వక్కలంక లక్ష్మీపతిరావు

వక్కలంక లక్ష్మీపతిరావు ప్రముఖ తెలుగు కవి, సాహితీకారుడు. కోనసీమ కవికోకిలగా లబ్దప్రతిష్టులాయన. వారికి ప్రకృతి పట్ల ఆరాధన, దేశాభిమానం, ప్రకృతికి మూలాధారమైన పరమేశ్వరుడంటే భక్తి మెండు. ప్రాచీన అధునాతన కవితా వారధిగా సుమారు నాలుగు తరాల శ్రోతలకు లక్ష్మీపతిరావు గారు సుపరిచితులు. అమలాపురం శ్రీ కోనసీమ భానోజీ రామర్సు కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా పనిచేశారు.[1]

వక్కలంక లక్ష్మీపతిరావు.

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1924 లోజన్మించారు.[2] ఆయన అనేక లలితగీతాలు, దేశభక్తి గీతాలు రచించారు. అవి 1970-90 ప్రాంతాలలో విరివిగా ఆకాశవాణి కేంద్రాలలో వినపిస్తూ ఉండేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆకాశవాణి కేంద్రాలనుంచి పున: ప్రసారం అవుతూ ఉంటాయి. అప్పట్లో ఆకాశవాణి గుర్తింపు ఉన్న రచయిత. ఇవే కాక ఇంకా అనేక గ్రంథాలు రాసారు. ఆయన రచనలను స్వర్గీయ రాష్ట్రపతి వి.వి.గిరి, అక్కినేని నాగేశ్వరరావు,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం లాంటి వారికి అంకితం యిచ్చారు. పారిజాతాపహరణం సిద్ధాంత వ్యాసం వ్రాసారు.ఈయన కావ్యాలు రాయడంతోపాతు దైవక్షేత్రాలపై చక్కనిపాటలు వ్రాసారు.[3] ఆయన కాళీదాసు మేఘ సందేశాన్ని తెలుగులో వ్రాసారు.[4]

రచనలు[5] మార్చు

  • సుమాంజలి
  • స్వాతంత్ర్యభారతి
  • కవితా లోకము
  • కవితావసంతం
  • వీరభారతము
  • జలదగితి

ఆయన రాసిన దేశభక్తి గీతం మార్చు

" నవభారతనందనాన
వలపు లొలుకుపువ్వుల్లారా !
తెలుగుతల్లివదనమ్మున
విరిసినచిరునవ్వుల్లారా !
నవతావాదుల్లారా !
మానవతావాదుల్లారా !
నవచైతన్యం ఉరకలు వేసే
యువతీయువకుల్లారా !
భారతయువతీయువకుల్లారా !
నవభారతనిర్మాతల్లారా ! "

మరణం మార్చు

ఆయన జూలై 15 2010 న మరణించారు.[6]

మూలాలు మార్చు

  1. "Dedicated to legendary Dedicated to legendary singer late Ghantasala Venkateswara Rao". Archived from the original on 2016-03-07. Retrieved 2015-07-29.
  2. జనన తేదీ ఆధారం 1924 -
  3. "ఆదివారం ( 11 - 07 - 2010 ) హైదరాబాద్ త్యాగరాయ గాన సభ లో జరిగిన సంతాప సభ వార్త - ఆంధ్రజ్యోతి నుండి..." Archived from the original on 2016-03-06. Retrieved 2015-07-29.
  4. "Kalidasa Sahiti Saptaham". Thi HIndu. Retrieved 26 October 2006.
  5. Vakkalanka Lakshmipathi Rao-1924 -
  6. "మధురకవి అస్తమయం". Archived from the original on 2016-03-06. Retrieved 2015-07-29.