లైలా (2025 సినిమా)
లైలా 2025లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించాడు.[1] విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 17న,[2] ట్రైలర్‌ను ఫిబ్రవరి 6న విడుదల చేసి,[3] సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేశారు.[4][5]
లైలా | |
---|---|
![]() | |
దర్శకత్వం | రామ్ నారాయణ్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | రిచర్డ్ ప్రసాద్ |
కూర్పు | సాగర్ దాడీ |
ఆర్ట్ డైరెక్టర్ | బ్రహ్మ కడలి |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 14 ఫిబ్రవరి 2025(థియేటర్) 9 మార్చి 2025 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లైలా సినిమా మార్చి 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీస్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6][7]
కథ
మార్చుహైదరాబాద్ పాతబస్తీలో సోనూ మోడల్ (విశ్వక్ సేన్) మేకప్ ఆర్టిస్ట్. అదే ప్రాంతంలో శంకర్ (‘పెళ్లి’ పృథ్వీ) ఎస్ఐగా పనిచేస్తుంటాడు. అతని ఇద్దరి భార్యల వ్యవహారం సోనూ ద్వారా బయటపడటంతో అతనిపై పగపడతాడు. లోకల్ డాన్ అయిన రుస్తుం (అభిమన్యు సింగ్) ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తుంటాడు ఈ క్రమంలో సోను మేకప్ వేసిన కామాక్షి భాస్కర్లని చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమె నల్లగా ఉంటుందని, అదంతా మేకప్ అని పెళ్లయ్యాక తెలియడంతో రుస్తుం సోనుపై పగపెంచుకుంటాడు. ఈ క్రమంలో ఎస్ఐ శంకర్, డాన్ రుస్తుం ఇద్దరి నుండి సోనూ సమస్యలు ఎదురతాయి. వాటి నుంచి గట్టెక్కాలంటే పారిపోవడమే మంచిదని స్నేహితుడు సలహా ఇవ్వగా సోనూ అలా చేయకుండా లైలా అనే అమ్మాయిగా గెటప్ మర్చి వారి నుండి తప్పించుకు తిరిగాడు? లైలా అమ్మాయి కాదని వారికీ తెలిశాక ఏం జరిగింది? వారి నుండి సోను ఎలా తప్పించుకున్నాడు, ఆ తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[8]
నటీనటులు
మార్చు- విశ్వక్సేన్ - ద్విపాత్రాభినయం[9]
- ఆకాంక్ష శర్మ
- పృథ్వీ రాజ్
- వెన్నెల కిషోర్
- రవి మరియా
- నాగినీడు
- హర్ష వర్ధన్
- బ్రహ్మాజీ
- బబ్లూ పృథివీరాజ్
- రఘు బాబు
- అభిమన్యు సింగ్
- వినీత్ కుమార్
- సురభి ప్రభావతి
- మల్లేశ్ బలష్టు
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "విజిలు విజిలు[10]" | విశ్వక్సేన్ | నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ | 4:30 |
2. | "ఓహో రత్తమ్మ[11]" | పెంచల్ దాస్, మధుప్రియ | పెంచల్ దాస్ | 3:06 |
3. | "ఇచ్చుకుందాం బేబీ[12]" | పూర్ణాచారి | ఆదిత్య ఆర్.కె, ఎం.ఎం. మనసి |
మూలాలు
మార్చు- ↑ "'లైలా' విషయంలో అదే మా ధ్యేయం: నిర్మాత సాహు గారపాటి". Eenadu. 10 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "బాబోయ్.. విశ్వక్ సేన్ లైలా టీజర్ చూశారా? అన్నీ డబుల్ మీనింగ్‌లే!". 18 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "విశ్వక్ సేన్ 'లైలా' మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఓ వైపు లేడీ గెటప్.. మరో వైపు హీరోయిన్ తో లిప్ కిస్‌లు." 10TV Telugu. 6 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "విశ్వక్ సేన్ 'లైలా' రిలీజ్ డేట్ ఫిక్సయింది... భలే డేట్ పట్టారుగా!". ABP Desham. 17 December 2024. Retrieved 10 February 2025.
- ↑ "వాలెంటైన్స్ డే రోజున వస్తున్న విశ్వక్ సేన్ లైలా." V6 Velugu. 16 December 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్‍సేన్ 'లైలా'.. రెండు రోజులు ఆలస్యంగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే." Hindustantimes Telugu. 9 March 2025. Retrieved 24 March 2025.
- ↑ "ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ లైలా మూవీ.. స్రీమింగ్ ఎక్కడంటే." TV9 Telugu. 10 March 2025. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
- ↑ "రివ్యూ: లైలా.. విశ్వక్‌సేన్ లేడీ గెటప్పులో నటించిన చిత్రం ఎలా ఉందంటే?". Eenadu. 14 February 2025. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
- ↑ "లైలాగా మారిన మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నయా మూవీ". TV9 Telugu. 3 July 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "నువ్ కొడతావ్ విజిలూ.. ప్రతి సెంటర్ పగులు." NT News. 30 December 2024. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "'ఓహో రత్తమ్మ' లిరికల్ సాంగ్". Chitrajyothy. 1 February 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "'లైలా' మూవీ నుంచి సెకండ్ సాంగ్ 'ఇచ్చుకుందాం బేబీ' వచ్చేసింది." 10TV Telugu. 23 January 2025. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.