వట్‌పల్లి మండలం

వట్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]ఇది ఆందోల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఆందోల్ -జోగిపేట్ రెవిన్యూ డివిజనులో భాగం.[4] పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.సవరించు

లోగడ వట్‌పల్లి గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవిన్యూ డివిజను పరిధిలోని ఆళ్లదుర్గ్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వట్‌పల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా,సంగారెడ్ది రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+18 (పందొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

  1. పోతులబొగుడ
  2. గొర్రెకల్
  3. వట్‌పల్లి
  4. షాహెద్‌నగర్ @ ఘట్‌పల్లి
  5. గౌతాపూర్
  6. పల్వట్ల
  7. నాగులపల్లి
  8. బుడ్డాయిపల్లి
  9. బిజిలీపూర్
  10. మర్వెల్లి
  11. కేరూర్
  12. మేడికుండ
  13. పులడుగు
  14. దేవెనూర్
  15. భూత్కూర్
  16. ఉసిరికపల్లి
  17. నిర్జిపాల
  18. ఖాదరాబాద్
  19. దుదియాల్

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Dishadaily (దిశ): Latest Telugu News (in ఇంగ్లీష్). Retrieved 2022-01-04.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-18.

వెలుపలి లంకెలుసవరించు