వక్కలంక వీరభద్రకవి
వక్కలంక వీరభద్రకవి[1] సా.శ.1645 ప్రాంతమున జన్మించి సుమారు 1750 వరకు జీవించాడు. ఇతడు పిఠాపుర సంస్థానములో మొట్టమొదటి ఆస్థానకవి. ఇతడు భారద్వాజస గోత్రుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. తండ్రి భాస్కరమంత్రి. తల్లి జగ్గాంబ. పిఠాపుర సంస్థానాధీశుడైన రావు పెదమాధవరావు ఆశ్రితుడుగా సాహితీ సేవ చేశాడు. ఏనుగు లక్ష్మణకవి ఇతనికి సమకాలీనుడు. ఇతడు మేనమామ వెణుతురుబల్లి వేంకటాద్రి వద్ద సంస్కృతాంధ్రాలలో సాహిత్యజ్ఞానాన్ని పొందాడు.
వక్కలంక వీరభద్రకవి | |
---|---|
జననం | వక్కలంక వీరభద్రకవి 1645 |
మరణం | 1750 |
వృత్తి | పిఠాపుర సంస్థాన ప్రప్రథమ ఆస్థానకవి |
ప్రసిద్ధి | సంస్కృతాంధ్ర పండితుడు |
మతం | హిందూ |
తండ్రి | భాస్కరమంత్రి |
తల్లి | జగ్గాంబ |
రచనలుసవరించు
- వక్కలంక వీరభద్రకవి బాల్యములో కాళిదాస 'కుమారసంభవము'ను నాలుగు ఆశ్వాసముల కావ్యముగా తెలుగులోనికి అనువదించాడు. ఈ కావ్యము అలభ్యము. ఈ కావ్యములోని నాలుగు పద్యాలను కందుకూరి వీరేశలింగం పంతులు తన ఆంధ్ర కవుల చరిత్రములో ఉదహరించాడు.
- ఇతడు 'సేతుఖండము' అనే సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ కావ్యము కూడా అలభ్యము.
- ఇతడి మూడవ రచన వాసవదత్తా పరిణయము. సుబంధు అనే కవి రచించిన వాసవదత్తా అను సంస్కృత గద్య కావ్యానికి ఇది పద్యరూపమైన స్వేచ్ఛానువాదము. ఐదు ఆశ్వాసాలతో ఉన్న ఈ కావ్యాన్ని సుమారు 1685 ప్రాంతంలో రచించి పిఠాపురం మహారాజా రావు పెదమాధవరావుకు అంకితం చేశాడు. ఈ కావ్యాన్ని 1897లో వక్కలంక వీరభద్రకవి వంశస్థుడైన వక్కలంక భీమశంకరము రాజమండ్రి వివేకవర్థని ముద్రణాలయములో ముద్రించి ప్రకటించాడు.
మూలాలుసవరించు
- ↑ పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973