లేడీ హైద్రీ క్లబ్, హైదరాబాదు

లేడీ హైద్రీ క్లబ్ (హైదరాబాద్ లేడీస్ క్లబ్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న క్లబ్.[1] మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ క్లబ్ ను 1929లో అమీనా హైదరీ ప్రారంభించారు.[2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

లేడీ హైద్రీ క్లబ్

చరిత్ర మార్చు

 
1952లో జరిగిన సామాజిక కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న ఎలియనార్ రూజ్వెల్ట్

బ్రిటీషు అధికారుల కుటుంబాలకు చెందిన మహిళలు ఒకచోట సమావేశం కావడంకోసం, తీరిక సమయాల్ని గడపడంకోసం 1901లో బషీర్‌బాగ్ ప్రాంతంలో ఒక క్లబ్ ను ఏర్పాటు చేసుకున్నారు.[3] ఆ తరువాత అనువైన స్థలాన్ని తీసుకోని 1929, నవంబరు 29న లేడి బర్టన్ తో క్లబు నిర్మాణానికి శంకుస్థాపన చేయబడింది. 1929, డిసెంబరు 17న లేడి ఇర్విన్ చే ప్రారంభించబడింది. ఇక్కడ టెన్నిసు ఆట అడేవారు.[4] ఈ క్లబులో 1952లో సామాజిక కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధాన వక్తగా ఎలియనార్ రూజ్వెల్ట్ ప్రసంగించారు.

ఈ భవనాన్ని జైన్ యార్ జంగ్ రూపొందించాడు.

కార్యక్రమాలు మార్చు

మహిళలు తంబోలా, కార్డులు లేదా బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడవచ్చు,వంట, కుట్టు పనికి సంబంధించిన పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇక్కడ మహిళలకు వార్షిక టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఒకప్పుడు ఈ క్లబులో పేదవారి కోసం పాఠశాలను కూడా నడిపింది. అంతేకాకుండా ఇందులో , తెలుగు, ఉర్దూ, ఆంగ్ల పుస్తకాలతో కూడిన గ్రంథాలయం కూడా ఉంది.

ప్రముఖ సభ్యులు మార్చు

  1. సరోజినీ నాయుడు
  2. లేడి టాస్కర్
  3. ప్రిన్సెస్ దారు షెరియాన్
  4. అమీనా హైదరీ
  5. ప్రిన్సెస్ నీలోఫర్

ప్రస్తుతం మార్చు

1986లో మహాత్మా గాంధీ వైద్య కళాశాల కోసం ఈ భవనం ఉపయోగించబడింది.[3] 2011 నాటికి ఈ క్లబులో 120 మంది సభ్యులు ఉన్నారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Rangan, Pavithra S. "Lady Hydari Club yearns for past glory". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 4 April 2019.
  2. లేడీ హైద్రీ క్లబ్,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 94
  3. 3.0 3.1 Kumar, Sanjeeva. "Lady Hydari Club". Retrieved 4 April 2019.
  4. "I've always struggled with my relationship with my father: Aditi - Times of India". The Times of India. Retrieved 4 April 2019.