ సినిమాలో సహాయనటిగా కెరీర్ ప్రారంభించింది లేఖా. ఆ తరువాత ఆమె మల్టీస్టారర్ సినిమాలైన వేదం, వా ల్లో నటించింది.

తొలినాళ్ళ జీవితంసవరించు

చెన్నైలో జన్మించింది లేఖ. ఆమె తండ్రి కెన్నెత్ పూర్వీకులు బర్మీస్, ఇటాలియన్, పంజాబీ కుటుంబానికి చెందిన వారు కాగా, తల్లి గీతా మహారాష్ట్రకు చెందినది.[1] ఆమె తల్లిదండ్రుల కుటుంబాలు వివిధ ప్రాంతాలకు చెందినవారైనా, వారింట్లో ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో మాట్లాడుకుంటూ ఉన్నా, చెన్నైలో పుట్టి పెరగడం వల్ల తాను దక్షిణ భారతానికి చెందిన అమ్మాయిగా చెప్పుకుంటుంది లేఖ.[2]

చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చదివింది ఆమె. ఆ తరువాత జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో కొన్ని కోర్సులు చేసింది. మొదట లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ డిజైన్ లో కోర్సు చేసిన ఆమె, ఫిలిం అండ్ వీడియో కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఫిలిం మేకింగ్ చదువుకునే సమయంలో కెమెరా వెనకాల పనిచేయడం కన్నా, కెమెరా ముందు పనిచేయడమే మంచిది అని నిర్ణయించుకుంది లేఖ. ఆమె కోర్సు చేసే సమయంలో స్పూనెరిసం, క్యాచ్ 22, సన్ అనే షార్ట్ ఫిలింలు తీసింది. ఈ సినిమాలను మయన్మార్మారిషస్ లలో నిర్మించింది ఆమె.[3]

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భష ఇతర వివరాలు
1999 కదలర్ దినమ్ కంప్యూటర్ వద్ద అమ్మాయి తమిళం ఓ మరియా" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2004 యువ రాయబార కార్యాలయం వద్ద అమ్మాయి హిందీ అతిథి పాత్ర
2007 ఫ్రేమ్డ్ విని ఆంగ్లం
ఉన్నాలే ఉన్నాలే పెళ్ళీలో పెళ్ళీకూతురు తమిళం ఇల్లామై ఉల్లాసం" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2008 జయమ్‌కొండాన్ బ్రిందా శేఖర్ తమిళం
2010 వేదం లాస్యా తెలుగు
వా సరస్వతి తమిళం
హుడుగా హుడిగి సొనియా కన్నడ
2013 మత్రు కి బిజిలి కి మండొలా కామిని హిందీ అతిథి పాత్ర
కమినా వాసుకి తెలుగు
కళ్యాణ సమయల్ సాదమ్ మీరా చంద్రశేకరన్ తమిళం
2014 అరిమ నమ్‌బి మెఘా శర్మా తమిళం అతిథి పాత్ర
పీటర్ గయా కాం సే మిరా హిందీ
2015 డైనమైట్ నేహా శర్మా తెలుగు అతిథి పాత్ర

మూలాలుసవరించు

  1. She was never much of a cricket buff – Entertainment – DNA. Dnaindia.com: (24 May 2008). URL accessed on 1 March 2013.
  2. "Bowled over". The Hindu. Chennai, India. 14 June 2008.
  3. [1] Archived 2 ఫిబ్రవరి 2011 at the Wayback Machine