వక్కలంక సీతారామారావు
తెలుగు కవి
వక్కలంక సీతారామారావు తెలుగు రచయిత. అతను వసీరాగా సుపరిచితుడు. అతను ప్రస్తుతం టీవీ జర్నలిస్టు. అతను రాసిన " కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు కానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం " అనే వ్యాఖ్య అందరికీ సుపరిచితం[1].
జీవిత విశేషాలుసవరించు
అతను 1962 ఫిబ్రవరి 1న అమలాపురంలో జన్మించాడు. అతని గురించి తెలిసిన వాళ్లు బహు తక్కువ. ఎందుకంటే ప్రచారార్భాటానికీ దూరంగా ఉంటాడు. ప్రజాసాహితి పత్రికలో వచ్చిన వసీరా కవితలు అతన్ని కొత్త తరం పాఠకులకు సన్నిహితుణ్ని చేశాయి. అందుకే అతని తొలి కవితాసంకలనం 'లోహనది'లో ముందుగా ఆ పత్రికకే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వసీరా రాసిన 'డీహ్యూమనైజేషన్' కవిత అతనికి సీరియస్ కవి ప్రతిపత్తిని తెచ్చిపెట్టింది. వసీరా ఆలోచనల్లో, నమ్మకాల్లో, మూఢ నమ్మకాల్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ, అతని సీరియస్‌నెస్‌లో గానీ, ప్రయోజనశీలంలో గానీ ఎలాంటి కల్తీ కనిపించదు.[2]
రచనలుసవరించు
- లోహనది[3]
- మరోదశ
మూలాలుసవరించు
- ↑ "కొత్తతరం భావవ్యక్తీకరణ".
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Staff (2006-11-30). "ఉద్యమాలు కవులను సృష్టించవుః వసీరా". telugu.oneindia.com. Retrieved 2020-04-15.
- ↑ "వసీరా…మళ్ళీ ఇలాంటి కవిత్వం రాయరూ". జాజిమల్లి. 2011-07-10. Retrieved 2020-04-15.